
'హంద్రీనీవా' కోసం ఎమ్మెల్యే నిరాహారదీక్ష
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి నిరాహారదీక్ష బుధవారం ప్రారంభించారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి బుధవారం నిరాహారదీక్ష ప్రారంభించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని హంద్రీనీవా ప్రాజెక్టు శిలాఫలకం వద్ద నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి నిరశన దీక్ష చేపట్టారు.
త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో హంద్రీనీవాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. కచ్చితంగా 100 టీఎంసీల నీటిని హంద్రీనీవా ప్రాజెక్టుకు కేటాయించాలన్నారు. విశ్వేశ్వర రెడ్డి నిరాహారదీక్షకు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, జయరాముడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ సంఘీభావం తెలిపారు.