'అసెంబ్లీ నుంచి ప్రభుత్వం పారిపోయింది'
హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత భయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ...అసెంబ్లీ నుంచి ప్రభుత్వం పారిపోయిందన్నారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై మాజువాణి ఓటింగ్ నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మెజార్టీ ఉందని బాబు సర్కారు రాక్షసపాలన సాగిస్తోందని విమర్శించారు. బిల్లుపై అధికారముందని తప్పించుకున్న ప్రభుత్వం.. ప్రజలు నుంచి తప్పించుకోలేదని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
మరో ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ...ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు సీఎం చంద్రబాబు అవాస్తవాలు, అర్థ సత్యాలు వల్లించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.