Handri-niva
-
ఫీడర్ చానల్ తవ్వకానికి అనుమతించండి
కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్ర« దాన కాలువ నుంచి కూడేరు మండలం ముద్దలాపురం, ఇ ప్పేరు చెరువులకు తాగు, సాగు నీరు చేరేందుకు ఫీడర్ చా నల్ తవ్వించేందుకు పరిపాలన పరమైన అనుమతి మంజూ రు చేయాలని కలెక్టర్ కోన శశిధర్‌ను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్‌ని రెవెన్యూ భవన్‌లోని కలెక్టర్ చాంబర్లో కలిసి ఈ మేరకు లేఖ అందజేసి ప రిస్థితిని వివరించారు. కూడేరు మండలంలోని ఇప్పేరు, అంతరగంగ, నాగిరెడ్డిపల్లి, కూడేరు, కలగల్ల, ముద్దలాపురం, త దితర పది గ్రామాల ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడితో ఇ బ్బందిపడుతున్నారన్నారు. కూడేరు మండలం ద్వారా వెళుతున్న హంద్రీ–నీవా ప్రధాన కాలువ రెండవ దశ నుంచి ఫీడర్ చానల్ ఏర్పాటు చేసి ముద్దలాపురం చెరువుకి, అక్కడి నుం చి ఇప్పేరు చెరువుకి నీరు వదలడం ద్వారా సమస్యని పరి ష్కరించవచ్చన్నారు. రెండు చెరువులకు నీరు వదలడం ద్వారా పది గ్రామలతో పాటు ఇప్పేరు చెరువుకు దిగువన ఉ న్న గార్లదిన్నె మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలకు కూడా లభించడంతో పాటు దాదాపు 15 గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెంది వ్యవసాయానికి ఉపయోగకరం గా ఉంటుందన్నారు. అలాగే అంతరగంగ గ్రామం చుట్టుపక్కల ఉన్న సుమారు 70 తలిపిరిలు (స్ప్రింగ్స్) కూడా రీచార్జి అవుతాయన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ రెండవ ఫేజ్‌లోని 232.422 కిలోమీటర్ వద్ద నుంచి ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీరు విడుదల చేయడానికి 2.6 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ని తవ్వాల్సి ఉంటుందన్నారు. సామూహిక మొక్కల పెంపకానికి నిధులివ్వండి :జిల్లా కేం ద్రం నుంచి వయా కూడేరు, ఉరవకొండ మీదుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చెళ్లగురికి గ్రామం వరకు ప్రస్తుతం కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారని ఆయన కలెక్టర్‌కు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ‘సామూహిక మొక్కల పంపకం’ కోసం స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కింద పనిని మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు. -
హంద్రీ-నీవాలో 358% పెంపు
♦ పేరూరు బ్రాంచ్ కెనాల్ అంచనాలు భారీగా పెంచేశారు ♦ ఆర్థిక శాఖ, ఎస్ఎల్ఎస్సీ అభ్యంతరాలు బేఖాతర్ ♦ తనకు సన్నిహితుడైన ఎమ్మెల్సీకి కట్టబెట్టాలంటూ ‘పెదబాబు’ ఒత్తిడి సాక్షి, హైదరాబాద్ : అస్మదీయుడైతే.. పనులు చేయకున్నా ఫర్వాలేదు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలనే సాకు చూపి అంచనాలను అడ్డగోలుగా పెంచేస్తారు. పనిలో పనిగా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేస్తారు. పెంచిన మేరకు వాటాలు పంచుకుతింటారు. తస్మదీయుడైతే.. నిబంధనల మేరకు పనులు చేస్తున్నా.. చేయడం లేదనే సాకు చూపి 60-సీ సెక్షన్ ప్రయోగిస్తారు. ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా పనులు రద్దు చేసేస్తారు. ఆ తర్వాత అంచనాలు పెంచేసి.. వాటిని దొడ్డిదారిన అస్మదీయుడికి అప్పగించి పెంచిన అంచనాల మేరకు వాటాలు పంచుకుతింటారు. .. ఇదీ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో సాగుతోన్న అక్రమాల దందా. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం తొలి దశలో జీడిపల్లి రిజర్వాయర్ నుంచి పేరూరు బ్రాంచ్ కెనాల్ తవ్వి 80,600 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని నిర్ణయించారు. 36వ ప్యాకేజీ కింద పేరూరు బ్రాంచ్ కెనాల్ పనులను 2005లో ఓం-రే(జాయింట్ వెంచర్) రూ.93.92 కోట్లకు దక్కించుకుంది. టీడీపీ అధికారంలోకి రాగానే పనులు చేయడం లేదనే సాకు చూపి ఒప్పందం రద్దు చేసేశారు. అదే పని అంచనా వ్యయాన్ని రూ.336.15 కోట్లకు పెంచుతూ మంగళవారం జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వుల(జీవో-577)ను జారీ చేశారు. అంటే ఒకేసారి అంచనా వ్యయాన్ని 358 శాతం పెంచినట్లు స్పష్టమవుతోంది. ఈ పనిని తనకు సన్నిహితుడైన ఎమ్మెల్సీకి ‘కొటేషన్’ పద్ధతిలో కట్టబెట్టాలంటూ జలవనరుల శాఖ అధికారులపై పెదబాబు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే.. భూసేకరణను వేగంగా చేసి.. పనులు సజావుగా చేయడానికి సహకరించాల్సిన సర్కార్ తద్భిన్నంగా వ్యవహరించింది. విపక్ష పార్టీకి చెందిన కాంట్రాక్టర్ అనే నెపంతో కక్ష సాధింపులకు దిగి పనులను రద్దు చేసేసింది. ఆ తర్వాత రంగంలోకి దిగిన ఓ ఎమ్మెల్సీ పనుల అంచనా వ్యయాన్ని పెంచేయాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు అంచనా వ్యయాన్ని రూ.355.304 కోట్లకు పెంచాలంటూ గత ఏప్రిల్ 19న అనంతపురం జిల్లా సీఈ జలంధర్ జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఒకేసారి అంచనా వ్యయం నాలుగు రెట్లు పెంచడంపై స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎస్ఎల్ఎస్సీ) ఆశ్చర్యం వ్యక్తం చేసి.. తోసిపుచ్చింది. అవే ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపగా.. అంచనా వ్యయం 400 శాతం పెంచడానికి అనుమతించబోమని అధికారులు తెగేసి చెప్పారు. దీనిపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ అంచనా వ్యయం రూ.336.15 కోట్లకు పెంచే ఫైలుపై తానే సంతకం చేసేశారు. ఆ మేరకు జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ప్రకారం ఈ పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగించాలి. కానీ.. యుద్ధప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయాలనే సాకుతో కొటేషన్ల ద్వారా తనకు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీకి కట్టబెట్టాలంటూ జలవనరుల శాఖపై పెదబాబు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వారంలోగా ఈ పనులు టీడీపీ ఎమ్మెల్సీకి కట్టబెడుతూ ఉత్తర్వులు వెలువడడం ఖాయమని జలవనరుల శాఖ కీలక అధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. ఐదో లిఫ్టు పేరుతో 52 కోట్లు ఎత్తిపోత! హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల్లో ఇదో కొత్తరకం దోపిడీ... అదనపు లిఫ్టు చేపట్టాలంటూ వచ్చిన ప్రతిపాదనను రాష్ర్టప్రభుత్వం కనీసం పరిశీలించక ముందే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించేశారు. ఎవరేమనుకుంటే మాకేం అన్నట్లు రూ.52.52 కోట్ల పనులకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా ఊపేశారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో.. మడకశిర బ్రాంచ్ కెనాల్(ఎంబీసీ) ద్వారా అనంతపురం జిల్లాలో మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లో 74,400 ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. హంద్రీ-నీవా ప్రధాన కాలువ 304.50 కి.మీ నుంచి నాలుగు దశల్లో 121.481 మీటర్లకు 18.219 క్యూసెక్ల నీటిని నాలుగు లిఫ్టుల ద్వారా ఎంబీసీలోకి ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. లిఫ్టుల నిర్మాణానికి సంబంధించిన ఎలక్ట్రో మెకానిక్ పనులను రూ.357.80 కోట్లకు వీఆర్సీఎల్-ష్యూ-డబ్ల్యూపీఐఎల్ జాయింట్ వెంచర్(జేవీ) చేజిక్కించుకుని జూన్ 18, 2008న ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ప్రధాన కాలువ నుంచి ఎంబీసీకి నీటిని తరలించే ప్రాంతం 323.950 కి.మీకి మారినందువల్ల అదనంగా ఐదో లిఫ్టును చేపట్టాలని 2013లో కాంట్రాక్టర్ ప్రతిపాదించగా... విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరస్కరించింది. టీడీపీ అధికారంలోకి రాగానే పెదబాబు ‘ఆస్థాన’ కాంట్రాక్టర్ ఆ పనులను సబ్ కాంట్రాక్టు కింద చేజిక్కించుకున్నారు. ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే.. పెదబాబు నోటి మాటపై అదనపు లిఫ్టు పనులు చేపట్టారు. పెదబాబు ఒత్తిడి మేరకు.. ఆ పనులకు ఎస్ఎస్ఎల్సీ(రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ), ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్) కమిటీలు అనుమతి ఇచ్చేశాయి. అదనపు లిఫ్టు పనుల విలువను రూ.52.52 కోట్లుగా నిర్ధారించాయి. టెండర్‌తో నిమిత్తం లేకుండా పాత కాంట్రాక్టర్‌కే అప్పగిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జూన్ 20న ఆమోదముద్ర వేశారు. -
నీటి కేటాయింపుల్లో సీమకు అన్యాయం
► కృష్ణా డెల్టాకు, తెలంగాణకు నీళ్లు తరలించేందుకు కుట్ర ► హంద్రీ-నీవాకు 45 టీఎంసీలు కేటాయించాలి ► మాజీ ఎంపీ అనంత డిమాండ్ అనంతపురం సెంట్రల్ : ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ మంత్రులు తమ ప్రాంతాల ప్రయోజనాలు చూసుకుని రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ ర్షాభావంతో సీమలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయనీ, ‘సీమ’లోని ప్రాజెక్టులన్నీ కృష్ణాజలాలపైనే ఆధారపడ్డాయని తెలిపారు. కానీ సీమకు నీళ్లు అందిచండంలో ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద ‘సీమ’ కరువును సాకుగా చూపి ఆచరణలో మాత్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. గతేడాది కరెంట్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ , తాగునీటి ముసుగులో ఆంధ్రా పాలకులు శ్రీశైలం నీటిని త్రవ్వుకున్నారన్నారు. దీంతో సీమకు తీవ్ర నష్టం వాటిల్లిందనీ, ఈ ఏడాది కూడా గతేడాదిలాగే వారి స్వలాభాలు చూసుకుని సీమకు అన్యా యం చేసేందుకు ఇద్దరు మంత్రులు ప్రణాళిక రచించి బయటకు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ‘సీమ’ వాట అంశాన్ని బోర్డు ముందు ఉంచకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను డెల్టాకు ఇస్తున్నారనీ... ఈ క్రమంలో శ్రీశైలం నుంచి హంద్రీ-నీవాకు 45 టీఎంసీలు ఇవ్వాలన్నారు. టీబీ డ్యాంలో పూడిక కారణంగా హెచ్చెల్సీ, ఎల్ఎల్సీకి దక్కాల్సిన నికర జలాలు ఏటా 85 టీఎం సీలు శ్రీశైలంలోకి చేరుతున్నాన్నారు. ఈ నీటినీ సీమకే కేటాయించాలన్నారు. ‘సీమ’లో భూములను బీళ్లుగా పెట్టి డెల్టాలో రెండు పంటలకు నీళ్లు అందించాలని మంత్రి దేవి నేని ఆలోచిస్తున్నారని విమర్శించారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండేలా బోర్టు చర్యలు తీసుకోవాలనీ, ఆ తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై కృష్ణాబోర్డుకే యాజ మాన్య హక్కులు కల్పించి సీమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. . ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసే కుట్ర టీడీపీ ముఖ్య ప్రజాప్రతినిధులు ప్రైవేటు డెయిరీని నిర్వహిస్తుండటం వల్ల వారి స్వలాభం కోసం ప్రభుత్వ డెయిరీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారని మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. దాదాపు 2 లక్షల కుటుంబాలు ప్రభుత్వ డెయిరీకి పాలు పోస్తూ జీవనం సాగిస్తున్నాయని వివరించారు. జిల్లాలోనే రూ. 11 కోట్లు పాల బకాయిలు ఉంటే రైతులు ఏ విధంగా బతుకుతారని ప్రశ్నించారు. వెంటనే బకాయిలు చెల్లించి, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పాడిరైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. -
హామీలు విస్మరించి.. ఆపై అబద్ధాలా?
► చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి ► రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతున్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీల అమలును విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడులో కొత్త అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన దీక్షలను చంద్రబాబు భజన బృందం ఎద్దేవా చేయడం సిగ్గుచేటన్నారు. పైగా మహానాడులో దీనిపై తీర్మానం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. సొంత డబ్బా కోసం, పెదబాబు, చినబాబును పొగి డేందుకే మహానాడును పరిమితం చేశారన్నారు. వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రెండేళ్లపాలనపై చర్చ జరపాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూనే సివిల్ సప్లయ్, ఇరిగేషన్ టెండర్లు, చంద్రన్నకానుక పేరుతో రూ. వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కేవలం రూ. 500 కోట్లతో డిస్ట్రిబ్యూటరీ, చెరువుల ద్వారా హంద్రీ-నీవా నీటిని జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. అయితే 1163 చెరువులకు హంద్రీ-నీవా పథకానికి లింకేజీ చేసే ఊహాజనిత ప్రాజెక్ట్ గురించి జిల్లా మంత్రులు మాట్లాడడం విడ్డూరమన్నారు. సర్వేల పేరుతో కోట్ల రూపాయలు దండుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. నీటిని జిల్లాను దాటించే విధంగానే పనులు జరుగుతున్నాయన్నారు. కనగానపల్లి జె డ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి బాబా సలాం, కార్యదర్శి సునీల్‌దత్తారెడ్డి పాల్గొన్నారు. -
ఆయకట్టు బీడే!
► హంద్రీ-నీవా ద్వారా పొలాలకు నీరిచ్చేది లేదని తేల్చిన ప్రభుత్వం ► చెరువులకు ఇచ్చేలా ప్రతిపాదనలు పంపాలని ఆదేశం ► 24.3 టీఎంసీలతో ప్రతిపాదనలు పంపిన అధికారులు ► డీపీఆర్‌కు రూ.43.96 కోట్లు అవసరమని నివేదిక సాక్షిప్రతినిధి, అనంతపురం అంతా అనుకున్నట్లే జరుగుతోంది. హంద్రీ-నీవా ద్వారా చెరువులకు మినహా ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది. చెరువులకు నీరిచ్చేందుకు ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు ప్రాథమిక అంచనాతో ఓ నివేదిక పంపారు. పూర్తిస్థాయిలో సర్వే చేసి త్వరలోనే మరో నివేదిక పంపనున్నారు. హంద్రీ-నీవా ద్వారా నాలుగు జిల్లాలకు 40 టీఎంసీలు ఎత్తిపోసుకునేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందులో అత్యధికంగా 23 టీఎంసీలు ‘అనంత’కు కేటాయించారు. ఇందులో ఫేజ్-1లోని 1.18లక్షల ఎకరాలకు 8 టీఎంసీలు, ఫేజ్-2లో 2.27లక్షల ఎకరాలకు 15 టీఎంసీలు కేటాయించారు. ఇదిలా ఉండగా.. జిల్లాలోని అన్ని చెరువులకూ నీరిస్తామని ప్రతీ సభలోనూ మాట్లాడే చంద్రబాబు ఆయకట్టుకు నీరిచ్చే అంశం మాత్రం ప్రస్తావించడం లేదు. ఈ క్రమంలో జిల్లాలోని చెరువులకు నీరిచ్చేందుకు అవసరమయ్యే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు ఇటీవవల ప్రాథమిక నివేదికను పంపారు. నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో 1263 చెరువులు ఉన్నాయి. ఇందులో 80 చెరువులకు నీరివ్వడం సాధ్యం కాదు. తక్కిన 1183 చెరువుల్లో మడకశిర బ్రాంచ్‌కెనాల్ కింద 265 ఉన్నాయి. ఇవి మినహాయిస్తే తక్కిన 918 చెరువుల్లో 407 చెరువులకు గ్రావిటీ ద్వారా నీరు అందించొచ్చు. దీని కోసం 171 స్లూయిస్ ఏర్పాటు చేయాలి. ఈ 407 చెరువులకు నీరిచ్చేందుకు 13.8 టీఎంసీల నీరు అవసరం. ఈ నీటిని చెరువులకు అందించేందుకు 822 కిలోమీటర్లు కాలువలు ఏర్పాటు చేయాలి. ఇవి కాకుండా మిగిలిన 511 చెరువులకు నీరిచ్చేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలి. ఇందుకు 130 లిఫ్ట్‌లు అవసరమవుతాయి. ఈ చెరువులకు 10.5 టీఎంసీలు అవసరం. ఈ చెరువులకు 1926 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వాలి. ఈ మేరకు సర్వే చేసి డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) పంపేందుకు రూ.43.96 కోట్లు అవసరమని హంద్రీ-నీవా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. జిల్లాకు కేటాయింపు 23 టీఎంసీలు... చెరువులకు ప్రతిపాదనలే 24. 3 టీఎంసీలు: జిల్లాలో ఆయకట్టుకు నీరిచ్చేందుకు 23 టీఎంసీలు కేటాయిస్తే, చెరువులకే 24.3 టీఎంసీల అవసరమని అధికారులు పంపడం చూస్తే ఆయకట్టుకు నీరిచ్చే ఉద్దేశం లేదని స్పష్టమవుతోంది. ఒకవేళ చెరువులకు నీరిచ్చి తర్వాత ఆయకట్టుకు ఇస్తారని అనుకుంటే చెరువులకు అవసరమయ్యే 24.3 టీఎంసీలతో పాటు ఆయకట్టుకు కేటాయించిన 23 టీఎంసీలు కలిపి 47.3 టీఎంసీలు జిల్లాకు అవసరం. సీమలోని నాలుగు జిల్లాలకు కేటాయింపులే 40 టీఎంసీలు ఉంటే ‘అనంత’కు 47.3 టీఎంసీలు ఎలా ఇస్తారనేది పాలకులు సమాధానం చెప్పాల్సి ఉంది. పైగా చెరువులకు నీరిచ్చేందుకు 2,748 కిలోమీటర్లు కాలువలు నిర్మించాలని ప్రతిపాదనలు పంపుతున్నారంటే దీనికి ఎంత ఖర్చవుతుంది? ఈ పనులు ఎప్పుడు పూర్తవుతాయనేది ఇట్టే తెలుస్తోంది. ఆయకట్టుకు నీరిచ్చే యోచన చేయడం లేదని రాజకీయపార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయకట్టుకు నీరిస్తారా? లేదా? అని మంత్రి పల్లె రఘునాథరెడ్డిని ఎమ్మెల్సీ గేయానంద్ సూటిగా ప్రశ్నించారు. చెరువులన్నిటికీ నీరిస్తామని పల్లె సమాధానం చెప్పారు. మళ్లీ సూటిగా ప్రశ్నించినా...మంత్రి అదే సమాధానం చెప్పారు. ఈ పరిణామాలను చూస్తే చెరువులకు నీరిస్తామని ప్రకటించడం మినహా ఆయకట్టుకు నీరిస్తామని ప్రభుత్వం చెప్పకపోవడం చూస్తే ‘అనంత’కు తీరని అన్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని స్పష్టమవుతోంది. -
నీటి కష్టం తీరేదెన్నడో?
కోట్లు కుమ్మరిస్తున్నా తాత్కాలిక ఉపశమనమే నత్తనడకన హంద్రీ-నీవా కానరాని ఎన్టీఆర్ సుజల స్రవంతి శాశ్వత పరిష్కారానికి చొరవ చూపని ప్రభుత్వం జిల్లాలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం శాశ్వత పరిష్కారానికి చొరవ చూపడం లేదు. హంద్రీ-నీవా పూర్తిచేసి నీళ్లు తెస్తామంటూ నేతలు ఊదరగొడుతున్నా, భూసేకరణ అడ్డంకులే తొలగని ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఇక కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో ప్రారంభమైన కండలేరు నీటి పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టింది. ఇదిలా ఉండగా, నెలకు రూ.7 కోట్లు వెచ్చించి 2400 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఇందులో సగం నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి చేరుతున్నాయనే ఆరోపణలున్నాయి. చిత్తూరు: జిల్లాలో నీటి ఎద్దడికి ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో దాదాపు రూ.300 కోట్లు ఖర్చుచేసినట్లు చెబుతున్నా.. ఆ మేరకు నీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. జిల్లావ్యాప్తంగా 18,848 చేతిపంపులతో పాటు 2,181 డెరైక్ట్ పంపింగ్ స్కీమ్స్, 439 మినీ పీడబ్ల్యూఎస్, 6,039 పీడబ్ల్యూఎస్, 5 సీపీడబ్ల్యూఎస్ పథకాలున్నా.. తీవ్ర వర్షాభావంతో వీటిలో సగం కూడా పనిచేయకుండా నిలిచిపోయాయి. దాదాపు 2,400 గ్రామాలకు ప్రభుత్వమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఇందుకోసం నెలకు రూ.7 కోట్ల వరకు వెచ్చించారు. 2014 జూన్ మొదలు 2015 నవంబర్ వరకు నీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. 2014 ఏప్రిల్ నుంచి 2015 నవంబర్ నాటికే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రభుత్వం రూ.73.77 కోట్ల నిధులు వెచ్చించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇవికాక తాగునీటి పథకాల మరమ్మతులు, కొత్త బోరుబావుల తవ్వకం, మోటార్ల ఏర్పాటు తదితర వాటికి రూ.150 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా బాబు రెండేళ్ల పాలనలో జిల్లాలో తాగునీటి కోసం రూ.300 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపి ఈ నిధుల్లో చాలామేరకు అధికార పార్టీ నాయకులు స్వాహా చేసినట్టు సమాచారం. హంద్రీ-నీవా పూర్తి చేసి ఏడాదిలోనే నీళ్లిస్తానని చంద్రబాబు పదే పదే చెప్పినా అది ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. హంద్రీ-నీవాకు భూసేకరణ అడ్డంకులే ఇంకా తొలగలేదు. ఇక ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీరు ఇస్తానని బాబు హామీ ఇచ్చినా ఆ హామీ గంగలో కలిసింది. జిల్లాలో 100 గ్రామాల్లో కూడా ఈ పథకం అమలు కావడం లేదు. నవంబర్‌లో వర్షాలు కురవకపోతే జిల్లాలో తాగునీటి సమస్య ఊహించడమే కష్టంగా ఉండేది. నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నా నీరు దొరికే పరిస్థితి కనిపించేది కాదు. కండలేరు పథకాన్ని పక్కన పెట్టిన బాబు జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో రూ.7,390 కోట్లతో కండలేరు తాగునీటి పథకానికి రూపకల్పన చేశారు. జిల్లావ్యాప్తంగా రూ.5,990 కోట్లు వెచ్చించి 52 మండలాల పరిధిలో 8,468 గ్రామాలకు తాగునీరందించాలనేది లక్ష్యం. మొదటి ఫేజ్‌లో జిల్లాలోని తిరుపతి, తిరుమల, చిత్తూరు, మదనపల్లి, పీలేరు,పలమనేరు, పుంగనూరు మండలాల పరిధిలోని గ్రామాలకు తాగునీరందించాల్సి ఉంది. ఈ నీటిపథకం కోసం కండలేరు నుంచి చిత్తూరు జిల్లాలోని కలవకుంట ఎన్టీఆర్ జలాశయం వరకు 168 కిలోమీటర్ల మేర కాలువ తవ్వి రేణిగుంట వద్ద 420 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటిశుద్ధి కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. రెండేళ్లలో ఈ పథకాన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తాగునీటి పథకం పనులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రపదేశ్(ఇన్‌క్యాప్)కు అప్పగించారు. తొలివిడతలో రూ. 4,300 కోట్ల పనులు 12 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు కూడా పిలిచారు. ఇందుకోసం ఇన్‌క్యాప్ కాంట్రాక్టర్లకు అడ్వాన్సుల కింద రూ.40 కోట్లు చెల్లించింది. ఈ పథకం కోసం కండలేరు జలాశయం నుంచి 6.61 టీఎంసీ నీటిని కేటాయిస్తూ అప్పట్లో కిరణ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో నీటి కేటాయింపులు ఎలా ఉన్నా కృష్ణాజలాలు తమిళనాడుకు ఇవ్వాలన్న ఒప్పందం నేపథ్యంలో కండలేరులో నిత్యం నీళ్లు నిలువ ఉంటాయి. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే కిరణ్ సర్కార్ ఈ పథకానికి రూపకల్పన చేసింది. దీనిపై నెల్లూరు జిల్లాలో వ్యతిరేకత వచ్చినా తాగునీటి సమస్య పరిష్కారం కోసమంటూ అప్పట్లో కిరణకుమార్రెడ్డి ఆ జిల్లా నేతలకు నచ్చజెప్పి ఒప్పించారు. ఈ పథకం వల్ల వేలాది గ్రామాలకు తాగునీరు అందించే అవకాశమున్నా పథకాన్ని పూర్తి చేస్తే కమీషన్లు రాకపోగా గత ప్రభుత్వానికి పేరు వస్తుందన్న అక్కసుతో చంద్రబాబు ఈ పథకాన్ని రద్దు చేశారు. భవిష్యత్తులో నీటి కష్టాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
సీఎం పర్యటనలో స్వల్ప మార్పు
చిత్తూరు (అగ్రికల్చర్): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనలో స్వల్ప మార్పు చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఒక ప్రకటనలో తె లిపారు. ముందుగా నిర్ణయిం చిన ప్రకారం సీఎం కుప్పం బ్రాంచి కెనాల్ పనుల ఏరియల్ సర్వే, బంగారుపాళెంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా వీటిని రద్దుచేశారు. ముఖ్యమంత్రి తాజా పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం బెంగళూరు నుంచి శనివారం ఉదయం 11.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెలోని కోళ్లబైలు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.15 నుంచి 1.30 గంటల వరకు హంద్రీ-నీవా కాలువ పనులు పరిశీలిస్తారు. కాలువ పనులకు సంబంధించి ఏర్పాటు చేసి న ఫొటో ప్రదర్శనను తిలకిస్తారు. 1.30 నుంచి 2 గంటల వరకు రిజర్వు చేశారు. 2.30 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి చిత్తూరు మెసానికల్ గ్రౌండులోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 2.35 గంటలకు బయలుదేరి 2.45 గంటలకు నగరంలోని పుత్తూరు రోడ్డులో ఉన్న ఆర్ఎల్ కల్యాణమండపానికి వెళతారు. అక్కడ నీటి సంరక్షణ పనులపై అవగాహన సదస్సులో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.35 గంటలకు మెసానిక్ గ్రౌండులోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. 4.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.15 గంటలకు తిరుపతి ఎన్టీఆర్ మైదానం చేరుకుంటారు. 6.30 నుంచి 7.30 గంటల వరకు రిజర్వు చేశారు. 7.30 గంటలకు బయలుదేరి 8.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని 8.30 గంటలకు విజయవాడకు బయలుదేరి వెళతారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం చిత్తూరుకు విచ్చేస్తున్న సందర్భంగా అధికారులు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. రెండు రోజుల క్రితం చిత్తూరు కోర్టు ఆవరణలో సంభవించిన బాంబు పేలుడు సంఘటన దృష్ట్యా గట్టి భద్రతా ఏర్పాట్లను పోలీసులు చేపట్టారు. చిత్తూరులోని మెసానికల్ గ్రౌండుకు హెలికాప్టర్ ట్రయల్‌ను నిర్వహించారు. గ్రౌండు నుంచి కల్యాణ మండపం వరకు సీఎం కాన్వాయ్ ట్రయల్‌ను నిర్వహించారు. -
ఏ...నవంబర్‌కు హంద్రీ-నీవా పూర్తి చేస్తారు?
ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్న మదనపల్లె: ఏ...నవంబర్‌కు హంద్రీ-నీవా పూర్తవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మదనపల్లెలో ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్‌కే హంద్రీ-నీవాను పూర్తిచేసి రాయలసీమకు నీటిని సరఫరా చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు చిత్తశుద్ధితో పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. హద్రీ-నీవా కాలువ పనులకు సంబంధించి ఇంకా 16 లిఫ్ట్ పనులు, మదనపల్లె సమీపంలో టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. టన్నెల్ పనులు పూర్తికావడానికి మరో ఏడాదికిపైగా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, మొదటి నుంచి నవంబర్ నాటికి హంద్రీ-నీవా పూర్తి చేస్తామని చెబుతున్నారేగానీ, అది ఏ సంవత్సరం నవంబర్ నాటికో స్పష్టీకరించాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే 2019 నవంబర్ నాటికైనా నీళ్లు ఇస్తారా ? అనే సందేహం కలుగుతోందన్నారు. కాగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరుకాగా, వాటిలో ఒకటి రాజంపేటకు.. రెండవది మదనపల్లెకు మంజూరైనట్లు చెప్పారు. అయితే మదనపల్లెలో గత ఏడాది నుంచి ఈ విద్యాలయానికి స్థల సేకరణలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని తెలిపారు. పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు సమూచిత స్థానం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా మిథున్‌రెడ్డి చెప్పారు. అధికార పక్షం మైండ్ గేమ్ ఆడుతోందని, పార్టీ మారుతున్న వారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాబ్జాన్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి షమీం అస్లాం, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, నీరుగట్టు వెంకటరమణారెడ్డి, మహ్మద్ రఫీ, ముక్తియార్‌ఖాన్, సుగుణ, వేమనారాయణ, ఎంపీపీలు జరీనహైదర్, సుజన బాలకృష్ణారెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఎస్ఏ కరీముల్లా, కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు షరీఫ్, టెలికామ్ బోర్డు మెంబర్ దండాల రవిచంద్రారెడ్డి, నాయకులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో ‘అనంత’కు అన్యాయం
నిధుల సాధనకు పోరాటమే మార్గం చర్చావేదికలో వక్తల అభిప్రాయం అనంతపురం అర్బన్ : రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, బడ్జెట్ సాధనకు పోరాటం ఒక్కటే మార్గమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్జీఓ హోంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నల్లప్ప అధ్యక్షతన ఆదివారం ‘రాష్ట్ర బడ్జెట్- అనంతపురం జిల్లా’ అంశంపై జరిగిన చర్చావేదికలో ఎస్కేయూ ప్రొఫెసర్ బాబయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్.ఎం.బాషా, ప్రొఫెసర్ వెంకటనాయుడు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కేవీరమణ ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడారు. జిల్లాను అభివృద్ధి చేస్తామంటూ చేస్తున్న ప్రకటనలకు, బడ్జెట్ కేటాయింపునకు పొంతన లేదన్నారు. జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రజా ఉద్యమాలు నిర్మించి ఐక్య పోరాటాలు సాగించాల్సిన అవసరం ఉందన్నారు. రూ.1.35 లక్షల బడ్జెట్లో ప్రణాళిక వ్యయం రూ.49 కోట్లు మాత్రమే ఉందన్నారు. ఇంత తక్కువతో ఏ విధమైన అభివృద్ధి సాధ్యమన్నారు. రూ.2 వేల కోట్లు అవసరమున్న హంద్రీ-నీవాకు రూ.504 కోట్లు కేటాయిస్తే ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని, జిల్లాకు సాగునీరు ఎప్పటికి అందుతుందన్నారు. రూ.7 వేల కోట్లతో ఆమోదం పొందిన ‘ప్రాజెక్టు అనంత’ను ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. రాయలసీమ అభివృద్ధి, అనంతపురం జిల్లాకు నిధులు కేటాయింపు కోసం ఈ నెల 15న ఛలో అసెంబ్లీ చేపట్టామని రాంభూపాల్ చెప్పారు. అంశాల వారీగా డిమాండ్ల పత్రాన్ని సిద్ధం చేసి జిల్లా ప్రజాప్రతినిధులందరికీ ఉత్తరాల ద్వారా తెలుపుతామన్నారు. కార్యక్రమంలో జేవీవీ నాయకులు డాక్టర్ వీరభద్రయ్య, సామాజిక నాయకులు తరిమెల అమర్నాథ్రెడ్డి, చిల్లర వర్తకుల సంఘం నాయకులు గూడూరు వెంకటనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి, పాత్రికేయులు నాగరాజు, రవిచంద్ర, సామాజిక నాయకులు పసులూరి ఓబులేసు, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శ పెద్దిరెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీమ అభివృద్ధిపై బాబు వివక్ష
రాయలసీమ అభివృద్ధి వేదిక సబ్ కమిటీ కన్వీనర్ జి.ఓబులు అనంతపురం అర్బన్: అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల కేటాయింపులో రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివక్ష చూపుతూ అన్యాయం చేస్తున్నారని రాయలసీమ అభివృద్ధి వేదిక సబ్ కమిటీ కన్వీనర్ జి.ఓబులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం గణేనాయక్ భవన్లో సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.ఇంతియాజ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హంద్రీనీవాకు రూ.200 కోట్లు కేటాయించి, పట్టిసీమకు రూ.1,300 కోట్లు కేటాయించడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. చిత్తూరు మెడికల్ కళాశాలలో రాయలసీమ విద్యార్థులకు సీట్లు రాకుండా 120 జీవోని విడుదల చేయడం, చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు నీటిని సరఫరా చేసేందుకు పిలిచిన కండలేరు టెండర్ని రద్దు చేయడం వివక్ష చూపడమే అన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం అయితేనేమి, రూ.760 కోట్ల మన్నవరం ప్రాజెక్టుకు రూ.100 కోట్లు ఇవ్వడం చూస్తే రాయలసీమకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారనేది స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. ప్రస్తుత బడ్జెట్లో హంద్రీ-నీవా, గాలేరి-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించి రెండేళ్లలో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా ఈ నెల 15న ఉభయ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ‘చలో హైదరాబాద్’ చేపడుతున్నామన్నారు. -
హామీలను నీటీ మూటలే
{పాజెక్టులకు నామమాత్రంగా బడ్జెట్ ప్రతిపాదనలు గాలేరు, హంద్రీ-నీవాకు అంతంతమాత్రమే తెలుగుగంగకు రూ.1,300 కోట్లు ‘‘జిల్లాలో కరువులేకుండా చేస్తాం. ఈ ఏడాది జూన్ నాటికి హంద్రి-నీవా పనులు పూర్తిచేస్తాం. పడమటి మండలాల ప్రజల దాహార్తి తీర్చుతాం. తాగు, సాగునీటి సమస్యే లేకుండా చేస్తాం. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించాం. అవి వచ్చినవెంటనే నిధులు విడుదల చేస్తాం’’ అంటూ జిల్లా పర్యటనకొచ్చిన ప్రతిసారీ సీఎం చంద్రబాబు గుప్పిస్తున్న హామీలివి. కానీ ఆయన మాటలకు.. బడ్జెట్లోని ప్రతిపాదనలకు పొంతనలేకుండా పోతోంది. కంటితుడుపుగా నిధులు కేటాయించనున్న నేపథ్యంలో ఈ సారీ జిల్లా ప్రజలకు నీటి కష్టాలు తప్పేటట్లు లేవని నిపుణులు అభిప్రాయడుతున్నారు. తిరుపతి: జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు ఈ సారి బడ్జెట్లో ప్రతిపాదనలు నామమాత్రంగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి హంద్రీ-నీవా రెండో దశ పనులను పూర్తిచేసి పుంగనూరు, మదనపల్లె, కుప్పం ప్రాంతాలకు నీరు అందిస్తామన్న సీఎం చంద్రబాబు మాటలు నీటిమూటలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు నీరు రావాలంటే దాదాపు రూ.3,000 కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనాలు తయారు చేశారు. ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదనలే రూ.1,300 కోట్లు ఉంటే వాటిలో ఎంతమేరకు నిధులు కేటాయిస్తారో అనే చర్చ సాగుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,500 కోట్లు అవసరం కాగా కేవలం రూ.1,300కోట్ల మేర మాత్రమే ప్రతిపాదనలు పంపడం గమనార్హం. హంద్రి-నీవా..ఏమిటీ నీదోవ! హంద్రి-నీవా రెండోదశ పనుల్లో భాగంగా మొదట అనంతపురం జిల్లాలో ఉన్న 18 ప్యాకేజీ పనుల్ని పూర్తిచేయాలి. ఆ తర్వాతే జిల్లాకు నీరు వచ్చే మార్గం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రూ.1,000 కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలిచారు. చిత్తూరు జిల్లాలో దాదాపు రూ.300 కోట్ల పనులకు కొత్తగా రీ టెండర్లు జరిగాయి. దీంతోపాటు అనంతపురం జిల్లాలో మూడు రైల్వే క్రాసింగ్‌ల వద్ద పనులు మొదలు కాలేదు. కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్ పనులు ఆగిపోయాయి. చిత్రావతి, పాపాగ్ని నదులను దాటేందుకు ఆక్విడెట్ పనులు ఇంత వరకు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లో కేటాయించిన నిధులతో జిల్లాకు నీరు రావటం గగనమేనని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గాలేరు-నగరి.. ఈ సారీ లేదుమరి! గాలేరు-నగరి రెండోదశ పనులకు సంబంధించి జిల్లాలో 7 ప్యాకేజీలు ఉన్నాయి. వీటిని పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించటం లేదు. అటవీ మార్గంలో సొరంగం పనుల విషయమై ఇంకా స్పష్టత రాలేదు. టీబీఎం ద్వారానా, మ్యానువల్ పద్ధతిలో చేస్తారా అనే విషయమై ప్రభుత్వం ఇంకా తర్జన భర్జన పడుతోంది. గంగకు బెంగే! తెలుగుగంగ ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రధానంగా శ్రీకాళహస్తి, సుళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో పలుచోట్ల డిస్టిబ్యూటరీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ప్రతిపాదించిన బడ్జెట్ ప్రకారం పనులు పూర్తికావని ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వాటి పని అంతే వీటితో పాటు అరణియార్, కృష్ణాపురం రిజర్వాయర్, కాళంగి, ఎన్టీఆర్ జలాశయాలకు ఎంతమేర నిధులు కే టాయిస్తారో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈసా రీ సీఎం హామీలు నీటిమూటలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు చర్చించుకుంటున్నారు. -
ఇదేమి న్యాయం ?
అభివృద్ధి పనుల పేరుతో పేదల భూములపై కన్ను తమదాకా వస్తే మాత్రం వ్యతిరేకం తెలుగు తమ్ముళ్ల ద్వంద్వనీతి శాంతిపురం: ‘అభివృద్ధి చేయాలంటే భూమి కావాలి.. రైతులు సహకరిం చాలి.. పరిశ్రమలు, ప్రాజెక్టులు గాలిలో కట్టలేం. భూములు ఇవ్వబోమంటే ఎలా?’ టీడీపీ నాయకుల నోట తరచూ దొర్లుతున్న మాటలివి. గతంలో విమానాశ్రయం కోసం భూముల సేకరణ, ఇప్పు డు హంద్రీ-నీవా కాలువ సర్వేల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఈ మాటలను పదేపదే వల్లెవేశారు. రైతులు భూములు వదులుకుని సహకరించాలని ఎవరికి వారు బాకా ఊదారు. విమానాశ్రయం పేరుతో కడపల్లి పంచాయతీలో దాదాపు వెయ్యి కుటుంబాల భూములు లాక్కునేందుకు విఫలయుత్నం చేశారు. ఏకంగా కొంపలు కూల్చి, గ్రామాలను ఖాళీ చేయించటానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రాంత ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారు.ఇప్పటికీ ఇక్కడి రైతుల తీరును తప్పు పడుతూనే ఉన్నా రు. విమానాలు రాకుండా చేశారనే నింద లు మోపుతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇంకో పక్కన తమ భూముల్లో అరచేతి వెడల్పుతో భూమి పోతుందన్నా అరచి గగ్గోలు పెడుతున్నారు. రోడ్డుకు అడ్డు శాంతిపురం నుంచి వెంకటేపల్లి మీదుగా కేజీఎఫ్ వెళ్లే రోడ్డులో బోయనపల్లి క్రాసు నుంచి సిద్దామారు సమీపానికి లింక్ రోడ్డు ఉంది. మట్టి రోడ్డుగా ఉన్న దీన్ని తారు రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పంచాయతీ రాజ్‌శాఖ ద్వారా రూ.26 లక్షలు మంజూరు చేసింది. పను లు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకు ఒక పైపున ట్రెంచి కొట్టి వెడల్పు చేసే పనులు ప్రారంభించారు. కానీ మరో వైపున పనులు ప్రారంభించగానే అక్కడ భూములు ఉన్న ప్రముఖ తెలుగుదేశం నాయుకుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తవు భూముల్లో వేలు పెట్టకుండా అవతలే రోడ్డు పనులు చేసుకోవాలని హుకుం జారీ చేశారు. ఎలాగోలా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ భావించినా భూములు కోల్పోయిన వారిలో కొందరు ఎదురు తిరిగారు. తవు భూముల పరిధిలో రోడ్డు వెడల్పు కోసం తవ్విన ట్రెంచ్‌లను పూడ్చివేశారు. దీంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయూరుు. పరాయి రైతుల భూములను అభివృద్ధికి ఇవ్వాలని నీతులు చెబుతున్న బడా నాయకుడు ఇప్పుడు ఇంట్లో వాళ్లకు అవే నీతులు చెప్పాలని స్థానికు లు తలంటుతున్నారు. ఈ వ్యవహారంపై పీఆర్ ఏఈ హరినాథ్ వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని చెప్పారు. హంద్రీ-నీవాకూ అడ్డే శ్యాటిలైట్ సర్వే ఆధారంగా పొలాల్లో అడ్డగోలుగా కాలువ తవ్వకాలకు రాళ్లు నాటినా, తమకు కనీస సమాచారం లేకున్నా చాలా మంది రైతులు కిమ్మనకుండా ఉన్నారు. వీరిలో సర్వం కోల్పోయే వారు, ఉన్న భూముల మధ్య నుంచి కాలువ పోతే ఇరువైపులా అడుగుల వెడల్పుతో సాగు భూమి మిగిలే వారు ఉన్నారు. కానీ తమ ప్రాంతానికి నీళ్లు రావాలన్న ఆశతో కన్నీటిని గుండెల్లో దాచుకున్నారు. అయితే సిద్దామారు వద్ద టీడీపీ ప్రజాప్రతినిధి కుటుంబం మాత్రం తమ భూముల్లో కాలువకు ససేమిరా అంటోంది. సర్వే బృందం రాళ్లు నాటకుండా అడ్డుకుంటోంది. అధికారులు, నాయకులు రెండు రోజుల పాటు చేసిన దౌత్యాలన్నీ విఫలమయ్యాయి. సోమవారం తాను వచ్చి చూస్తానని సదరు ప్రజాప్రతినిధి చెప్పటంతో ఆయన కోసం ఎదరుచూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరూ భూములు ఇచ్చేయండని అంటున్న అధికారపార్టీ నాయకులు తమ భూముల్లో నామ మాత్రంగా పోయినా సహించలేక పోతున్నారు. ఈ తీరును సామాన్యులతో పాటు అధికార పార్టీ శ్రేణులు కూడా తప్పుబడుతున్నారు. నిత్యం సీఎం నామజపం చేస్తూ బతుకుతున్న నాయకులు ముందుగా తమ భూములు వదులుకుని మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నారు. -
హంద్రీ-నీవా నీటి కోసం ఉద్యమిస్తాం
‘రైతుల జల జాగరణ’లో వక్తల పిలుపు శివరాత్రిని తలపించిన కార్యక్రమం పెద్దసంఖ్యలో రైతుల హాజరు అనంతపురం/ఉరవకొండ : ‘కృష్ణా జలాలు హంద్రీ-నీవా కాలువ ద్వారా జీడిపల్లి రిజర్వాయర్‌కు చేరుతున్నాయి. మన కళ్ల ముందే కాలువలో పారుతున్నా.. పొలాలకు మాత్రం రావడం లేదు. పంటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇలానే చేతులు కట్టుకుని కూర్చుంటే లాభం లేదు. ప్రభుత్వం మెడలు వంచైనా హంద్రీ-నీవా నీళ్లు సాధించుకోవాల్సిందే’నని వక్తలు పిలుపునిచ్చారు. ఉరవకొండ నియోజకవర్గ పొలాలకు ఈ ఏడాదైనా హంద్రీ-నీవా నీరివ్వాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి నాయకత్వంలో హంద్రీ-నీవా ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో వజ్రకరూరు మండలం పొట్టిపాడు వద్ద శనివారం సాయంత్రం ‘రైతుల జల జాగరణ’కు శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది. నియోజకవర్గవ్యాప్తంగా వేలాదిమంది రైతులు తరలివచ్చారు. రాత్రంతా శివరాత్రి పండుగలా జాగరణ చేశారు. వామపక్ష పార్టీల నేతలతో పాటు పలువురు తరలివచ్చి మద్దతు తెలిపారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు నీరివ్వకపోతే ప్రభుత్వానికి పాడె కడతామని హెచ్చరించారు. 80 ఎకరాలకు నీరివ్వాలి హంద్రీ-నీవా డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)లో ఉన్నట్లుగా ఉరవకొండ నియోజకర్గంలో పొలాలకు నీరిచ్చే అన్ని డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాలువలు పూర్తి చేయాలి. ఈ ఏడాది 80 వేల ఎకరాలకు నీరివ్వాలి. లేదంటే కడుపులు మండుతున్న రైతాంగంతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. పార్టీలకతీతంగా అందర్నీ కలుపుకుని ఉద్యమిస్తాం. - విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యే ప్రజల్ని నిలువునా మోసగిస్తున్నారు జిల్లా ప్రజలు టీడీపీని నమ్మి ఓట్లువేశారు. 12మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలను గెలిపించారు. ఇలాంటి ప్రజలను ముఖ్యమంత్రి నిలువునా మోసం చేస్తున్నారు. హంద్రీ-నీవా మొదటిదశ పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. వైఎస్ హయాంలో 95 శాతం పనులు పూర్తయ్యాయి. తక్కిన 5 శాతం పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు గాలిమాటలు చెబుతున్నారు. తీరుమార్చుకోకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. - అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ర్ట ప్రధానకార్యదర్శి హంద్రీ-నీవా కోసం ఐక్య పోరాటం రాయలసీమ ప్రాంత వాసుల కష్టాలు తీర్చడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హంద్రీ-నీవాకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన హయాంలో రూ. 6 వేలు కోట్లు కేటాయించారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. చంద్రబాబు పాదయాత్ర సమయంలో హంద్రీ-నీవాను పూర్తి చేసి సాగు,తాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. బడ్జెట్లో మాత్రం కేవలం రూ.100 కోట్లు విదిల్చారు. ఈ నిధులు కరెంటు బిల్లులు, కాంట్రాక్టర్ల బకాయిలకే సరిపోయాయి. - అత్తార్ చాంద్‌బాషా, కదిరి ఎమ్మెల్యే అబద్ధాల కోరు చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు గద్దెనెక్కారు. ఇప్పుడు జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీ ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు అందిస్తామంటూ ప్రభుత్వం చెబుతోంది.అయితే నీళ్లు ఎలా ఇస్తారో ప్రజలకు వివరించాలి. టీడీపీ హయాంలో 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఆ రైతుల కుటుంబాలను పరామర్శించలేదు. - కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నీటిని తరలించుకుపోతే ఊరుకోం హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని ఆయకట్టుకు అందాల్సిన నీటిని తన సొంత నియోజకవర్గానికి చంద్రబాబు తరలించుకుపోతే చూస్తూ ఊరుకోం. ప్రభుత్వం రాజకీయాలకు పోకుండా జిల్లా కరువు పరిస్థితులను దృిష్టిలో ఉంచుకుని ఆయకట్టుకు నీరివ్వాలి. - జగీదష్, సీపీఐ జిల్లా కార్యదర్శి సీమపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు పెండింగ్ పనులు పూర్తి చేస్తే హంద్రీ-నీవా ద్వారా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కానీ చంద్రబాబుకు రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెచ్చి హంద్రీ-నీవాకు నిధులు సాధించాలి. - గురునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లోటు బడ్జెట్ అంటూ దుబారా రాష్ర్టం లోటు బడ్జెట్ లో ఉందంటూ పదేపదే ప్రజలను మోసగిస్తున్నారు. శంకుస్థాపనలు, విదేశీ పర్యనలకు కోట్లాది రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత 13 కిలోమీటర్లు మాత్రమే హంద్రీ-నీవా కాలువను తవ్వించారు. - రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి బాబు మాటలు నీటిమూటలే చంద్రబాబు హామీలన్నీ నీటిమూటలే. రైతు, డ్వాక్రా రుణమాఫీతో పాటు ఇంటికోఉద్యోగం లాంటి హామీలు నెరవేర్చలేదు. సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక నిధులు కేటాయించిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది. - పెద్దన్న, సీపీఐ(ఎంల్) నేత -
మూలపల్లికి హంద్రీ-నీవా నీరు
కల్యాణిడ్యామ్కు గాలేరు-నగరి నారావారిపల్లిలో పశువుల శాల ముఖ్యమంత్రి చంద్రబాబు నారావారిపల్లి(తిరుపతి రూరల్): చంద్రగిరి మండలం మూలపల్లిలోని రిజర్వాయర్‌కు హంద్రీ-నీవా నీరు, కల్యాణి డ్యామ్‌కు గాలేరు-నగరి నీటిని తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం నారావారిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రగిరి మండలాన్ని సస్యశ్యామలంగా మార్చుతామన్నారు. భూగర్భజలాలను 6 మీటర్లకు తీసుకురావడమే ధ్యేయమన్నారు. అందుకోసం రిజర్వాయర్లను నీటితో నింపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తన కోడలు బ్రాహ్మణి దత్తత తీసుకున్న నారావారిపల్లిలో త్వరలో యనిమల్ క్యాటిల్ ఫామ్ (పశువుల శాల) ను ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఇంటికీ గ్యాస్, రేషన్‌కార్డులు, ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. జిల్లాలో పంట పొలాల్లో లక్ష పంట కుంటలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. కలెక్టర్‌కు అభినందన.. గత రెండు నెలల్లో పడిన భారీ వర్షాల సమయంలో ఒక్క చెరువును కూడా తెగిపోకుండా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ చేపట్టారని ముఖ్యమంత్రి అభినందించారు. ఆయన చేపట్టిన చర్యల వల్లే జిల్లాలో 33 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 9.6 మీటర్లకు పెరిగాయని చెప్పారు. -
మంత్రిగారూ...మీ హామీలకు ఏడాది
- హంద్రీ-నీవాకు నీరు లేదు... ఒక్కరికీ డ్రిప్, స్ప్రింక్లర్లు ఇవ్వలేదు - ‘అనంత’, ధర్మవరంలో భూగర్భడ్రైనేజీ సంగతేంటి? - రూ.150కోట్లతో స్థాపిస్తామన్న ఎయిమ్స్ ఎక్కడ? - మాటలకే పరిమితం... ఆచరణలో కనిపించని చిత్తశుద్ధి సాక్షిప్రతినిధి, అనంతపురం: ఏడాది పూర్తయింది. నేడు మళ్లీ జాతీయజెండా నీడన మంత్రి సునీత ప్రసంగించనున్నారు. గతేడాది ఆమె చెప్పిన హామీల్లో నేటికీ ఏ ఒక్కటీ నెరవేరలేదు. హంద్రీ-నీవా ద్వారా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీరందించలేదు. జిల్లాలో ఏడాదిగా ఏ ఒక్క రైతుకు 90శాతం సబ్సిడీతో డ్రిప్ మంజూరు చేయలేదు. ‘ప్రాజెక్టుఅనంత’ ను టీడీపీ ప్రభుత్వం పూర్తిగా అటకెక్కించింది. చేసిన బాసలేవీ?: ‘అనంత’ రైతును నాలుగేళ్లుగా కరువు వేధిస్తోంది. ఈ క్రమంలో ‘అనంత’ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. జిల్లా పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి న్యాయం జరిగేలా చూడాల్సిన గురుతర బాధ్యత ఇద్దరు మంత్రులపై ఉంది. అయితే ఏడాదిగా వీరు జిల్లాకే ఏ ఒక్క మేలు చేయలేకపోయారు. గతేడాది పంద్రాగస్టు వేడుకల నాడు మంత్రి చెప్పిన మాటలు నెరవేరితే కష్టాల్లోని ‘అనంత’ కాసింత కుదుటపడుతుందని అంతా భావించారు. కానీ ఆ హామీల్లో ఏఒక్కటి నెరవేరలేదు. ఇవీ గతేడాది పంద్రాగస్టున చేసిన ప్రకటనల్లో ముఖ్యమైనవి: - వందశాతం కరువు నివాణకు చర్యలు - రూ.150కోట్లతో ఎయిమ్స్ అనుబంధ కేంద్రాన్ని నెలకొల్పుతాం - ‘అనంత’లో రూ.395కోట్లతో...ధర్మవరంలో రూ.305కోట్లతో భూగర్భడ్రైనేజీ ఏర్పాటు సూపర్‌స్పెషాలిటీ మంజూరు జిల్లాను ఐటీహబ్‌గా తీర్చిదిద్దుతాంవీటితో పాటు చాలా అంశాలను ప్రస్తావించారు. అయితే కరువు నివారణకు ఇప్పటిదాకా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా 2013కు సంబంధించి రూ.643కోట్ల ఇన్‌ఫుట్‌సబ్సిడీ రావాల్సి ఉంటే ఇస్తామని చెప్పి... తీరా పాత బకాయిలు ఇవ్వలేమని జిల్లా రైతులకు అన్యాయం చేశారు. హంద్రీ-నీవాకు ఈ ఖరీఫ్‌కే నీరిస్తామని గతేడాది నుంచి చెబుతున్నా ఇప్పటి వరకూ డిస్ట్రిబ్యూటరీపై దృష్టి సారించలేదు. కుప్పంకు నీరు తీసుకెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయొద్దని (జోవో నెంబర్: 22) సీఎం చంద్రబాబు ఆదేశించారు. కనీసం దీనిపై కూడా 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు నోరెత్తలేదు. జిల్లాలో 4లక్షలమందికిపైగా కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వలస వెళ్లారు. ప్రభుత్వం మాత్రం ఉపాధి కల్పించి వలసలను నివారించలేకపోతోంది. ఇక రుణమాఫీ దెబ్బతో ఇన్సురెన్స్ కోల్పోయి, వడ్డీ భారం పడి తమకు రావాల్సిన వందలకోట్లు రూపాయలను ‘అనంత’ రైతులు కోల్పోయారు. ఇలా ప్రభుత్వ చర్యలతో ‘అనంత’ అభివృద్ధి 20ఏళ్లు వెనక్కి వెళ్లిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈక్రమంలో నేడు ప్రసంగించనున్న మంత్రి మళ్లీ పాత హామీలే వల్లె వే స్తారా? లేదా? చిత్తశుద్ధితో వాస్తవ పరిస్థితులను వివరిస్తారో వేచి చూడాలి. -
మా నీళ్లు మాకే!
- ఎవరెవరో నీళ్లు తీసుకు పోతుంటే చూస్తూ ఊరుకోం - ప్రభుత్వానికి ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరిక - ‘అనంత’పై చంద్రబాబు వక్రబుద్ధి - మాజీ ఎంపీ అనంత - ఈ ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీరివ్వకపోతే తీవ్ర పరిణామాలు-గురునాథ - నీళ్లివ్వకపోతే చలోఅసెంబ్లీ చేపట్టి భారీ ధర్నా చేస్తాం- సీపీఐ జగదీశ్ - రైతుసదస్సులో ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టిన ‘అనంత’ నేతలు సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘‘హంద్రీ-నీవా కోసం రైతులు పొలాలను త్యాగం చేశారు. ఆర్థికంగా నష్టపోయారు. ఇప్పుడు ప్రాజెక్టు పూర్తయి కళ్లెదుట నీళ్లుపోతున్నా ఆయకట్టుకు ప్రభుత్వం నీరివ్వడం లేదు. కుప్పానికి తీసుకెళ్లేదాకా డిస్ట్రిబ్యూటరీ పనులు చేయొద్దని అధికారులను ఆదేశించారు. ఎవరెవరో నీళ్లు తీసుకుపోతుంటే చూస్తే ఊరుకునేది లేదు. మా నీళ్లు మాకు ఇవ్వాల్సిందే! లేదంటే ప్రధాన కాలువను తెంచి ఆయకట్టు పారించుకుంటాం’’ అని ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హంద్రీ-నీవా మొదటి విడత ఆయకట్టుకు నీరివ్వాలనే డిమాండ్‌తో విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన ఉరవకొండలోనీ వీరశైవ కళ్యాణమండపంలో సోమవారం సదస్సు నిర్వహించారు. సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్‌తో పాటు సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. ఆయకట్టుకు నీరు వచ్చేంత వరకూ సమష్టిగా పోరాడతామని చేతులు కలిపి ఐక్యత చాటారు. తర్వాత విశ్వ మాట్లాడారు. ‘‘అనంత’ వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. స్థిరమైన ఆయకట్టు ఉన్న హెచ్చెల్సీకి 32.5 టీఎంసీలు రావాల్సి ఉంటే 22 టీఎంసీలే వస్తున్నాయి. బీటీప్రాజెక్టుకు 4టీఎంసీలకు గాను 1.5 టీఎంసీలు...