
రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు
36 గంటల ధర్నాలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్
అనంతపురం రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేస్తున్నాయని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆర్డీవో కార్యాలయం ఎదుట 36 గంటల ధర్నాను చేపట్టింది. శుక్రవారం ఎమ్మెల్యే ఈ శిబిర ాన్ని సందర్శించి మద్దతు ప్రకటిం చారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులపట్ల చిత్తశుద్ధి లేదన్నారు. రైతు ఆత్మహత్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి, రాష్ట్ర ప్రభుత్వానికి అక్షిం తలు వేసినా మార్పు లేదన్నారు. జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టి సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించకుండా కమీషన్ల కోసం పాలకులు పాకులాడుతున్నారని ఆరోపించారు.
పట్టిసీమకు ఇప్పటి వరకు రూ.12వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. అయినా సీమకు చుక్కనీరు రాలేదన్నారు. అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి రాయలసీమ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాలకు సాగునీరు అందించి రైతు ఆత్మహత్యలను అరికట్టాలన్నారు.
ఎ మ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను ప్రభుత్వమే రెసిడెన్షియల్ పాఠశాలలో చదివించి రైతు కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అనంతరం ఆర్డీవో మలోలకు డి మాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రాం భూపాల్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, కార్యదర్శి పెద్దిరెడ్డి, రిడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి భానుజా, నాయకులు రామాంజినేయులు, రా యుడు, నగేష్, దిల్షాద్ పాల్గొన్నారు.