ఫీడర్ చానల్ తవ్వకానికి అనుమతించండి
- కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్ర« దాన కాలువ నుంచి కూడేరు మండలం ముద్దలాపురం, ఇ ప్పేరు చెరువులకు తాగు, సాగు నీరు చేరేందుకు ఫీడర్ చా నల్ తవ్వించేందుకు పరిపాలన పరమైన అనుమతి మంజూ రు చేయాలని కలెక్టర్ కోన శశిధర్‌ను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్‌ని రెవెన్యూ భవన్‌లోని కలెక్టర్ చాంబర్‌లో కలిసి ఈ మేరకు లేఖ అందజేసి ప రిస్థితిని వివరించారు.
కూడేరు మండలంలోని ఇప్పేరు, అంతరగంగ, నాగిరెడ్డిపల్లి, కూడేరు, కలగల్ల, ముద్దలాపురం, త దితర పది గ్రామాల ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడితో ఇ బ్బందిపడుతున్నారన్నారు. కూడేరు మండలం ద్వారా వెళుతున్న హంద్రీ–నీవా ప్రధాన కాలువ రెండవ దశ నుంచి ఫీడర్ చానల్ ఏర్పాటు చేసి ముద్దలాపురం చెరువుకి, అక్కడి నుం చి ఇప్పేరు చెరువుకి నీరు వదలడం ద్వారా సమస్యని పరి ష్కరించవచ్చన్నారు. రెండు చెరువులకు నీరు వదలడం ద్వారా పది గ్రామలతో పాటు ఇప్పేరు చెరువుకు దిగువన ఉ న్న గార్లదిన్నె మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలకు కూడా లభించడంతో పాటు దాదాపు 15 గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెంది వ్యవసాయానికి ఉపయోగకరం గా ఉంటుందన్నారు. అలాగే అంతరగంగ గ్రామం చుట్టుపక్కల ఉన్న సుమారు 70 తలిపిరిలు (స్ప్రింగ్స్) కూడా రీచార్జి అవుతాయన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ రెండవ ఫేజ్‌లోని 232.422 కిలోమీటర్ వద్ద నుంచి ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీరు విడుదల చేయడానికి 2.6 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్‌ని తవ్వాల్సి ఉంటుందన్నారు. సామూహిక మొక్కల పెంపకానికి నిధులివ్వండి :జిల్లా కేం ద్రం నుంచి వయా కూడేరు, ఉరవకొండ మీదుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చెళ్లగురికి గ్రామం వరకు ప్రస్తుతం కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారని ఆయన కలెక్టర్‌కు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ‘సామూహిక మొక్కల పంపకం’ కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ప్యాకేజీ నిధులు కింద పనిని మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు.