ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హంద్రీనీవ బ్రాంచ్ కెనాల్ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా పనులు నిర్వహిస్తున్నారనీ, లాండ్ అక్విజేషన్ యాక్ట్-2013ను ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నర్సాపురం, సిరిపి రైతులు కోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ తీర్పుతో అనంతపురం, పెరూర్, హగరి బ్రాంచ్ కెనాల్ రైతులకు ఊరట లభించింది. రైతులకు నష్టపరిహారం చెల్లించి 2013 లాండ్ అక్విజేషన్ యాక్ట్‌లోని 13 వ నిబంధనను అమలు చేయాలని న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు.