
‘హంద్రీ-నీవా నీటిని తరలిస్తే అడ్డుకుంటాం’
హంద్రీనీవా సుజల స్రవంతి పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చలువేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు....
పెనుకొండ : హంద్రీనీవా సుజల స్రవంతి పథకం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చలువేనని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర నారాయణ అన్నారు. ఈ కాలువ నీటిని కుప్పంకు తరలించాలని చంద్రబాబు చేస్తున్న కుటిల యత్నాలను అడ్డుకుంటామన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలే కరులతో మాట్లాడారు. వైఎస్సార్ హ యాంలో హంద్రీ నీవా కాలువ పనులు 80 శాతం పూర్తయితే నేడు పైపూత పనులు చేస్తున్న చంద్రబాబు హంద్రీనీవాట ఘనత తనదేనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఈ పథకాన్ని తాగునీటి పథకంగా మారుస్తూ కుప్పంకు తాగునీటిని తరలించే కుట్రలు చేస్తున్నారని తెలిపారు. ఈ నీటిని తరలించడానికి సీఎం ప్రత్యేక జీవో సిద్ధం చేస్తున్నారన్నారు.
జిల్లా ప్రజలకు, రైతులకు అన్యాయం చేస్తే వామపక్షాలతో కలసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడ తామన్నారు. 9 యేళ్లు రాష్ట్రాన్ని పాలిం చిన చంద్రబాబు కేవలం రూ. 9 కోట్లు హంద్రీనీవాకు నిధులు ఇస్తే, మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రూ.6 వేల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. హంద్రీనీవాకు తగిన నిధులు ఇవ్వకుండా తగుదునమ్మా .... అంటూ అనంతపురం జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టి నీరు కుప్పం తరలించాలని చూస్తే ప్రజలు, రైతుల పక్షాన వైఎస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు.
రాష్ట్ర లీగల్ కార్యదర్శి న్యాయవాది భాస్కరరెడ్డి, మండల కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, టౌన్ క న్వీనర్ ఇలియాజ్, మాజీ మార్కెట్‌యార్డ్ చైర్మన్ నాగలూరు బాబు, బీసీసెల్ పట్టణాధ్యక్షుడు యస్‌బీ.శీనా, ఎంపీటీసీ రామ్మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు రాజగోపాలరెడ్డి, ముఖ్య నాయకులు గౌస్‌లాజం, శ్యాంనాయక్,ప్రసాద్, కొండలరాయుడు, బాబు, శ్రీరాములు, సోమశేఖరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.