హంద్రీ – నీవా పనులు వేగవంతం చేయండి | to speed up the works Handri - niva | Sakshi
Sakshi News home page

హంద్రీ – నీవా పనులు వేగవంతం చేయండి

Published Fri, Nov 25 2016 11:58 PM | Last Updated on Tue, Oct 30 2018 5:12 PM

హంద్రీ – నీవా పనులు వేగవంతం చేయండి - Sakshi

హంద్రీ – నీవా పనులు వేగవంతం చేయండి

  • నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి
  • ముఖ్యమంత్రిని కోరిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
  • అనంతపురం : కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరివ్వడంతోపాటు కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందించే హంద్రీ–నీవా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని, త్వరితగతిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థను పూర్తి చేయాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రిని కలిశారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి హంద్రీ – నీవాకు వంద టీఎంసీల నీరు కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఉరవకొండ నియోజకవర్గంలో హంద్రీ–నీవా కాలువ నుంచి కూడేరు మండలం ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు తాగు, సాగునీటి కోసం ఫీడర్‌ ఛానెల్‌ తవ్వేందుకు పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేయాలని అభ్యర్థించారు. అలాగే ఆమిద్యాల లిఫ్ట్‌ ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసేందుకు వెంటనే టెండర్లు పిలిచి లిఫ్ట్‌ నిర్మాణం, డిస్ట్రిబ్యూటరీ పనులను వచ్చే ఖరీఫ్‌లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
    = వజ్రకరూరు నుంచి పొట్టిపాడు మీదుగా  మకాం వేయడంతో పంటలను కాపాడామని తాము కూడా మాట్లాడామని, కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని వివరించారు. ఇన్ పుట్‌సబ్సిడీ ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం రెయిన్ గన్ లను తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం ’అనంత’ రైతుల్లో జరుగుతోందని, ఈ క్రమంలో పరిహారం ఇవ్వడమే ఉత్తమమని చెప్పినట్లు తెలిసింది. చివరకు జిల్లాలో ఎంత పంట ఎండింది, ఎంత పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే అంచనాలు సిద్ధం చేయించి నివేదికలు పంపితే ఆలోచిద్దామని సీఎం చెప్పారు. ఇన్సూరెన్స్ పైనా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


    శ్రీరామరెడ్డి తాగునీటి పథకంపై విచారణ
    శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో 12 కిలోమీటర్ల మేర పైపులై¯ŒS నిర్మాణంలో అవినీతి జరిగిందని, దానిపై విచారణ చేయించాలని జిల్లానేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణకు కమిటీ వేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. 12కిలోమీటర్లకు అదనంగా నిధులు కేటాయించి పైపులై¯ŒS నిర్మాణాన్ని పూర్తి చేస్తామని సీఎం చెప్పినట్లు తెలిసింది. అలాగే వర్షాభావంతో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని, వేసవిలో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయిలో తలెత్తే ప్రమాదముందని, నివారణ చర్యలు తీసుకోవాలని జిల్లానేతలు చంద్రబాబును కోరారు. దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తనకు నివేదికను పంపాలని ఆయన సూచించారు.  


    వచ్చే నెల 2న గొల్లపల్లిలో గంగపూజ  
    2012లో జీడిపల్లి రిజర్వాయర్‌కు కృష్ణా నీళ్లొచ్చినా, ఇప్పటి వరకూ గొల్లపల్లికి చేరలేదు. అయితే.. డిసెంబర్‌ 2న గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీళ్లొదిలి గంగపూజ చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఆరోజు గొల్లపల్లికి నీళ్లివ్వడంతో పాటు చెర్లోపల్లి రిజర్వాయర్‌కు ఎప్పటిలోగా నీరిస్తామనే తేదీని కూడా ప్రకటిస్తామని, అందుకు వీలుగా పనులు ఎప్పటిలోగా పూర్తవుతాయో తెలుసుకోవడానికి అధికారులు, ఏజెన్సీలతో సమావేశం నిర్వహించి ఓ నివేదికను పంపాలని మంత్రులను  సీఎం ఆదేశించారు. జిల్లానేతల మధ్య విభేదాలపై సీఎం గట్టిగానే హెచ్చరించారు. పార్టీలో వర్గాలను ప్రోత్సహించడం, ఓ నియోజకవర్గంలో మరో నేత జోక్యం చేసుకోవడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని చెప్పారు. ఒకట్రెండుసార్లు చెప్పి చూస్తామని, అయినా మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశానికి అనంత ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి గైర్హాజరయ్యారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సీఎంకు కన్పించి సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయినట్లు తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement