
'చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేదని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీలో... బయట అణచి వేయాలని చూస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.
రేణిగుంట విమానాశ్రయం సిబ్బందిపై దాడి చేశారని ఆరోపిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎంపీ పి. మిథున్రెడ్డి, పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆ పార్టీ నాయకుడు బి. మధుసూదన్రెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వై. విశ్వేశ్వరరెడ్డి పై విధంగా స్పందించారు. ఇదిలా ఉంటే వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని విచారణ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.