
విలువలకు కట్టుబడి బాబు రాజీనామా చేయాలి
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నేతలు వై విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్ పాషా అన్నారు
అనంతపురం: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నేతలు వై విశ్వేశ్వర్ రెడ్డి, చాంద్ పాషా అన్నారు. ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి బయటపడేందుకు చంద్రబాబునాయుడు తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నైతిక విలువలకు కట్టుబడి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఇక రాయలసీమ రైతులకు వేరు శెనగ విత్తనాలు సరఫరా చేయడంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ విఫలమైందని అనంతర వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు సెక్షన్ 8పై గగ్గోలు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాపు గుర్నాధ్ రెడ్డి అన్నారు. మరోపక్క, హిందూపురం వైఎస్సార్సీపీ సమన్వయ కర్త నవీన్ మిశ్చల్ కూడా చంద్రబాబును విమర్శించారు. నిజంగా బాబుకు నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.