హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ తన పోరాటాన్ని కొనసాగిస్తానని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుకు తక్షణం రూ.100 కోట్లు కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గురువారం నిరహారదీక్ష విరమించిన అనంతరం విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడారు. హంద్రినీవా ప్రాజెక్టు పూర్తయ్యేవరకూ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తానని తెలిపారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ సోదరులు రాజ్యంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. హంద్రినీవా ప్రాజెక్టు చేయాలనే డిమాండ్ తో విశ్వేశ్వరరెడ్డి బుధవారం దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఆయన 25 గంటల దీక్ష చేసిన అనంతరం ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.