'హంద్రీ నీవాతోనే అనంత నీటి కష్టాలకు చెక్' | y visweswara reddy takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'హంద్రీ నీవాతోనే అనంత నీటి కష్టాలకు చెక్'

Published Tue, May 5 2015 2:56 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM

y visweswara reddy takes on chandra babu naidu

అనంతపురం:హంద్రీ-నీవా ప్రాజెక్టుతో మాత్రమే జిల్లా నీటి కష్టాలు తీరుతాయని వైఎస్సార్ సీపీ నేత వై విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. హంద్రీ-నీవాను పూర్తి చేయాలంటే రూ. 2 వేల కోట్లు అవసరం కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం రెండొందల కోట్ల రూపాయిలను మాత్రమే కేటాయించడం నిజంగా దుర్మార్గమైన చర్య అని అన్నారు. మంగళవారం మీడియతో మాట్లాడిన విశ్వేశ్వర్ రెడ్డి.. రాయలసీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

 

హంద్రీ-నీవాతోనే అనంతపురం జిల్లా తాగు, సాగు నీటి కష్టాలు తీరుతాయన్నారు. సీఎం, మంత్రులు హడావుడి చేస్తున్నారనే కానీ.. ఆచరణలో సాధించింది శూన్యమన్నారు.హంద్రీ-నీవాను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఆయన బెళుగుప్పలో లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement