
అనంతపురం: ప్రత్యేక హోదాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డుగా ఉన్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని అన్నారు. అంతేకాకుండా విభజన చట్టం హామీల అమలుకు బాబు ఏమాత్రం కృషి చేయలేదని చెప్పారు.
ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రాజీలేని పోరాటం చేస్తున్నారని విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈ నెల 10న జరిగే యువభేరికి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్యాలని ఆయన కోరారు. ఇందులో జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.