అనంతపురం : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శకుని పాత్ర పోషించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిరాశ కలిగించాయని చెప్పారు. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల కంటే రాజకీయ లబ్ది కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్‌పై పోరుబాటను మరింత ఉధృతం చేస్తామని వై.విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
'శకుని పాత్ర పోషించిన మంత్రి యనమల'
Published Sat, Apr 2 2016 1:31 PM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM
Advertisement
Advertisement