ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు | High Court Issues Stay Order On Handri Neeva Branch Canal Works | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 11 2018 7:49 PM | Last Updated on Fri, Jul 12 2019 6:06 PM

High Court Issues Stay Order On Handri Neeva Branch Canal Works - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. హంద్రీనీవ బ్రాంచ్‌ కెనాల్‌ పనులు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని నర్సాపురం, సిరిపి రైతులు కోర్టును ఆశ్రయించారు. నష్టపరిహారం చెల్లించకుండా పనులు నిర్వహిస్తున్నారనీ, లాండ్‌ అక్విజేషన్‌ యాక్ట్‌-2013ను ఉల్లంఘించారంటూ రైతులు హైకోర్టులో పిటిషన్‌పై దాఖలు చేశారు. విచారణ చేపట్టి  హైకోర్టు రైతులకు నష్టపరిహారం చెల్లించి 2013 లాండ్‌ అక్విజేషన్‌ యాక్ట్‌లోని 13 వ నిబంధనను అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.  కాగా, ఈ తీర్పుతో అనంతపురం, పెరూర్‌, హగరి బ్రాంచ్‌ కెనాల్‌ రైతులకు ఊరట లభించింది. రైతుల తరపున న్యాయవాది రాజేశ్వర్‌రెడ్డి కోర్టులో వాదనలు వినిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement