‘ఆయన ధ్యాసంతా అమరావతి పైనే’
అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ‍్వర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పేదల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు అందక పేదప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. చంద్రబాబు ధ్యాసంతా అమరావతిపైనే ఉందని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయనున్నట్టు విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. ఉరవకొండలో పేద ప్రజల జాబితా తయారైనా పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం వెనకాడుతోందన్నారు.