
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి మండిపడ్డారు. ఇంకుడు గుంతల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. అనంతపురంలో రైతులు నానాకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. కరువును తట్టుకోలేక పెడ్డ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
కరువు నివారణ చర్యలు చేపట్టి రైతులకు ఉపాధి మార్గం చూపించాలని డిమాండ్ చేశారు. కరువు దెబ్బకు బ్రతకుదెరువు కోసం లక్షల మంది రైతన్నలు పొట్టచేతపట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసవెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. అనంతపురంలో హంద్రీనీవ పెండింగ్ పనులను, డిస్టిబ్యూటరీలను త్వరితగతిన పూర్తిచేసి ఆయకట్టు ద్వారా రైతులకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.