అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి బుధవారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాయలసీమ రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీ - నీవా తొలిదశ పనులు పూర్తవుతాయన్నారు.
అయితే హంద్రీ - నీవా డిస్ట్రిబ్యూటరీ పనులు ఎందుకు ఆపారో చెప్పాలని ఈ సందర్భంగా చంద్రబాబును డిమాండ్ చేశారు. విదేశీ పర్యటనలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్న బాబుకు రైతుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. ఉరవకొండ హంద్రీ - నీవా ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వానికి విశ్వేశ్వర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.