
'బాబు శ్వేతపత్రం విడుదల చేయాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం హైదరాబాద్లో మండిపడ్డారు. హంద్రీ నీవా నీటి వినియోగంపై చంద్రబాబుకు స్పష్టత లేదని ఆరోపించారు. గత ఏడాది 12 టీఎంసీల నీటిని వృధా చేశారని విమర్శించారు. ఈ ఏడాది కూడా నీటిని వృధా చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో మూడున్నర లక్షల ఆయుకట్టుకు హంద్రీ నీవా నీరు ఇవ్వాల్సిందే అని చంద్రబాబు ప్రభుత్వాన్ని విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
అనంత అవసరాలు తీరకుండానే మరో ప్రాంతానికి నీటిని తరలిస్తే ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హంద్రీ - నీవా ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. అనంతకు అన్యాయం జరుగుతున్నా జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం స్పందించడం లేదని విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.