
నిప్పు అయితే తప్పుకో
ఓటుకు నోటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై. విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
అనంతపురం: ఓటుకు నోటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వై. విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజీనామా కోరుతూ ఆయన మంగళవారం ఉరవకొండలో మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు నిప్పులాంటి మనిషి అయితే వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి... ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించుకోవాలన్నారు. తాను చేసిన తప్పును రెండు రాష్ట్రాల మధ్య తగాదాగా మార్చుతున్నారని చంద్రబాబుపై విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు.