అనంతపురం: అనంతపురం కణేకల్లో హెచ్ఎల్సీ కెనాల్లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం సత్వర చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం హెచ్ఎల్సీ కెనాల్లో ఇద్దరు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే.
విద్యార్థుల ఆచూకీ కోసం కణేకల్ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని వై.విశ్వేశ్వరరెడ్డి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబును కోరారు. అలాగే విద్యార్థుల ఆచూకీని త్వరితగతిన కనుక్కోవాలని కర్ణాటక అధికారులకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం విశ్వేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం బళ్లారి వెళ్లారు. అధికారులను కలిసి విద్యార్థుల ఆచూకీపై అభ్యర్థించారు.