హైదరాబాద్: ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అసమర్థత, మెతక వైఖరి కారణంగా తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో చంద్రబాబు విఫలం అయ్యారని చెప్పారు. నీరు, నిధులు, ఆస్తుల పంపకాల్లో చంద్రబాబు ఇంకా మెతక వైఖరినే అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని, రైతులు కరువు కాటకాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘సీట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ రైతులపై ఏది?’
Published Sat, Apr 15 2017 2:05 PM | Last Updated on Tue, Oct 30 2018 5:12 PM
Advertisement
Advertisement