
హంద్రీనీవాకు నిధులు కేటాయించాలి
ఆనంతపురం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసి, 2016 నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ఉరంకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
గుంతకల్లు: ఆనంతపురం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసి, 2016 నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ఉరవకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తిచేయాలని విశ్వేశ్వర రెడ్డి బుధవారం నిరాహారదీక్ష ప్రారంభించారు.
ఉరవకొండలోని హంద్రీనీవా ప్రాజెక్టు శిలాఫలకం వద్ద ఆయన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు గురువారం ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రోజా, అఖిల ప్రియ ఎమ్మెల్సీ దేవగుడి నారయణ రెడ్డి హజరై మద్దతు తెలిపారు.