
సాక్షి, అనంతపురం: ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గటం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబును ఆయన పొలిటికల్ పార్టనర్ పవన్ కళ్యాణ్ ఒప్పించాలన్నారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్ నాటకాలు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటాలు చేస్తున్న ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని పునరుద్ఘాటించారు. చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే వైఎస్ జగన్ చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఇప్పటికే కార్యాచరణ ప్రకటించింది. మార్చి 5 నుంచి ఏప్రిల్ 5 వరకు వివిధ దశల్లో పోరాటం కొనసాగిస్తామని వైఎస్ జగన్ తెలిపారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఆయన ప్రకటించారు.