
'తుంగభద్ర ఎగువ కాలువకు అన్యాయం జరిగింది'
అనంతపురం : తుంగభద్ర ఎగువ కాలువకు ఈసారి అన్యాయం జరిగిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం అనంతపురం జిల్లాలోని గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ను ఆయన పరిశీలించారు. అనంతరం వై.విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ... పంటలు ఎండిపోతున్నా టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. హంద్రీనీవా నీటిని తుంగభద్ర ఎగువ కాలువకు మళ్లించి వెంటనే జిల్లాలోని రైతులను ఆదుకోవాలని టీడీపీ ప్రభుత్వాన్ని వై.విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు.