
'జన్మభూమి'కి ప్రజాదరణ కరువు
అనంతపురం: టీడీపీ ప్రభుత్వం చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి ప్రజాదరణ కరువైందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వ్యవసాయ రుణమాఫీపై రోజుకో మెలిక పెడుతూ రైతులను సీఎం చంద్రబాబు దగా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇన్ఫుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కోసం తమ జిల్లా రైతులకు రూ. 850 కోట్లు అవసరంకాగా, ఈ నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు.