అనంతపురం జిల్లా కూడేరు పోలీసుస్టేషన్ వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అనంతపురం: అనంతపురం జిల్లా కూడేరు పోలీసుస్టేషన్ వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. కనగల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, ఆమె భర్త బాలన్నతో పాటు మరో ముగ్గురు కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారు. అక్రమ కేసులకు నిరసనగా ఉరవకొండ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే యే వై.విశ్వేశ్వర రెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు కూడేరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతల ఒత్తిడితోనే వైఎస్ఆర్ సీపీ నాయకులను, కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు.