హంద్రీకాలువలో లభ్యమైన యువకుడి మృతదేహం ఆచూకీ లభ్యం
Published Wed, Oct 26 2016 11:31 PM | Last Updated on Wed, Sep 26 2018 6:21 PM
– నరబలి ఇచ్చారని తల్లి ఫిర్యాదు
వెల్దుర్తి రూరల్: స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువలో మల్లెపల్లె పంపింగ్ స్టేషన్ వద్ద గత ఆదివారం గుర్తుతెలియని యువకుడి, చిన్నారి మృతదేహాలు కొట్టుకువచ్చి తేలియాడుతూ కనిపించిన విషయం తెలిసందే. విచారణ చేపట్టిన ఎస్‌ఐ తులసీనాగప్రసాద్ బుధవారం మృతుని ఆచూకీ లభ్యమైనట్లు తెలిపారు. పత్రికల్లో గుర్తుతెలియని మృతదేహాలను వార్త రావడంతో అనుమానం వచ్చిన పాములపాడు మండలం ఎర్రగూడూరు గ్రామానికి చెందిన మృతుని తల్లి నాగమ్మ, బంధువులు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మృతుని దుస్తులు చూసి తల్లి నాగమ్మ తన కుమారుడు మాల వెంకటేశ్వర్లుగా(23) గుర్తించింది. డిగ్రీ పూర్తి చేసిన వెంఽకటేశ్వర్లు ఇటీవలే అదే గ్రామస్తుడు రమేష్‌కు చెందిన జేసీబీకి హెల్పర్‌గా నెలక్రితం చేరాడు. కాగా తన కుమారుడిని రమేష్‌తో పాటు జేసీబీ డ్రైవర్ చంద్ర కలిసి జేసీబీ యంత్రానికి నర బలి ఇచ్చారని తల్లి నాగమ్మ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ
Advertisement
Advertisement