
రూ.5వేల కోట్లు కేటాయించాలి : వైఎస్సార్‌సీపీ నేతలు
అనంతపురం : అనంతపురం జిల్లాకు రూ.5వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కరువు బృందాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కోరారు. మంగళవారం జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర బృందాన్ని నేతలు కలిసి కరువుతో అల్లాడుతున్న జిల్లాను ఆదుకోవాలన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. జిల్లాలో ఉపాధి పనులు పెంచడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర కరువు బృందాన్ని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకరనారాయణ తదితరులు ఉన్నారు.