Handri Neeva Project
-
ప్రాజెక్టులకు కొత్త కళ
బి.కొత్తకోట : అనంత వెంకటరెడ్డి హంద్రీ–నీవా రెండోదశ సాగు, తాగునీటి ప్రాజెక్టులో అంతర్భాగంగా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పటికే రామసముద్రం ఉపకాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ పనులకు సర్వేకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా ఆ పనులు పూర్తయ్యాయి. ఈ రెండింటికి పాలనాపర అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. గుర్రంకొండ మండలంలో కొత్తగా రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కార్యరూపం దాల్చుతోంది. దీనికి సంబంధించి స్టేజ్–1 పనులు పూర్తయ్యాయి. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులకు ఈనెల 13న జరిగే రాష్ట్రస్థాయి సాంకేతిక కమిటీ ఆమోదం తెలపనుంది. గడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానుండగా, కుప్పం ఉపకాలువ మిగులు పనులు సత్వరమే పూర్తి చేయించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా కొత్త పథకాల రూపకల్పనతో ప్రాజెక్టు విస్తరణ పెరిగి, రైతాంగానికి ఎంతో ప్రయోజనం కలగనుంది. రూ.359 కోట్లతో రెడ్డెమ్మకోన రిజర్వాయర్ గుర్రంకొండ మండలం చెర్లోపల్లె వద్ద ప్రభుత్వం ఒక టీఎంసీ నీటి సామర్థ్యంతో రెడ్డెమ్మకోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి నిర్ణయించింది. దీనికి సంబంధించి తొలిదశ సమగ్ర సర్వే, ప్రాజెక్టు నివేదిక పూర్తయ్యాయి. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను రిజర్వాయర్‌కు మళ్లించేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. చింతపర్తి డిస్ట్రిబ్యూటరీ నుంచి కృష్ణా జలాలను తరలించి ఎగువతోటపల్లె వద్ద రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. 5 వేల ఎకరాలకు సాగునీరు, వాయల్పాడు, గుర్రంకొండ మండలాల్లోని 15 గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. హరిహరాదుల చెరువుకు 35 ఎంసీఎఫ్‌టీ, రామానాయినిచెరువుకు 35 ఎంసీఎఫ్‌టీల నీటిని మళ్లించి నింపుతారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం రూ.359 కోట్లతో ప్రభుత్వానికి నివేదించారు. స్టేజ్–1 స్థాయి పనులు పూర్తి కావడంతో పాలనాపరమైన అనుమతి కోసం నివేదికను చీఫ్ ఇంజినీర్, ప్రభుత్వానికి పంపారు. రామసముద్రం ఉపకాలువ మదనపల్లె నియోజకవర్గం నుంచి పుంగనూరు ఉప కాలువ సాగే సుగాలిమిట్ట వద్ద 183.3 కిలో మీటర్ నుంచి రామసముద్రం ఉపకాలువ మొదలవుతుంది. ఇక్కడికి 750 మీటర్ల దూరంలో ఒక ఎత్తిపోత ల పథకాన్ని నిర్మించి రామసముద్రం వరకు 28 కిలోమీటర్ల ఉపకాలువను తవ్వుతారు. దీనికింద 60 చెరువులకు సాగునీరు, 84వేల మంది జనాభాకు తాగునీరు అందించాలని లక్ష్యం. రామసముద్రం సమీపంలో ఒక రిజర్వాయర్‌ను నిర్మించి, ఇక్కడినుంచి తాగునీటిని గ్రామాలకు సరఫరా చేయాలని ప్రతిపాదన ఉంది. కాలువ సర్వే, సమగ్ర నివేదిక కోసం ప్రభు త్వం రూ.1.03కోట్లను మంజూరు చేయగా టెండర్ పొందిన సంస్థ సర్వే పూర్తిచేసి నివేదిక సమర్పించింది. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ కేవీపల్లె మండలంలోని అడవిపల్లె రిజర్వాయర్ నుంచి నీవా ఉపకాలువ ప్రారంభం అవుతుంది. ఇది చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం కమ్మపల్లె మీదుగా సాగుతుంది. కమ్మపల్లె వద్ద 54.350 కిలోమీటర్ నుంచి రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీ ప్రారంభం అవుతుంది. ఇక్కడి నుంచి 20 కిలోమీటర్ల మట్టికాలువను తవ్వుతారు. కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందించడంతోపాటు రొంపిచర్ల, చిన్నగొట్టిగల్లు, పులిచర్ల మండలాల్లోని 25వేల మంది జనాభాకు తాగునీ టిని అందించాలన్నది లక్ష్యం. రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీకి అడవిపల్లె రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను నీ వా కాలువ ద్వారా మళ్లిస్తారు. దీని సమగ్ర సర్వే, ప్రా జెక్టు నివేదిక రూపొందించడం కోసం రూ.59.22 లక్షలతో సర్వే పనులు పూర్తవగా రూ.73.43 కోట్లతో ప నులు చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికింద 24 చెరువులకు నీటిని అందించి 2,580 ఎకరాల ఆయకట్టు సాగులోకి తేవాలన్నది లక్ష్యం. త్వరలో గుడిసిబండ పనులు ప్రాజెక్టు పరిధిలోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో 4వేల ఎకరాలకు సాగునీరు అందించే గుడిసిబండ డిస్ట్రిబ్యూటరీ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 1,400 ఎకరాలు చెరువులకింద, 2,600 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందిస్తారు. ఈ పనులకు టెండర్లు పూర్తవగా కాంట్రాక్టర్ పనులు ప్రారంభించనున్నారు. రూ.21.05 కోట్లతో పనులకు ఒప్పందం జరిగింది. బాహూదాకు కృష్ణా జలాలు నిమ్మనపల్లె మండలంలోని బాహూదా రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించే ప్రతిపాదన ప్రభుత్వానికి వెళ్లింది. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనుల్లో భాగంగా ఈ నీటిని తరలించే పనులను కలిపారు. పుంగనూరు ఉపకాలువ కిలోమీటర్ 173.00 నుంచి పిల్లకాలువను తవ్వి బాహుదా ప్రాజెక్టులోకి కృష్ణా జలాలను తరలిస్తారు. అలాగే వాయల్పాడు మండలంలో పాలమంద డిస్ట్రిబ్యూటరీ నిర్మాణం కోసం ప్రతిపాదించారు. వాయల్పాడు ఉపకాలువ కిలోమీటర్ 23.500 వద్ద నుంచి పిల్లకాలువ తవ్వి 2,100 ఎకరాలకు సాగునీటిని అందిస్తారు. దీని ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. పీబీసీపై 13న ఎస్‌ఎల్‌టీసీ భేటీ పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై ఈ నెల 13న జలవనరులశాఖ రాష్ట్రస్థాయి సాంకేతిక క మిటీలో చర్చించి అమోదం తెలపనుంది. రూ.1,929 కోట్లతో ఈ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు, సాంకేతిక అనుమతులను ఇప్పటికే మంజూరు చేసింది. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రం మండలం సీవీరామన్నగారిపల్లె వద్ద కిలోమీటర్ 79 నుంచి పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం తిమ్మిరెడ్డిపల్లె వద్ద 220.350 కిలోమీటర్ వరకు పుంగనూరు ఉపకాలువ సాగుతుంది. ఈ కాలువ 140.75 కిలోమీటర్లు ఉండగా కుడివైపున కాలువను 4.8 మీటర్ల వెడల్పు చేయనున్నారు. కాలువ సామర్థ్యం ప్రకారం ఒక్కో పంపు 100 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. కాలువలో 1,180 క్యూసెక్కుల నీళ్లు ప్రవహించేలా నిర్మాణాలు చేపడతారు. వేగంగా చర్యలు హంద్రీనీవా ప్రాజెక్టులో భాగమైన కుప్పం ఉపకాలువ పనులు పూర్తికి వేగంగా చర్యలు చేపట్టాం. రెడ్డెమ్మకోన రిజర్వాయర్, రామసముద్రం కాలువ, రొంపిచర్ల డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి పాలనాపర ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాం. పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులపై కమిటీ నిర్ణయం తర్వాత చర్యలు వేగవంతం అవుతాయి. కొత్త పథకాలకు రూపకల్పన చేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపించాం. – రాజగోపాల్‌రెడ్డి, ఎస్ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు కుప్పంకు కొత్త కాంట్రాక్టర్ గత టీడీపీ హయాంలో కుప్పం ఉపకాలువ పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థ అందినంత దోచుకొని 2019 నుంచి పనులను నిలిపివేసింది. ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా ఖాతరుచేయలేదు. మిగిలిపోయిన రూ.117.18 కోట్ల పనులను కాంట్రాక్ట్ సంస్థ నుంచి తొలగించారు. ఇదే విలువకు పనులు చేపట్టాలని పలు కాంట్రాక్ట్ సంస్థలను ప్రభుత్వం కోరగా హైదరాబాద్‌కు చెందిన నాలుగైదు నిర్మాణ సంస్థలు స్పందించాయి. ఆ కంపెనీల సాంకేతిక అధికారులు ప్రస్తుతం కుప్పం కాలువలో మిగిలిన పనులను పరిశీలిస్తున్నారు. ఈ పరిశీలన పూర్తయ్యాక మిగులుపని విలువతో పనులు చేసేందుకు ముందుకొస్తే టెండర్లు లేకుండా అప్పగించేందుకు నిర్ణయిస్తారు. లేనిపక్షంలో ప్రస్తుత నిర్మాణ ధరల ప్రకారం అంచనావేసి టెండర్లను ఆహ్వానించనున్నారు. -
హంద్రీనీవా ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరు
సాక్షి, అనంతపురం : హంద్రీనీవా ప్రాజెక్టుకు అనంత వెంకటరెడ్డి పేరును పునరుద్ధరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతిగా పేరును పునరుద్ధరిస్తూ.. ఏపీ జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుకు 2007లో అనంత వెంకటరెడ్డి పేరు పెట్టారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ 2015లో ప్రాజెక్టుకు ఆయన పేరును తొలగించింది. కరవు ప్రాంతాలకు కృష్ణా జలాలు తరలించాలని కోరుతూ అనేక ఉద్యమాలు చేసిన మాజీ ఎంపీ దివంగత అనంత వెంకటరెడ్డి జ్ఞాపకార్థం హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆయన పేరును పునరుద్ధరించింది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అనంత వెంకటరెడ్డి తనయుడు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. -
పులగంపల్లిలో విషాదం
అనంతపురం, నల్లమాడ: హంద్రీ–నీవా కాలువలోకి దిగిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. వీరిలో ఒకరి మృతదేహం వెలికితీయగా.. మరొకరు గల్లంతయ్యారు. ఈ ఘటనతో స్వగ్రామం పులగంపల్లిలో విషాదం అలుముకుంది. నల్లమాడ మండలం పులగంపల్లికి చెందిన హైదర్‌వలి పెయింటర్. ఇతనికి భార్య ఫక్రున్నిసా, కుమార్తెలు నాజిరా (13), నూహిరా (11) ఉన్నారు. స్వగ్రామంలో పని లేకపోవడంతో హైదర్‌వలి కుటుంబాన్ని కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి హామాలీ క్వాటర్స్‌కు మకాం మార్చాడు. ఆదివారం కదిరి రూరల్ మండలం చెర్లోపల్లి రిజర్వాయర్ వద్దకు విహారయాత్రకు వెళ్దామని నాజిరా, నూహిరా పట్టుబట్టారు. ఇవాళ వద్దులే అని తండ్రి వారించినా వినలేదు. దీంతో తల్లి, అమ్మమ్మ, బంధువులతో కలిసి ఆటోలో రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం అందరూ కలసి భోజనం చేశారు. అందరికన్నా ముందుగా భోజనం చేసిన అక్కాచెల్లెల్లు నాజిరా, నూహిరాలు హంద్రీ–నీవా కాలువ నీటిలోకి దిగారు. లోతుపై అవగాహన లేని వీరు కొంతదూరం పోయాక నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. తల్లి, బంధువులు గట్టిగా కేకలు వేసి స్థానికుల సాయంతో గాలింపు చేపట్టి నూహిరాను ఒడ్డుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే నూహిరా చనిపోయింది. నాజిరా జాడ కానరాలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లను రంగంలోకి దింపి నాజిరా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలియగానే పులగంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. దేవుడు ఎంత పనిచేశాడంటూ నిట్టూర్చారు. సమాచారం తెలియగానేతెలిసిన వెంటనే వైఎస్సార్ సీపీ నాయకులు, మాజీ సర్పంచ్ కే.రవిచంద్రారెడ్డి, పక్కీరప్ప, వీఆర్ఓ ముబారక్ తదితరులు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. నూహిరా మృతదేహం వద్ద తల్లి రోదన గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం గుర్తింపు ఉరవకొండ రూరల్: విహారయాత్రకు వెళ్లిన కుటుంబంలో విషాదం నెలకొంది. పెన్నహోబిలం జలపాతంలో కొట్టుకుపోయిన ఇద్దరిలో ఒకరి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గుంతకల్లులోని వాల్మీకి సర్కిల్లో నివాసముంటున్న హనుమంతు (35), అల్లుడు సాయికృష్ణ (11)లు శనివారం జలపాతంలోకి సరదాగా దిగినపుడు నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు. ఆ రోజు సాయంత్రం చీకటి పడేవరకు గాలించినా జాడ కనిపించలేదు. ఆదివారం ఉదయం ఎస్ఐ ధరణిబాబు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టగా.. హనుమంతు మృతదేహం కాలువ గట్టున గడ్డిలో ఇరుక్కుని ఉండటం గుర్తించి బయటకు తీశారు. ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. గల్లంతైన సాయికృష్ణ ఆచూకీ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. -
పనులు చేశారా.. నిధులు దోచేశారా?
సాక్షి, బి.కొత్తకోట: గత టీడీపీ ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో జరిగిన హంద్రీ–నీవా ప్రాజెక్టు కాలువలు, కాంక్రీటు, సొరంగం, అండర్ రైల్వే టన్నెల్ పనులపై బుధవారం విజయవాడ, తిరుపతికి చెందిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారుల బృందం విచారణ చేపట్టింది. విజిలెన్స్ ఎస్పీ రమేషయ్య, విజయవాడ నుంచి ఎస్ఈ శ్రీనివాసమూర్తి, డీఈ నాగసురేష్, ఏఈలు సౌజన్య, ప్రకాష్, రామ్మోహన్ల బృందం విస్తృతంగా విచారణ, పరిశీలనలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలో 27వ ప్యాకేజి (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) విలువ రూ.72.73 కోట్ల పనిలో మిగిలిన రూ.1.16కోట్ల పనిని రూ.9 కోట్లకు, 28వ ప్యాకేజీ (కాలువ, కాంక్రీటు నిర్మాణాలు) పని విలువ రూ.83.80కోట్లలో మిగిలిన రూ.78 లక్షల పనిని రూ.3.69కోట్లకు అంచనాలు పెంచి టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తొలుత బి.కొత్తకోట మండలంలో 27, 28 ప్యాకేజీల్లో జరిగిన పుంగనూరు ఉపకాలువ, శీతివారిపల్లె సమీపంలో నిర్మించిన రైల్వే అండర్ టన్నల్ పనులను క్షణ్ణంగా పరిశీలించారు. బి.కొత్తకోట మండలంలోని జాతీయ రహదారికి సమీపంలో శీతివారిపల్లె వద్ద పాకాల –ధర్మవరం రైల్వే మార్గం వెళ్తోంది. ఈ మార్గం దాటి పుంగనూరు ఉపకాలువ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అయితే రైల్వే మార్గం కారణంగా రైల్వే లైను కింద సొరంగం పనులు చేసి ఇరువైపులా కాలువను కలిపే పనులు చేశారు. ఈ పనుల్లో భాగంగా కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేసినట్టు రికార్డుల్లో ఉంది. 27 ప్యాకేజీ పనుల్లో మిగిలిన పనిని 60సీ కింద తొలగించి, 28వ ప్యాకేజీ పరిధిలో వచ్చే కాంక్రీటు నిర్మాణాలు, సొరంగం పని కలిపి 60సీ కింద తొలగించి రూ.3.26 కోట్లకు టెండర్ పనిని అప్పగించారు. ఇందులో 1500 క్యూబిక్ మీటర్ల కంట్రోల్ బ్లాస్టింగ్ పనులుచేశారు. ఈ పనులు వాస్తవంగా చేశారా లేక అనవసరంగా చేయించారా.. అన్న కోణంలో పరిశీలించారు. అనంతపురం సరిహద్దులో పెద్దతిప్పసముద్రం మండలం మీదుగా బి.కొత్తకోట మండలంలో సాగే 27వ ప్యాకేజీ కాలువ పనులను పరిశీలించారు. అనంతరం కురబలకోటలో జరిగిన పనులు, ఎత్తిపోతల పథకం పనులు పరిశీలిస్తూ మదనపల్లె సమీపంలోని సొరంగం చేరుకున్నారు. 59వ ప్యాకేజీలోని ఈ సొరంగం పనుల్లో రూ.36.92 కోట్ల పనులు పెండింగ్ ఉండగా గత ప్రభుత్వం అందులోంచి రూ.34.27 కోట్ల పనులు రద్దు చేసి 2.5కిలోమీటర్ల సొరంగం పనులు, కాలువ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల నిర్మాణానికి 59ఏ ప్యాకేజి కింద రూ.160.518 కోట్లకు అంచనాలు పెంచి నిర్వహించిన టెండర్‌ను రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ దక్కించుకుంది. అయితే 2.5కిలోమీటర్ల సొరంగానికి లైనింగ్ పనులు చేయలేదు. విజిలెన్స్ బృందం ఈ పనులతోపాటు కాలువలో కంట్రోల్ బ్లాస్టింగ్ పనులు చేయించడంపైనా పరిశీలించారు. ప్రాజెక్టు అధికారుల నుంచి తీసుకున్న రికార్డుల ఆధారంగా ఈ విచారణ సాగుతుండగా, అసలు పనులు చేశారా, అవసరం లేని చోట కంట్రోల్ బ్లాసింగ్ పెట్టి నిధులు దోచుకున్నారా, అసలు పనులే చేయాలేదా అన్న కోణంలో విచారణ చేశారు. -
రైతు ఆత్మహత్యాయత్నం
అనంతపురం , ఉరవకొండ రూరల్: ఎటువంటి సమాచారం తెలపకుండా, నోటీసు ఇవ్వకుండా, పరిహారం చెల్లించకుండా అధికారులు తన పొలంలోంచి హంద్రీనీవా పిల్లకాలువ తవ్వకం పనులు చేస్తుండటంతో మనస్తాపం చెందిన రైతు మాసినేని శ్రీనివాసులు (55) ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చిన్నముస్టూరుకు చెందిన మాసినేని శ్రీనివాసులుకు గ్రామ సమీపంలో హంద్రీ–నీవా కాలువకు ఆనుకుని ఉన్న సర్వేనంబర్ 38లో 3.20 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. కోనాపురం చెరువుకు నీరు నింపేందుకు అధికారులు శుక్రవారం చిన్నముస్టూరు ప్రాంతంలోని హంద్రీనీవా కాలువ వద్ద నుంచి పిల్లకాలువ పనులు చేయడానికి మార్కింగ్ వేసి జేసీబీలతో పనులు ప్రారంభించారు. తనకు ముందస్తు నోటీసులు గానీ, సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా పనులు ఎలా చేస్తారంటూ అధికారులను రైతు శ్రీనివాసులు నిలదీశాడు. తమను అడ్డుకునే హక్కు లేదని, కోర్టు ఉత్తర్వుల మేరకు పనులు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేయడంతో దిక్కుతోచని రైతు పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుమారుడు నరేష్ గమనించి హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి పంపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హంద్రీనీవ బ్రాంచ్ కెనాల్ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని నర్సాపురం, సిరిపి రైతులు కోర్టును ఆశ్రయించారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు నిర్వహిస్తున్నారనీ, లాండ్ అక్విజేషన్ యాక్ట్-2013ను ఉల్లంఘించారంటూ రైతులు హైకోర్టులో పిటిషన్‌పై దాఖలు చేశారు. విచారణ చేపట్టి హైకోర్టు రైతులకు నష్టపరిహారం చెల్లించి 2013 లాండ్ అక్విజేషన్ యాక్ట్‌లోని 13 వ నిబంధనను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా, ఈ తీర్పుతో అనంతపురం, పెరూర్, హగరి బ్రాంచ్ కెనాల్ రైతులకు ఊరట లభించింది. రైతుల తరపున న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు. -
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
-
రౌడీరాజ్యం అనుకుంటున్నారా?
అనంతపురం సెంట్రల్: ఉరవకొండ నియోజకవర్గంలో రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా బెదిరించి హంద్రీనీవా పనులు చేపడుతున్నారని, ఇదేమైనా రౌడీరాజ్యం అనుకుంటున్నారా అని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా ద్వారా ఉరవకొండ నియోజకవర్గంలో ఆయకట్టుకు నీరివ్వాలని, రాకెట్ల – ఆమిద్యాల లిఫ్ట్ పనులు మొదలుపెట్టాలని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హంద్రీనీవా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కార్యాలయం వద్ద రైతులతో కలిసి బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీనీవా కింద దాదాపు 80వేల ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ ఒక్క ఎకరాకు కూడా నిరీచ్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. హంద్రీనీవా ఆయకట్టుకు నీరిచ్చేందుకు వెంటనే పిల్లకాలువలు తవ్వాలని, రాకెట్ల – ఆమిద్యాల లిఫ్ట్ పనులు వెంటనే చేపట్టి 8వేల ఎకరాలకు నీరివ్వాలని డిమాండ్ చేశారు. 2016లో అసెంబ్లీలో రాకెట్ల – ఆమిద్యాల లిఫ్ట్ పనులపై ప్రశ్నించినప్పుడు రెండు నెలల్లో పనులు పూర్తి చేస్తామని స్వయంగా సీఎం లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారని, అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాయంపల్లి, నెరిమెట్ల గ్రామాలకు వెల్లే పిల్లకాలువల పనులు ఎందుకు నిలిపేశారని నిలదీశారు. అధికారపార్టీ నేతల అడుగులకు మడుగులొత్తే పనులు మాని రైతులకు మేలు చేయాలని హితవు పలికారు. బెళుగుప్ప మండలంలో 36వ ప్యాకేజీలో పనుల్లో భూమి కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. బూదగవి చెరువు నింపిన సమయంలో పంటలు సాగు చేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి కూడా ఇంతవరకూ పరిహారం అందలేదని తెలిపారు. వెంటనే చెల్లించకపోతే ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం రైతులనుద్దేశించి మాట్లాడుతూ ఆరునెలలు ఓపిక పడితే వైఎస్ జగన్ సీఎం అవుతారని, వెంటనే మూడు నెలల్లో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, హంద్రీనీవా ఆయకట్టు సాధన సమితి నాయకులు అశోక్‌కుమార్, తోజేనాథ్, ఎర్రిస్వామి, గోపాల్‌రెడ్డి, దుబ్బర వెంకటేసు, నాగరాజు, యోగేంద్రనాథ్, జగన్నాథ్‌రెడ్డి, హనుమంతరెడ్డి, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆందోళనలో పండు ముసలవ్వ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఆందోళనలో రాకెట్లకు చెందిన పండుముసలవ్వ సుబ్బమ్మ పాల్గొనడం అందరినీ ఆకర్షించింది. తాగేందుకు నీళ్లు లేక అల్లాడిపోతున్నామని, తాము వైఎస్సార్సీపీ వాళ్లమనే తమ గ్రామాలపై కక్ష సాధిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పొలాలకు నీళ్లివ్వాలని సుబ్బమ్మతోపాటు మరో వృద్ధురాలు రేణమ్మ అధికారులకు చేతులు జోడించి వేడుకున్నారు. -
ఆయకట్టు...కనికట్టు
ఒకసారి తప్పు చేస్తే పొరపాటు అవుతుంది. పలుసార్లు పొరపాటు చేస్తే తప్పవుతుంది. ఇదంతా తెలిసి ఒకే తప్పును పదేపదే చేస్తే... కుట్ర...దగా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ‘అనంత’ రైతాంగంపై ఇదే విధంగా వ్యవహరిస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: హంద్రీ–నీవా ఆయకట్టుకు ఏడాదిలోనే నీరిస్తామని 2014లోనే టీడీపీ హామీ ఇచ్చింది. అయితే అదే చంద్రబాబు సర్కార్ 2015లో ఆయకట్టుకు నీరిచ్చే డిస్ట్రిబ్యూటరీలు చేయొద్దని జీఓ జారీ చేసింది. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో 2016 నుంచి ఏటా ఖరీఫ్‌కు నీరిస్తామని ఎస్ఈ, సీఈలతో రైతులను మభ్యపెట్టే ప్రకటనలు చేయిస్తోంది. కానీ ఇప్పటి వరకూ ఆయకట్టు పూర్తి చేయలేదు. ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ఆయకట్టు నిర్మాణం చేపట్టేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, తక్కువ ఖర్చుతో పూర్తి చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా చర్యలకు ఉపక్రమించడం లేదు. ‘అనంత’కు సాగునీరిస్తామని ఊరించడం మినహా జిల్లా రైతాంగంపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేయడం, అవకాశం ఉన్న చోట ఆయకట్టుకు నీళ్లివ్వాలనే డిమాండ్‌తో అఖిలపక్షం నేతలు నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారు. డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 1.18 లక్షల ఎకరాలకు నీరు హంద్రీ–నీవా ద్వారా రాయలసీమలో 6.02లక్షల ఎకరాలకు నీరందించాలని సంకల్పిస్తే అందులో 3.45లక్షల ఎకరాలు ఆయకట్టు ‘అనంత’లోనే ఉంది. దీన్నిబట్టి చూస్తే ‘అనంత’ కష్టాలు తీర్చేందుకు చేపట్టిన బృహత్తరపథకమనేది స్పష్టమవుతోంది. హంద్రీ–నీవా ఫేజ్–1 పనులు 2012లోనే పూర్తయ్యాయి. జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణాజలాలు చేరాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే 1.18లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వొచ్చు. ఇందులో 80వేల ఎకరాలు ఆయకట్టు ఉరకొండ నియోజకవర్గంలో ఉంది. 2016 డిసెంబర్లో గొల్లపల్లికి నీళ్లు వచ్చాయి. ఫేజ్–2 ద్వారా జీడిపల్లి–గొల్లపల్లి మధ్యలో డిస్ట్రిబ్యూటరీలు చేస్తే రాప్తాడు నియోజకవర్గానికి నీరివ్వొచ్చు. కానీ 2014లో టీడీపీ అధికారంలోకి రాగా... ఏడాదిలో హంద్రీ–నీవా ఆయకట్టుకు నీళ్లిస్తామని సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రకటనలు చేశారు. కానీ సీఎం సొంత నియోజకవర్గం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీల నిర్మాణాలు పూర్తి చేయొద్దని 2015 ఫిబ్రవరిలో జీఓ 22 జారీ చేశారు. దీనిపై విపక్షపార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమించాయి. ఈ క్రమంలో 33, 34 ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీ పనులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పేరూరు ఆయకట్టు సంగతేంటి? పేరూరు కింద 10,800 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో తగరకుంట చెరువు నుంచి నీరిస్తే తగరకుంట, భోగినేపల్లి, పాలచెర్ల, గాండ్లపర్తి, కొత్తపల్లితో పాటు పలుగ్రామాల్లో ఐదు వేల ఎకరాలకు నీరందుతుంది. కానీ నీళ్లివ్వలేదు. చెరువు నుంచి నీళ్లు తీసుకెళితే రైతులపై కేసులు నమోదు చేస్తామని పోలీసులను కాపలా పెట్టారంటే రైతుల సంక్షేమంపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి తురకలాపట్నం వంక ద్వారా పెన్నాలోకి నీరు వదిలితే 10 గ్రామాల్లో భూగర్భజలాలు పెరుగుతాయి. డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేస్తే పేరూరు, మద్దెలచెరువు, భానుకోట, వేపకుంటతో పాటు ఏడు గ్రామాల్లో ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చు. తక్కువ ఖర్చుతో వీటికి వెంటనే నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. హంద్రీ–నీవా నుంచి ఆత్మకూరు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే ఆత్మకూరు, గొరిదిండ్ల, పంపనూరురుతో పాటు పలు గ్రామాలకు 12వేల ఎకరాలకు నీరందుతుంది. దీన్నీ రద్దు చేశారు. ఇక రాప్తాడు నియోజకవర్గంలో రూ.300 కోట్లు ఖర్చు చేస్తే లక్ష ఎకరాలకు తక్కువ వ్యవధిలో సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. నీళ్ల కంటే నిధులపైనే మక్కువ ఏటా 20–30 టీఎంసీల నీళ్లు జిల్లాకు వస్తున్నాయి. వీటిని ఆయకట్టుకు ఇచ్చేందుకు పిల్ల కా>లువలు పూర్తి చేయడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించాలి. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో వీటిని పట్టించుకోలేదు. ఇప్పడు పేరూరు, బీటీపీకి నీళ్లిచ్చేందుకు కొత్త ప్రాజెక్టులకు సిద్ధమయ్యారు. మొదట ఆయకట్టుకు నీళ్లిచ్చి, ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులపై దృష్టి సారించాలని, ఆయకట్టుకు నీళ్లివ్వనపుడు కొత్త ప్రాజెక్టుల పేరుతో నిధులు దండుకోవడం మినహా తమకు ఏం ఒనగూరుతుందని రైతులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీతో పాటు కాంగ్రెస్, సీపీఎం నేతలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. మొదలెట్టారు...ఆపేశారు 33, 34 ప్యాకేజీ పరిధిలో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 28వేల ఎకరాలకు నీరందుతుంది. 33వ ప్యాకేజీని ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్ , 34ను రెడ్డివీరన్న కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెyŠ చేస్తున్నాయి. 33వ ప్యాకేజీలో 8.9 కిలోమీటర్లు ప్రధాన కాలువతో పాటు ఉప, పిల్లకాలువలు తవ్వాలి. ఈ పనులు పూర్తయితే 10,500 ఎకరాలకు నీరందుతుంది. కానీ 5–6 కిలోమీటర్ మధ్య రాయి ఉంది, దాన్ని బ్లాస్టింగ్ చేయాలంటున్న అధికారులు పనులు నిలిపివేశారు. ఇక‡ మేజర్ కెనాల్‌లోని కల్వర్టులే పూర్తి చేయలేదు. 34వ ప్యాకేజీలో కూడా డిస్ట్రిబ్యూటరీ–1, డిస్ట్రిబ్యూటరీ–2 అని రెండు ప్రధాన కాలువలు తవ్వాలి. డీ–1, 8.25, డీ–2లో 22 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ తవ్వాలి. డీ–1 కింద 5వేలు, డీ–2 కింద 12, 500 ఎకరాలకు ఆయకట్టుకు నీరందుతుంది. ఈ పనులూ పూర్తి కాలేదు. ఇక 36 ప్యాకేజీ మరొకటి ఉంది. రూ.336 కోట్లు కేటాయిస్తూ 2016లో ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ పని దక్కించుకున్న టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ పట్టనట్టు వ్యవహరిస్తోంది. మూడు ప్యాకేజీల్లో డిస్ట్రిబ్యూటరీలు పూర్తయితే 1.18 లక్షల ఎకరాలకు నీరందుతుంది. డిమాండ్లు ఇవే.. ♦ హంద్రీ–నీవా ద్వారా 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు వెంటనే నీరివ్వాలి ♦ పెండింగ్‌లో ఉన్న డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలి. ఇంకా ప్రారంభించని వాటిని వెంటనే చేపట్టాలి ♦ పీఏబీఆర్ కుడికాలువ ద్వారా దిగువ గ్రామాల పరిధిలోని ఆయకట్టుకు నీరందించాలి. ♦ ఆత్మకూరు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలి ♦ హంద్రీ–నీవా 36వ ప్యాకేజీ ద్వారా పేరూరు డ్యాంకు నీరివ్వాలి. ♦ హంద్రీ–నీవాకు 100 టీఎంసీల నికరజలాలు కేటాయించాలి. అనంతపురం న్యూసిటీ: కేటాయింపుల ప్రకారం జిల్లాలో 3.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడంతో పాటు మరికొన్ని ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. అందులో భాగంగా రైతులు, రైతు సంఘాలు, విపక్షాలతో కలిసి సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ‘రైతుమహాధర్నా’ తలపెట్టారు. రైతుమహాధర్నా విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆదివారం సాయంత్రం స్థానికి జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, ఎం.శంకరనారాయణ, ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, రాప్తాడు నియోజక వర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తదితరులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... జిల్లా సమగ్రాభివృద్ధి కోసం రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు మహాధర్నాకు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, సాగు, తాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డగోలు దోపిడీకి వ్యతిరేకంగా అందరు కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టు కింద 3.55 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు ఏర్పాటు చేస్తూ 80 శాతం పనులు పూర్తి చేశారన్నారు. 2012 నుంచి జీడిపల్లి జలాశయానికి ఏటా 20 టీఎంసీల నీరు వస్తున్నప్పటికీ కనీసం ఎక్క ఎకరా నీళ్లివ్వలేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు కింద 3.55 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ నిర్మించి నీళ్లివ్వాలని, పీఏబీఆర్ కుడి కాలువ కింద నిర్మించాల్సిన 50వేల ఎకరాలకు పిల్లకాల్వ పనులు, ఆత్మకూరు ఎత్తిపోతల పథకం వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పేరూరు డ్యాంకు నీళ్లివ్వాలన్నారు. హంద్రీ–నీవా కాలువ దిగువనున్న తగరకుంట, బోగినేపల్లి, పాలచెర్ల, గాండ్లపర్తి కొత్తపల్లి, పేరూరు డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీఆర్ దక్షిణ కాలువ కింద 50 వేల ఎకరాల ఆయకట్టుకు మూడేళ్లుగా నీరివ్వకుండా జిల్లాకు 30 టీఎంసీలు నీళ్లు తెచ్చామని చెబుతున్న అధికార పార్టీ నేతలు... ఆ నీటిని ఏమి చేశారో జిల్లా ప్రజలు, రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పేరూరు డ్యాంకు తక్షణ ప్రయోజనం కల్పించడానికి వీలుగా మడకశిర బ్రాంచి కెనాల్ అయిన తురకలాపట్నం వద్ద నుంచి పెన్నానది ద్వారా నీరు నింపాలన్నారు. శాశ్వత పరిష్కారంగా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న 36వ ప్యాకేజీ కింద పేరూరుకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీటీపీ నిర్మాణం, అలాగే 74 టీఎంసీలు నికర, వరద జలాల కేటాయింపులు ఉన్న అనంతపురం జిల్లాకు పట్టిసీమ వాటా కూడా కలిపి 100 టీఎంసీల కేటాయింపులు జీఓ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల డిమాండ్లతో సోమవారం తలపెట్టిన మహాధర్నాకు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. -
ఆయకట్టుకు నీరెక్కడ బాబూ?
వజ్రకరూరు: హంద్రీ–నీవా మొదటి దశ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకుండానే జలహారతులంటూ ఆర్భాటాలకు పోతే ఎలా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రశ్నించారు. ఆయకట్టుకు సాగునీటిని అందించే విషయంపై రైతులకు స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఈ జిల్లాలో కాలు పెట్టాలని సూచించారు. మండలంలోని వెంకటాంపల్లి గ్రామ ఎస్సీ కాలనీలో బుధవారం ఆయన పల్లెనిద్ర చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో గ్రామంలోని పలు సమస్యలను ఆయన దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. కాలనీలోని ప్రతి ఇంటికీ విశ్వ వెళ్లి సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాభావం వల్ల పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో టీడీపీ ప్రజాప్రతినిధులు అంతులేని వివక్ష చూపుతున్నారన్నారు. కనీసం రెండు తడులైనా నీళ్లు ఇచ్చి ఉంటే కోట్ల రూపాయల విలువైన పంట చేతికి వచ్చి ఉండేదని అన్నారు. పంట నష్టాలకు ప్రభుత్వమే కారణమని తెలిపారు. హంద్రీ–నీవా పనులు పూర్తి చేయడంలోనూ సీఎం వివక్ష కనబరుస్తున్నారని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తితో రూ. 6వేల కోట్ల వ్యయాన్ని రూ. 12 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో హంద్రీ–నీవాకు రూ. 5,500 కోట్లు కేటాయించి, 90 శాతం పనులు పూర్తి చేయించారని గుర్తు చేశారు. గత తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ఇదే ప్రాజెక్ట్‌కు శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు. అంతేకాక 40 టీఎంసీ ప్రాజెక్ట్‌ని ఐదు టీఎంసీలకు కుదించేందుకు కారకులయ్యారని విమర్శించారు. అప్పట్లోనే ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ఉంటే కృష్ణ జలాలపై ఇప్పటిలా మిగులు జలాలు కాకుండా జిల్లా రైతులకు సంపూర్ణ హక్కు ఉండేదని పేర్కొన్నారు. 10 శాతం పనులు చేయలేక.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే హంద్రీ–నీవా ప్రాజెక్ట్‌లోని 90 శాతం పనులు పూర్తి అయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అంతటితో ఆగకుండా జీవో 22ని అమలు చేయడం ద్వారా హంద్రీ–నీవా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థని రద్దు చేశారని తెలిపారు. ఆయకట్టుకు సాగునీరు ఇవ్వకపోవడంతో రైతులే సొంత ఖర్చుతో పైప్‌లు ఏర్పాటు చేసుకుని పంట పొలాలకు నీటిని మళ్లించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. రైతులపై చిత్తశుద్ధి లేని సీఎం రైతులపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే విమర్శించారు. మొదటి దశ పనులు 2012లోనే పూర్తి చేసుకున్న హంద్రీ–నీవా ఆయకట్టుకు నేటికీ చుక్క నీటిని సీఎం అందించలేకపోయారని గుర్తు చేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసం బుక్కపట్నం, ధర్మవరం చెరువుల వద్ద జలహారుతులు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉరవకొండ నియోజకర్గంలో 80వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. -
హంద్రీ–నీవాకు ఇంకెన్ని ఆగస్టులు కావాలి
► మంత్రి దేవినేనికి ప్రకటనపై కట్టుబడే ధైర్యం ఉందా ? ► వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి బి.కొత్తకోట: హంద్రీ–నీవా కాలువల ద్వారా జిల్లాకు కృష్ణా నీరు అందించేందుకు జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఇంకెన్ని ఆగస్టులు కావాలని వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రశ్నించారు. రానున్న ఆగస్టులో నీటిని రప్పిస్తామని మంత్రి బుధవా రం రాత్రి బి.కొత్తకోట మండల పర్యటన సందర్భంగా చేసిన ప్రకటనపై తీవ్రంగా స్పందించారు. గురువారం నంద్యాల నుంచి ఆయన ఫోన్లో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ఆగస్టుకు నీరిస్తామన్న ప్రకటనకు కట్టుబడే ధైర్యం మంత్రికి ఉందా ? అని ప్రశ్నించారు. సీఎం, మంత్రి నోటివెంట ఎన్ని ఆగస్టులు, ఎన్ని మార్చి లు, ఎన్ని డిసెంబర్లు గడచిపోయాయో ప్రజలకు తెలుసన్నా రు. జిల్లాలో ఇంకా రూ.900 కోట్లకుపైబడిన పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో బి.కొత్తకోట శివారులో నిర్మిస్తున్న బ్రిడ్జి ఉందని, ఆగస్టుకు ఈ ఒక బ్రిడ్జి పూర్తిచేయించే సామర్థ్యం ఉందా ? ఉంటే సవాలు స్వీకరించాలని మంత్రిని డిమాండ్ చేశారు. రైతులకు పంటనష్ట పరిహారం ఇప్పించేందుకు మంత్రి దృష్టిపెట్టాలని కోరారు. -
కొడికొండలో వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం కొడికొండ చేరుకున్నారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతపురం జిల్లా రైతులకు అండగా నిలుస్తూ, హంద్రీనీవా ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో వైఎస్ జగన్ సోమవారం ఉరవకొండలో మహాధర్నా చేపట్టనున్న విషయం తెలిసిందే. -
'20 నెలల్లో రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశాం'
న్యూఢిల్లీ : రాష్ట్రంలో తాగునీటి సంఘాలకు 20 నెలల్లోనే రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ వెల్లడించారు. శనివారం న్యూఢిల్లీలో దేవినేని ఉమ మాట్లాడుతూ... హంద్రీ - నీవా మొదటి విడత 2016 కల్లా పూర్తి చేస్తామని చెప్పారు. నిర్ణీత గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాయలసీమను హర్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. -
2016లోగా హంద్రీ - నీవా పూర్తి చేస్తాం
అనంతపురం : 2016 లోగా హంద్రీ - నీవా ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు. శుక్రవారం అనంతపురంలో ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... త్వరలో తోటపల్లి, గుండ్లకమ్మ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తామన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులన్నీ గడవులోపే పూర్తి చేస్తామన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనుల పురోగతిని దేవినేని ఉమా ఈ సందర్భంగా ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. -
మరో 10 మోటార్ల తరలింపు?
హంద్రీనీవా నుంచి పట్టిసీమకు పంపేందుకు యత్నాలు కర్నూలు సిటీ/నందికొట్కూరు: హంద్రీనీవా ప్రాజెక్ట్ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మరో పది మోటార్లను తరలించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఒక మోటారును తరలించిన ప్రభుత్వం.. తాజాగా మరో పది మోటార్లను తరలించాలని అధికారులకు అనధికారికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అధికారులు మాత్రం కేవలం ట్రయల్ రన్ కోసమే తరలిస్తున్నామని చెబుతుండడం గమనార్హం. వాస్తవానికి హంద్రీనీవా పంపుల పనులు చేసిన సంస్థ.. పట్టిసీమ పనులు చేపట్టిన సంస్థ ఒకటే కావడంతో గుట్టుచప్పుడు కాకుండా ఈ తతంగాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టిసీమ కోసం ఆర్డర్ చేసిన పంపులు వచ్చేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఒక్కో లిఫ్టు నుంచి రెండు మోటార్లు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన మోటార్లు సిద్ధం కాలేదు. దీంతో సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ హంద్రీనీవా సుజల స్రవంతి పథకం-1 మల్యాల లిఫ్ట్ నుంచి 6వ మోటారును రాత్రికి రాత్రే తరలించి అమర్చింది. రాష్ర్ట జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్విచ్ ఆన్ చేసి ఈ పంపు ద్వారానే నీటిని విడుదల చేశారు. పట్టిసీమకు అమర్చాల్సిన 24 మోటార్లు ఇంకా సిద్ధం కాలేదు. వీటి తయారీ ఆర్డర్‌ను బ్రెజిల్‌కు చెందిన ఓ కంపెనీకి ఇచ్చారు. అనుకున్న సమయానికి ఆ మోటార్లు రాలేదు. హంద్రీనీవాలో మొత్తం 8 లిఫ్టులు ఉండగా.. ఒక్కో లిఫ్టులో 12 మోటార్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో లిఫ్టు నుంచి 2 మోటార్ల చొప్పున మొత్తం 5 లిఫ్టుల్లోని 10 మోటార్లను పట్టిసీమకు తరలించే యోచనలో అధికారులు ఉన్నారు. అయితే, హంద్రీనీవా నుంచి మోటార్లను తరలిస్తే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వస్తుండడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సీమకు నీటి కష్టాలు తప్పవు శ్రీశైలం జలాశయంలో 834 అడుగుల నీటిమట్టం ఉంటే హంద్రీనీవా ద్వారా నీటిని తరలించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. తాగునీటి అవసరాలకూ దీని ద్వారానే నీటిని పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 841.4 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హంద్రీనీవాలో నీటి లిఫ్టింగ్ ప్రారంభమైంది. తాగునీటి అవసరాలకు 1,350 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి పంపులను తరలిస్తే సీమ జిల్లాల్లో తాగునీరు, సాగునీటికి ఇబ్బం దులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రయల్ రన్ కోసమే పట్టిసీమలో ట్రయల్ రన్ కోసమే మోటార్‌ను తరలించినట్లు హంద్రీనీవా పర్యవేక్షక ఇంజనీర్ చెప్పారు. 2 ప్రాజెక్ట్‌లకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఒకటే కావడంతోనే తీసుకుపోయి ఉంటారని అన్నారు. ట్రయల్ రన్ పూర్తయ్యాక తిరిగి తీసుకొస్తారని తెలిపారు. సీమ ప్రజల నోట్లో మట్టికొట్టొద్దు పట్టిసీమ పథకంతో రాయలసీమకు సాగు, తాగునీరు అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం... ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని పలు రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. సీమకు ప్రాణప్రదమైన హంద్రీనీవా మోటార్లను పట్టిసీమకు తరలించాలన్న యోచనను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పట్టిసీమ వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం దక్కకపోగా.. ప్రభుత్వం హంద్రీనీవా మోటార్ల తరలింపుతో సీమ ప్రజల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు. తక్షణమే ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టిసీమ పథకానికి హంద్రీనీవా మోటారును రాత్రికి రాత్రే తరలించడాన్ని చూస్తే ప్రభుత్వం ఏ తరహాలో ప్రజలను మోసగిస్తోందో వెల్లడైందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రీనీవా నుంచి నీటిని విడుదల చేస్తే ఆ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు తెలపాల్సిన అవసరం లేదా? అని డీఈ శ్రీనివాస్‌నాయక్‌ను ప్రశ్నించారు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని ఐజయ్య పరిశీలించారు. -
అనుసంధానం ముసుగు జారి.. కొల్లేటికి చేరిన అవినీతి కథ!
‘అనుసంధానం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రదర్శించిన నాటకం రక్తి కట్టలేదు. పుష్కరాల్లో చేసిన పబ్లిసిటీ వేట లాగే ఇదీ వికటించింది. పట్టిసీమ పేరుతో లేచిన అవినీతి ‘కురుపు’ కనిపించకుండా ‘అనుసంధానం’ అనే ముసుగును కప్పేశారు. ఎవరి కంటా పడకుండా హంద్రీనీవా ప్రాజెక్టు మోటారును రహస్యంగా ఎత్తుకొచ్చారు. మూడురోజులు తంటాలు పడి కాసిన్ని గోదావరి నీళ్లు తోడి పోశారు. తోడుగా కొన్ని తాడిపూడి ఎత్తి పోతల నీళ్లను కలిపారు. వీటికి కొద్దిపాటి వర్షం నీరు తోడైంది. వైఎస్సార్ హయాంలో 80% పూర్తయిన పోలవరం కుడి కాల్వను ఉపయోగించుకొని కీర్తి కిరీటం పెట్టుకునే ప్రయత్నం చేశారు. మిగిలిన కొద్దిపాటి కాల్వ పనులను నాసిరకంగా ముగించడంతో కృష్ణాకు వెళ్లాల్సిన నీళ్లు తమ్మిలేరులోకి జారిపోయి కొల్లేరు బాట పట్టాయి. ఒక్క మోటారు ఆన్ చేస్తేనే బద్దలైన కుడికాల్వ అక్విడెక్ట్ * పట్టిసీమను హడావుడిగా పూర్తి చేసేందుకు నాణ్యత పట్టించుకోని ప్రభుత్వం * ప్రచార ఆర్భాటం కోసం హడావుడిగా ఏర్పాట్లు * మోటార్లు లేకుండానే నదుల అనుసంధానమంటూ సీఎం ఆర్భాటం * దివంగత వైఎస్ చేసిన పనులను తానే చేసినట్టుగా * చెప్పుకోవాలనే తాపత్రయం సాక్షి, హైదరాబాద్/ఏలూరు/కర్నూలు: పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో మోసం మరోసారి బట్టబయలయింది. హంద్రీనీవా నుంచి మోటారు తీసుకొచ్చి పట్టిసీమలో బిగించడానికి ప్రభుత్వం అనుమతించడం.. సర్కారు మోసపూరిత వైఖరికి నిదర్శనం. హడావుడిగా చేస్తున్న పోలవరం కుడికాల్వ పనుల్లో నాణ్యత లేదంటూ సంబంధిత ఇంజినీర్లు నెత్తీనోరూ కొట్టుకున్నా.. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూర్వకంగా పట్టించుకోని ఫలితం ఇప్పుడు బయటపడింది. రికార్డు సమయంలోనే పట్టిసీమలో మోటారు నడిపించామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల తాగునీటికి ఆధారమైన హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) నుంచి మోటారు తీసుకురావడానికి సాక్షాత్తూ ముఖ్యమంత్రే అనుమతివ్వడం గమనార్హం. ఈనెల 11వ తేదీనే హంద్రీనీవా నుంచి మోటారు తీసుకురావడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై రెండు, మూడు రోజుల ముందే సీఎం నుంచి మౌఖికంగా అనుమతి తీసుకున్నామని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. పోలవరానికి ఉరి.. పట్టిసీమకు ఊపిరి పట్టిసీమ టెండర్ల దశలోనే దోపిడీకి ప్రభుత్వ పెద్దలు తెరతీశారు. జాతీయ హోదా దక్కిన పోలవరం ప్రాజెక్టుకు ఉరేసి, కాసులపై కక్కుర్తితో పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఊపిరి పోశారు. ఏడాదిలో పూర్తి చేయాలని టెండర్లు పిలిచి.. గడువులోగా పూర్తి చేస్తే 16.9 శాతం బోనస్‌గా చెల్లిస్తామంటూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టర్‌తో ముందుగా అవగాహన ఉండటం వల్లే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారంటూ వెల్లువెత్తిన విమర్శలనూ ప్రభుత్వం పట్టించుకోలేదు. పోలవరం కుడికాల్వ పనుల్లోనూ అంతా హడావుడి, అవినీతి నిర్ణయాలే తీసుకున్నారు. నాణ్యతను పరిశీలించి అధికారులు ధ్రువీకరించిన తర్వాతే బిల్లులు చెల్లించడం సాధారణంగా జరిగేది. కానీ కుడికాల్వ పనుల విషయంలో ఈ నిబంధనలకు స్వయంగా ప్రభుత్వ పెద్దలే తూట్లు పొడిచారు. నాణ్యత ధ్రువీకరణ లేకుండానే బిల్లులు చెల్లించడం వెనుక.. అధికారపార్టీ నేతల చేతివాటం ఉందని నీటిపారుదల శాఖ అధికారులే చెబుతున్నారు. గోదావరి-కృష్ణా అనుసంధానం.. జరిగిందంటూ ముఖ్యమంత్రి అబద్దాల హోరులో వాస్తవం కనబడకుండా ప్రచార ఆర్భాటం కప్పేసే ప్రయత్నం చేసింది. అంతటా హడావుడే..: ఈనెల 16 ఉదయం పట్టిసీమలో మోటారును ప్రారంభించాలని పట్టుబట్టి హంద్రీనీవా నుంచి మోటారును అప్పటికప్పుడు ఆగమేఘాల మీద తీసుకు వచ్చి అదే రోజు మధ్యాహ్నం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద నదుల అనుసంధాన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. అప్పటికే హంద్రీనీవా నుంచి వచ్చిన మోటారు అక్కడికి చేరింది. కానీ పంపు అలైన్మెంట్ సరిగా కుదరక పోవడంతో మోటారు ఏర్పాటు చేయలేక కాంట్రాక్టర్, అధికారులు చేతులెత్తేశారు. పట్టిసీమలో మోటారు పెట్టకుండానే.. నదుల అనుసంధానం చేశామని సీఎం ప్రకటించారు. తర్వాత పట్టిసీమ వెళ్లి కొబ్బరికాయ కొట్టారు. అప్పటికీ అక్కడ మోటారు బిగించలేకపోయారు. హంద్రీనీవా నుంచి తెచ్చిన మోటారును 17న బిగించారు. 18న మోటారు ఏర్పాటు చేసి సాగునీటి మంత్రి దేవినేని ఉమ ఆన్ చేశారు. 19న కుడికాల్వకు గండి పడింది. పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై నిర్మించిన అక్విడెక్టు బద్ధలైంది. ఒక్క మోటారుకే తెగిపోయింది.. అన్నీ ఆన్ చేస్తే?: ఒక్క మోటారు ఆన్ చేస్తేనే కుడికాల్వ తెగిపోయింది. మరి అన్ని మోటార్లు ఆన్ చేస్తే పరిస్థితి ఏమిటి? ఇదే ప్రశ్నకు నీటిపారుదల శాఖ అధికారులు సమాధానం వెతుక్కుంటున్నారు. నాణ్యత లేకుండా పనులు చేస్తున్నారని తాము తొలి నుంచీ ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని కుడికాల్వ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్ ఒకరు ‘సాక్షి’తో వాపోయారు. అన్ని మోటార్లు నడిస్తే.. గండి ఒక్కచోటకే పరిమితం కాదని, చాలా చోట్ల కాల్వకు గండ్లు పడే ప్రమాదం ఉందని చెప్పారు. మరోవైపు కాల్వ తెగడం వల్ల తమ్మిలేరులో చేరిన నీరంతా ఏలూరు నగరాన్ని ముంచెత్తేది. పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగేది. ఎందుకంటే.. తమ్మిలేరు ఏలూరు మీదుగా ప్రవహిస్తోంది. నిజస్వరూపం బయటపడుతుందనే.... పట్టిసీమ డొల్లతనాన్ని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎప్పుడో బయటపెట్టింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని నమ్ముకుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎత్తిపోతల పథకంతో నదుల అనుసంధానం అని చెప్పుకోవడమే సిగ్గుచేటని, అది కూడా కనీసం ఒక్క మోటారు పెట్టకుండానే నదులు అనుసంధానం చేశామని ఘనంగా ప్రకటించుకోవడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు. కనీసం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే వరకు కూడా ఆగలేకపోవడాన్ని చూస్తుంటే.. తమ నిజస్వరూపం బయటపడుతుందనే భయం ప్రభుత్వ పెద్దల్లో ఉందని స్పష్టమవుతోందని చెబుతున్నారు. గతంలో వైఎస్ మార్కు..ప్రస్తుతం ‘మమ’ 175 కిలోమీటర్ల కుడికాల్వ పనుల్లో 130 కి.మీ.కు పైగా కాల్వను దివంగత వైఎస్ హయాంలోనే పూర్తి చేశారు. కాల్వ పనులు పూర్తి చేయడమంటే.. తాత్కాలికంగా కొద్దిపాటి నీటి ప్రవాహానికి వీలుగా అరకొర పనులు చేయడం కాదు. 80 మీటర్ల వెడల్పుతో కాల్వ తవ్వి లైనింగ్ సహ పనులు పూర్తి చేయిం చారు.కుడికాల్వ పనులపై అప్పట్లో రాద్ధాంతం చేసిన టీడీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పనులనే ఆసరాగా చేసుకొని, తామే ఆ పనులన్నీ చేశామనే చెప్పుకోవడానికిప్రయత్నించింది. కుడికాల్వను ఉపయోగించుకొని పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడానికి ప్రయత్నించి అభాసుపాలయింది. కాల్వలో మిగిలిన 30 శాతం పనులను హడావుడిగా చేసింది. నాణ్యతను పట్టించుకోకుండా మమ అనిపించింది. కాంక్రీట్ నిర్మాణాల్లోనూ నాణ్యత లేకపోవడంతో కాల్వకు గండిపడటానికి ప్రభుత్వం కారణమయింది. ఇక పట్టిసీమ పంపు మూత పట్టీసీమ ప్రాజెక్టులో ఒకే ఒక్క పంపును ప్రారంభించి హడావుడి చేసిన ప్రభుత్వం 24 గంటలు తిరక్కముందే ఆ పంపునూ నిరవధికంగా మూసివేసింది. భారీ గండి పడి కుడికాల్వలో ప్రవహించే నీరు తమ్మిలేరులో కలిసిపోతున్న దృష్ట్యా అక్విడెక్టు ఎగువన ఆదివారం యుద్ధ ప్రాతిపదికన మరో అడ్డుకట్ట నిర్మించారు. పోలవరం కుడికాల్వ 114వ కి.మీ. వద్ద దీనిని నిర్మించారు. ఆదివారం ఉదయం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు ఈ నిర్మాణ పనులను పరిశీలించారు. సాయంత్రానికి అడ్డుకట్ట నిర్మాణం పూర్తి చేసి పోలవరం కుడి కాల్వ నీటి ప్రవాహాన్ని నిలుపుదల చేశారు. తాడిపూడి ఎత్తిపోతల నుంచి వచ్చే నీరు, వర్షపు నీరు కుడికాల్వలోకి రాకుండా ఎక్కడిక్కడ నిలిపివేస్తున్నారు. పాత మోటారుతో పక్కా మోసం పట్టిసీమ ఎత్తిపోతలకు..హంద్రీనీవా పథకానికి చెందిన పాత మోటారు బిగించి ప్రభుత్వం నయవంచనకు పాల్పడింది. హంద్రీనీవా లిఫ్ట్‌కు ఆరేళ్లపాటు ఉపయోగించిన మోటారును తొలగించి పట్టిసీమ మొదటి పంపునకు బిగించింది. ఇది బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచింది. పైగా భోపాల్ నుంచి తీసుకువచ్చామని నమ్మబలికింది. అయితే, తెచ్చిన మోటారు పరిమాణం తక్కువగా ఉండటం. కాంక్రీటు దిమ్మలో అమర్చే సమయంలో అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలోనే హంద్రీనీవా లిఫ్ట్ వద్ద ఆరో మోటారు హఠాత్తుగా కనిపించకపోవడంతో దానినే ఇక్కడకు తీసుకువచ్చి బిగించారన్న సంగతి బట్టబయలైంది. ఆ మోటారు కూడా తొలిరోజే మొరాయించింది. మరమ్మతులు చేసి ఆన్ చేశారు. విచారణ జరిపి చర్యలు పట్టిసీమ పనుల్లో ఏర్పడిన సమస్య ఎందుకు జరిగింది? ఎవరి వల్ల జరిగిందో.. విచారణకు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఆదివారం అక్విడెక్ట్‌కు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. - మంత్రి దేవినేని ఉమా -
పట్టిసీమకు గుట్టుగా 'పంప్' చేశారు
కర్నూలు: పట్టిసీమ సాక్షిగా చంద్రబాబు సర్కారు బండారం బయటపడింది. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయడానికి టీడీపీ ప్రభుత్వం చాటుగా సాగించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హంద్రీనీవా ప్రాజెక్టు పంప్ పీక్కెళ్లి పట్టిసీమకు అమర్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని మల్యాల దగ్గర ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు ఆరో పంప్ ను ఈనెల 12న పట్టిసీమకు తరలించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి గోప్యత పాటించింది. ఆరేళ్లుగా వాడిన పంప్ ను పట్టిసీమకు అమర్చి హడావుడిగా నీళ్లు విడుదల చేశారు. ఈనెల 18న పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్స్ వద్ద 6వ నంబర్ వెల్ కు అమర్చిన మోటార్ పంప్ స్విచ్ ను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆన్ చేసి ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ నెల 16న సాయంత్రం సీఎం చంద్రబాబు పంప్‌ల వద్ద ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ రెండురోజుల తర్వాత కేవలం ఒక పంప్‌ను ప్రారంభించగలిగారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడం సంగతి అటుంచితే హంద్రీనీవా ప్రాజెక్టు పంప్ ను గుట్టుగా తరలించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. -
పట్టిసీమకు గుట్టుగా 'పంప్' చేశారు
-
'అయినా చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదు'
అనంతపురం: హంద్రినీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలంటూ ఆందోళనను ఉధృతం చేసినట్టు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రేపు ఉరవకొండలో అన్నిపార్టీల ముఖ్యనేతలతో ప్రత్యేక రైతు సదస్సును నిర్వహించనున్నట్టు చెప్పారు. 1.16 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువల నిర్మాణం పక్కన పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం దుర్మార్గమని విమర్శించారు. ఏడాదిలో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఇప్పటికే 4 లక్షల మంది వలసలు వెళ్లారని, అయినా చంద్రబాబుకు చీమకుట్టినట్టైనా లేదని వై విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. పట్టిసీమకు రూ. 1300 కోట్లు ఖర్చు చేస్తున్న చంద్రబాబుకు కరువుజిల్లాపై జాలి లేదా? అని సూటిగా ప్రశ్నించారు. అనంతరపురం ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు నీరిస్తే ఊరుకోమన్నారు. జిల్లాకు ద్రోహం చేస్తున్న చంద్రబాబును టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు ప్రశ్నించడం లేదని వై.విశ్వేశ్వ రెడ్డి విమర్శించారు. -
'చంద్రబాబు భయపడుతున్నారు'
అనంతపురం : హంద్రీ - నీవా ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఉరవకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నేత వై. విశ్వేశ్వరరెడ్డి నిప్పులు చెరిగారు. శుక్రవారం అనంతపురంలో వై.విశ్వేశ్వరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... హంద్రీ - నీవా ప్రాజెక్ట్ పూర్తయితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందని చంద్రబాబు భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టుగా మార్చేందుకు బాబు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అనంత ఆయుకట్టును నీరివ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలను ఎట్టి పరిస్థితిలో సహించమన్నారు. అవసరమైతే కాల్వలను పగులకొట్టి ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. ఈ అంశంపై ఆగస్టు 3న ఉరవకొండలో అన్ని రాజకీయా పార్టీల కీలక నేతలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వై విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. -
'బాబు శ్వేతపత్రం విడుదల చేయాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం హైదరాబాద్‌లో మండిపడ్డారు. హంద్రీ నీవా నీటి వినియోగంపై చంద్రబాబుకు స్పష్టత లేదని ఆరోపించారు. గత ఏడాది 12 టీఎంసీల నీటిని వృధా చేశారని విమర్శించారు. ఈ ఏడాది కూడా నీటిని వృధా చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో మూడున్నర లక్షల ఆయుకట్టుకు హంద్రీ నీవా నీరు ఇవ్వాల్సిందే అని చంద్రబాబు ప్రభుత్వాన్ని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. అనంత అవసరాలు తీరకుండానే మరో ప్రాంతానికి నీటిని తరలిస్తే ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హంద్రీ - నీవా ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. అనంతకు అన్యాయం జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం స్పందించడం లేదని విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
లక్ష సంతకాల ఉద్యమం!
అనంతపురం: హంద్రీనీవా ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కూడేరు, విడపనకల్లు మండల కేంద్రాలలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. హంద్రీనీవాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్ర చేయడం కేవలం ఫొటోలకు ఫోజులు ఇవ్వడానికేనని ఆయన విమర్శించారు. అనంత జీవనాడి హంద్రీనీవాను వెంటనే పూర్తి చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
ఇరిగేషన్ అధికారులతో వైఎస్ జగన్ భేటీ
-
హంద్రీనీవాకు నిధులు కేటాయించాలి
గుంతకల్లు: ఆనంతపురం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచేసి, 2016 నాటికి 4లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని ఉరవకొండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తిచేయాలని విశ్వేశ్వర రెడ్డి బుధవారం నిరాహారదీక్ష ప్రారంభించారు. ఉరవకొండలోని హంద్రీనీవా ప్రాజెక్టు శిలాఫలకం వద్ద ఆయన దీక్ష చేపట్టారు. ఈ నిరసన దీక్షకు గురువారం ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రోజా, అఖిల ప్రియ ఎమ్మెల్సీ దేవగుడి నారయణ రెడ్డి హజరై మద్దతు తెలిపారు. -
'హంద్రీనీవా' కోసం ఎమ్మెల్యే నిరాహారదీక్ష
హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి బుధవారం నిరాహారదీక్ష ప్రారంభించారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని హంద్రీనీవా ప్రాజెక్టు శిలాఫలకం వద్ద నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి నిరశన దీక్ష చేపట్టారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో హంద్రీనీవాకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. కచ్చితంగా 100 టీఎంసీల నీటిని హంద్రీనీవా ప్రాజెక్టుకు కేటాయించాలన్నారు. విశ్వేశ్వర రెడ్డి నిరాహారదీక్షకు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, జయరాముడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ సంఘీభావం తెలిపారు.