పీఏబీఆర్‌కు 10టీఎంసీలకు 4.5టీఎంసీలు మాత్రమే వస్తున్నాయి. దీంతో ఆయకట్టు గణనీయంగా తగ్గింది. ఈక్రమంలో ‘అనంత’కు జీవనాడి అయిన హంద్రీ-నీవా మొదటి విడత పనులు 90శాతం పూర్తయ్యాయి. చంద్రబాబు సీఎం కాకముందే 2సార్లు జీడిపల్లికి నీళ్లొచ్చాయి. కేవలం డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేస్తే 1.18లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో ఉరవకొండ నియోజకవర్గంలో 80వేల ఎకరాలకు నీరందుతుంది. కానీ కళ్లెదుట నీళ్లుపోతున్నా ప్రాజెక్టు కోసం భూమలు త్యాగం చేసిన రైతుల పొలాలకు నీళ్లందడం లేదు. కేవలం రూ.200కోట్లు ఖర్చు చేస్తే ఈ ఖరీఫ్‌కే ఆయకట్టుకు నీరిచ్చే అవకాశం ఉంది. నెలకోసారి ప్రాజెక్టుపై చంద్రబాబు రివ్యూలు చేస్తున్నారు. నిద్ర చేస్తున్నారు. వైఎస్ ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారు. ఎక్కడా నిద్ర చేయలేదు. రైతులకు నీరివ్వాలని చిత్తశుద్ధి ఉంటే చాలు.. నిద్రపోవడం దేనికీ. ఇటీవల జీడిపల్లి సమీక్షలో ‘నీళ్లివ్వమని అడిగితే మా ప్రణాళికలు మాకున్నాయి. మీతో మాట్లాడాలంటే సభ్యత అడ్డొస్తోంది’ అని సీఎం అన్నారు. నీళ్ల అడగడం తప్పా? ఎమ్మెల్యేతో ఓ ముఖ్యమంత్రి ఇలాగానే మాట్లాడేది? డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీరిస్తామంటున్నారు. ఈ ఏడాది 20 టీఎంసీలు వస్తాయంటున్నారు. నీళ్లు ఇవ్వకపోతే జీడిపల్లి పంప్‌హస్‌ను ముట్టడిస్తాం. ధర్మపురి వద్ద నిద్ర చేస్తాం. ఆయకట్టు కమిటీలు వేసి ఉద్యమిస్తాం’’ అని విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆ 13 టీఎంసీల నీళ్లు ఏమయ్యాయి? ‘గతేడాది హంద్రీ-నీవా ద్వారా 16.9 టీఎంసీల నీరు వచ్చాయి. ఇందులో 13 టీఎంసీలు జిల్లాకు చేరాయి. వీటిని ఏం చేశారు? లెక్కలు చెప్పండి’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేశారు. ‘హంద్రీ-నీవాను హెచ్చెల్సీకి అనుబంధ కాలువలా మార్చేలా ప్రభుత్వం వ్యవహిరిస్తోంది. చంద్రబాబు అదృష్టవంతుడు ప్రాజెక్టు పూర్తిగా నిర్మించాం. 5 ఏళ్లలో 5వేలకోట్లకుపైగా ఖర్చుచేశాం. 2012 ఫిబ్రవరి 18న నీళ్లు లిప్ట్ చేశాం. కేవలం డిస్ట్రిబ్యూటరీలు చేస్తే ఆయకట్టుకు నీళ్లివ్వొచ్చు. కానీ చంద్రబాబు రూపాయి కూడా ఖర్చుపెట్టడం లేదు. ‘అనంత’పై వక్రబుద్ధిని చూపిస్తున్నారు. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన టీడీపీ ప్రజాప్రతినిధులు కూడా ఇంత అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉండటం ఎందుకు సహ ంచాలి? పట్టిసీమ ద్వారా సీమకు నీళ్లిస్తాననడం బూటకం. పోతిరెడ్డిపాడు హెడ్రెడ్యులేటర్ను 44వేల క్యూసెక్కులకు పెంచేముందు కేసీకెనాల్ వాటాలో పది టీఎంసీలను ‘అనంత’కు మళ్లిస్తూ వైఎస్ జీవోజారీ చేశారు. ఇప్పుడు పట్టిసీమద్వారా రాయలసీమకు నీరిస్తామని ఎందుకు జీవో ఇవ్వరు? ఆగష్టు 15న పట్టిసీమకు నీళ్లిస్తామంటున్నారు. ఇప్పుడు సాగర్‌కు నీళ్లవసరం లేదు. కాబట్టి శ్రీశైలం నుంచి వెంటనే సీమకు నీళ్లివ్వాలి.’’ అని అన ంత డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల వేళ హంద్రీ-నీవాను పూర్తిచేస్తామని మాటలు చెప్పడం మినహా తట్టెడు మట్టిని కూడా ఎత్తలేదని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అన్నారు. వైఎస్ పూర్తిచేసిన ప్రాజెక్టు ద్వారా ఆయకట్టుకు నీరివ్వలేని చేతకాని ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ఎమ్మెల్యేలతో సంస్కారంగా మాట్లాడలేని సీఎం రైతులకు ఏం మేలు చేస్తారో ఆలోచించాలన్నారు. కుప్పంకు నీళ్లిచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే డిస్ట్రిబ్యూటరీ పూర్తి చేసి ముందు ‘అనంత’ ఆయకట్టుకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. పుణ్యమంతా ఏమైంది ‘బాబూ’: గోదావరి పుష్కరాల పేరుతో 12రోజులు చంద్రబాబు నదిలో మునిగారు. కానీ ఆయన పుణ్యం అంతా ఎక్కడకి పోయిందో అర్థం కాలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ అన్నారు. ఇంతటి కరువు గత 18ఏళ్లలో ఎప్పుడూ లేదన్నారు. బతికేమార్గం లేక రైతులు వలసపోతున్నారని, ఆత్మహత్యలకూ తెగిస్తున్నారన్నారు. ఈ స్థితిలో చంద్రబాబు డిస్ట్రిబ్యూటరీ పనులు ఆపేయాలని ఆదేశించడం శోచనీయమన్నారు. 12మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించిన జిల్లాకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. రూ.200కోట్లు ఖర్చు చేస్తే పిల్లకాలువల నిర్మాణం పూర్తవుతుందని, ఇందులోనూ సీఎం వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. వానల్లేక అల్లాడుంటే చీఫ్‌విప్ కాాల్వ శ్రీనివాసులు హరిత విప్లవం అంటూ స్పీకర్ కోడెలతో మొక్కలు నాటిస్తున్నారని, ఇప్పుడు జల విప్లవం కావాలన్నారు. ఒక్కో మొక్కకు వంద రూపాయల చొప్పున డబ్బు వస్తుందని, ఇందులో అవినీతికి అవకాశం ఉంది కాబట్టే ఆ కార్యక్రమానికి పూనుకున్నాని ఆరోపించారు. చంద్రబాబు చర్యలతో ఇనుపుట్ సబ్సిడి, ఇన్సూరెన్స్ కోల్పోయామని ఈ పాపం చంద్రబాబుదే అన్నారు. హంద్రీ-నీవా ద్వారా ఆయకట్టుకు నీళ్లివ్వడంతో పాటు మంత్రాలయం వద్ద ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మించి ‘సీమ’కు నీరివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు శివన్న, సీపీఐ నేతలు మల్లికార్జున, రామకృష్ణ, వన్నూరు, వైఎస్సార్సీపీ నేతలు వీరన్న, కొర్రపాటి హుసేన్‌పీరా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సీమకు తాగు, సాగునీరే జీవన్మరణ సమస్య
హంద్రీ-నీవా, గాలేరు-నగరి ద్వారా సస్యశ్యామలం చేస్తాం * ఇంత చేస్తున్నా ప్రజలు నా గురించి చర్చించుకోవడం లేదు * ‘అనంత’ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘రాయలసీమకు తాగు, సాగునీరే జీవన్మరణ సమస్య. హంద్రీ-నీవా ద్వారా కర్నూలు, అనంతపురం జిల్లాలకు 25 టీఎంసీలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు మరో 30 టీఎంసీల నీటిని ఇస్తాం. దీంతో పాటు గాలేరు-నగరిని, ఎన్నికలలోపే పోలవరం ప్రాజెక్టునూ పూర్తి చేస్తాం. ఆలోపు సీమ సాగునీటి అవసరాలు తీర్చేందుకే పట్టిసీమను చేపట్టాం. హంద్రీ-నీవా ద్వారా పీఏబీఆర్, మిడ్‌పెన్నార్ డ్యాం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీళ్లిస్తాం. వీటన్నిటి ద్వారా రాయలసీమలోని నాలుగు జిల్లాలకు సాగునీటిని అందించి సస్యశ్యామలం చేస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హంద్రీ-నీవా పనుల పరిశీలనకు ఆయన శుక్రవారం అనంతపురానికి విచ్చేశారు. జీడిపల్లి రిజర్వాయర్‌ను పరిశీలించారు. రిజర్వాయర్‌తో పాటు హంద్రీ-నీవా కాలువ పనులను హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తర్వాత ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పురోగతిపై నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నన్ను గుర్తుంచుకోవడం లేదు: ‘అమెరికాలో హెల్త్ఇన్సూరెన్స్ ప్రకటిస్తే బాగుందా? లేదా? అని ఏడాది పాటు ప్రజలు చర్చించుకుంటారు. నేను రూ.22కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు రుణమాఫీ చేశా! దేశంలో ఎవ్వరూ చేయలేదు. ఈ అంశంలో సవాల్ విసురుతున్నా! పింఛను మొత్తాన్ని పెంచా! డ్వాక్రా మహిళలకు పదివేలు పెట్టుబడి రుణం ఇస్తున్నా! మొదటి విడతగా రూ.3 వేలు ఇచ్చా! అయినా పథకాల గురించి, నా గురించి ఎవ్వరూ చర్చించడం లేదు. మీరు ఆలోచించండి తమ్మూళ్లూ!’ అని తనను గుర్తించాలని పరోక్షంగా చంద్రబాబు వేడుకున్నారు. చంద్రబాబుతో జపాన్ బృందం భేటీ సాక్షి, విజయవాడ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలోని బస్సులో జపాన్ బృందంతో భేటీ అయ్యారు. జైకా, జేబీఐసీ కంపెనీలకు చెందిన ఐదుగురు ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి సీఎంతో చర్చించారు. 4 వేల మెగావాట్ల సూపర్ పవర్ థర్మల్ క్రిటికల్ యూనిట్ ఏర్పాటు గురించి ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ‘ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది, పెట్టుబడి ఎంత’ తదితర అంశాలను వారు సీఎంకు వివరించారు. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ మేనేజ్మెంట్కు సంబంధించిన యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం రెండు కంపెనీల ప్రతినిధులను కోరారు. విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులో పెట్టుబడుల గురించి జైకా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం పోలవరం కుడికాలువ నిర్మాణంలో భూములు కోల్పోతున్న పామాయిల్ రైతులు సీఎంను కలసి తమ సమస్యలను వివరించారు. -
కుప్పానికి కన్నీళ్లే ?
ఏడాదిలోగా హంద్రీ-నీవా నీళ్లిస్తానన్న బాబు బడ్జెట్లో మాత్రం మొక్కుబడి కేటాయింపులు అవసరం *1194 కోట్లు, కేటాయింపులు * 212 కోట్లే గాలేరు - నగరి, తెలుగుగంగదీ అదే పరిస్థితి బాబు వంచనపై విమర్శల వెల్లువ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన కుదరడం లేదు. ఎన్నికల ముందు, ఆ తరువాత చంద్రబాబు కుప్పలు తెప్పలుగా హామీలు గుప్పించారు. రాష్ట్ర పరిధిలో వందలాది హామీలు ఇవ్వగా, సొంత జిల్లాకు సంబంధించి దాదాపు 30కిపైగా హామీలు ఇచ్చారు. జిల్లాలో కరువు నేపథ్యంలో ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరింది. హంద్రీ-నీవా కాలువను పూర్తిచేసి జిల్లా నీటి సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి పలు దఫాలు హామీ ఇచ్చారు. కానీ తొమ్మిది నెలల పాలన కాలంలో బాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. తాజా బడ్జెట్లోనైనా నిధులు కేటాయించి హామీలు నెరవేర్చుతారనుకుంటే అదీ లేదు. బడ్జెట్ చూశాక ఆ ఆశ ఆవిరై పోయింది. 2015-16కు గాను గురువారం ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరే పరిస్థితి కానరావడంలేదు. రాష్ట్ర ప్రజలనే కాదు సొంత జిల్లా ప్రజలను సైతం చంద్రబాబు వంచించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
నీరుండీ వాడుకోలేని దుస్థితి!
ప్రభుత్వం చొరవ చూపితే మెట్ట ప్రాంతానికి కరువు నుంచి విముక్తి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష వైఎస్ హయాంలోనే గాలేరు-నగరి సుజల స్రవంతికి రూ.4,200 కోట్లు,హంద్రీ-నీవా సుజల స్రవంతికి రూ.6,700 కోట్ల వ్యయం రూ.1,900 కోట్లు, రూ.1,700 కోట్లు వెచ్చిస్తే ఈ రెండూ పూర్తి.. ఆరు జిల్లాలకు మేలని వెల్లడి సాక్షి ప్రతినిధి, కడప: ‘కృష్ణా, గోదావరి నదులు మూడు నెలలు ఉప్పొంగి ప్రవహిస్తాయి.. ఆ వరద నీటిని సద్వినియోగం చేసుకుంటే మెట్ట ప్రాంతంలో తిష్టవేసే కరువుకు విముక్తి కల్గించవచ్చు.. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తిచేస్తే ఆరు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి.. నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా సకాలంలో స్పందించలేకపోతున్నాం.. సగానికి సగం నీటిలాస్ ఉంటున్నా అరికట్టలేకున్నాం.. తక్షణమే స్పందించండి.. ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు వివరించండి.. ప్రజాపక్షంగా అందరం ప్రాజెక్టుల సాధనకు కృషి చేద్దాం..’ అని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప స్టేట్ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఆయన జిల్లా ప్రాజెక్టులపై ఇరిగేషన్,ఆర్డబ్ల్యూఎస్, పీఆర్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా ప్రభుత్వం ఎంత ఖర్చు పెడితే మనుగడలోకి రాగలవనే వివరాలు తెలుసుకున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి గండికోట ప్రాజెక్టు వరకు నీరు వచ్చేందుకు ఉన్న అడ్డంకుల గురించి అధికారులు వివరించారు. వరదలను దృష్టిలో ఉంచుకుని మూడు నెలల్లో లభించనున్న నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సత్వర చర్యలపై ఇప్పటి నుంచే ఒత్తిడి పెంచాలని వైఎస్ జగన్ సూచించారు. అధికారులుగా మీ స్థాయిలో మీరు కృషిచేయండి, ప్రభుత్వంపై మా పోరాటం ద్వారా ఒత్తిడి తెస్తాం.. అని ఆయన చెప్పారు. ఆ ప్రాజెక్టులు వరప్రసాదం మెట్టప్రాంతాలకు గాలేరి-నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్), హంద్రీ-నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) పథకాలు వరప్రసాదమని, వాటిని సత్వరమే పూర్తిచేస్తే ఆరు జిల్లాల్లో మెట్టభూములు సస్యశ్యామలం అవుతాయని జగన్మోహన్రెడ్డి తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ పరిధిలో రూ.6,700 కోట్లు, జీఎన్ఎస్ఎస్ పరిధిలో రూ.4200 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఇంకా హెచ్ఎన్ఎస్ఎస్ పరిధిలో రూ.1,700 కోట్లు, జీఎన్ఎస్ఎస్ పరిధిలో రూ.1,900 కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలో రూ.3,600 కోట్లు ఖర్చు చేయగలిగితే ఆరు జిల్లాల్లో సాగునీటికి, తాగునీటికి ఇబ్బంది ఉండదని వివరించారు. ఆ ప్రాజెక్టుల ద్వారా 3.87 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. పోతిరెడ్డిపాడు-బనకచర్ల, బనకచర్ల- గోరుకల్లు, గోరుకల్లు-అవుకు, అవుకు-గండికోట రిజర్వాయర్ల వరకు మధ్యలో అసంపూర్తి పనులు పూర్తి చేయగలిగితే సునాయాసంగా 1.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు లభిస్తుందని చెప్పారు. రూ.185 కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లు మనుగడలోకి వస్తాయని అధికారులు తెలిపారు. రూ.150 కోట్లు వెచ్చిస్తే 26 టీఎంసీల నీరు నిల్వ గండికోట ప్రాజెక్టు పూర్తయింది.. పునరావా సం, అభివృద్ధి (ఆర్అండ్ఆర్) ప్యాకేజీ పెం డింగ్‌లో ఉంది. కేవలం రూ.150 కోట్లు కేటాయిస్తే ఏకకాలంలో 26 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆమాత్రం చొరవ కూడా చూపకపోవడం విచారకరం.. అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ సెటిల్ కాకపోవడం వల్ల ముంపు గ్రామాల ప్రజలు ఖాళీ చేయలేదన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. బ్రహ్మంసాగర్ పరిధిలో మరో రూ.54 కోట్లు కేటాయిస్తే లైనింగ్ పనులు కూడా పూర్తవుతాయని అధికారులు వివరించారు. నీరున్నా తెచ్చుకోవడంలో విఫలం సకాలంలో స్పందించి వృథాగా పోయే కృష్ణా, గోదావరి జలాలను తెచ్చుకోగలిగితే జిల్లాలో బ్రహ్మంసాగర్, గండికోట రిజర్వాయర్లలో నీరు నిల్వ చేసుకోవచ్చు.. తద్వారా భూగర్భజలాలు పెరిగి తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది.. అని జగన్ చెప్పారు. పెపైచ్చు డ్రా చేసిన నీటిలో 50 శాతం లాస్ అవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. చిత్రావతి 10 టీఎంసీల నీటికిగాను 4 టీఎంసీల నీరు డ్రా చేస్తే కేవలం 2 టీఎంసీలే ప్రాజెక్టుకు చేరిందని చెప్పారు. ఆ నీటి నుంచే కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పులివెందుల మున్సిపాలిటీలకు తాగునీరు ఇవ్వాల్సి ఉందన్నారు. వేసవి ప్రారంభమైనా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీరందలేదని తెలిపారు. బ్రహ్మం సాగర్‌కు 6.7 టీఎంసీల నీరు డ్రా చేస్తే కేవలం 4 టీఎంసీలే రిజర్వాయర్‌కు చేరిందన్నారు. మెయిన్ కెనాల్స్ ఇంతటి అధ్వానంగా ఉంటే పూర్తిస్థాయి నీరు ఎలా డ్రా చేయగలరని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజాపోరాటం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో మైనర్, మీడియం ఇరిగేషన్ పరిధిలో 1.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఒక్క ఎకరాకు నీరు ఇచ్చిన పాపాన పోలేద ని విమర్శించారు. మున్సిపాలిటీల ఆదాయం విద్యుత్ బిల్లులకే.. మున్సిపాలిటీల ఆదాయం విద్యుత్ బిల్లులకే సరిపోతోందని, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని జగన్ ప్రశ్నించారు. పులివెందుల మున్సిపాలిటీలో రూ.5 కోట్ల ఆదాయం ఉంటే రూ.2.5 కోట్లు విద్యుత్ బిల్లులకు చెల్లిస్తున్నారన్నారు. కడప కార్పొరేషన్లో ప్రతినెలా రూ.32 కోట్ల ఆదాయం ఉంటే దాదాపు రూ.20 కోట్లు విద్యుత్ బిల్లులకే పోతోందన్నారు. పంచాయతీల్లో తాగునీటి పథకాలదీ అదే పరిస్థితన్నారు. వైఎస్ హయాంలో తాగునీటి పథకాలకు ప్రభుత్వమే బకాయిలు చెల్లించేదని, స్థానిక సంస్థలకు భారం ఉండేదికాదన్నారు. జెడ్పీ తాగునీటి పథకాలకు రూ.10 కోట్ల బకాయిలు చెల్లించాల్సి వస్తోందని, అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎంపీ ఫండ్స్ రూ.5 కోట్లు తాగునీటికే ఖర్చు చేస్తున్నా సమస్య తీరలేదని, ప్రభుత్వం నుంచీ తగిన నిధులు రావడం లేదన్నారు. నీటి ట్రాన్స్‌పోర్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడమే నిదర్శనమన్నారు. సమావేశంలో ఉన్నతాధికారులతోపాటు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే లు రవీంద్రనాథరెడ్డి, ఎస్బి అంజాద్‌బాషా, శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు తిరుపాల్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కడప డిప్యూటీ మేయర్ అరీఫుల్లా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు దేవిరెడ్డి శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీ-నీవా పూర్తయితేనే సీమ అభివృద్ధి
వజ్రకరూరు : దేశంలోనే అత్యంత వెనుకబడిన రాయలసీమపై టీడీపీ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. హంద్రీ-నీవాకు 100 టీఎంసీల నీటిని కేటాయించాలని, మొదటిదశ కింద ఉరవకొండ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు ఈ ఖరీఫ్‌లో నీరివ్వడానికి వీలుగా డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28,29 తేదీల్లో ఉరవకొండలో తాను చేపట్టనున్న 25 గంటల దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం ఆయన వజ్రకరూరు మండలం చిన్నహోతూరు, గడేహోతూరు, చాబాల, పొట్టిపాడు తదితర గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. హంద్రీ-నీవా పూర్తయితేనే రాయలసీమ అభివృద్ధి చెందడానికి వీలు కలుగుతుందన్నారు. సీమకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒకతాటిపైకి వచ్చి దీక్షకు మద్దతు ఇవ్వబోతున్నారని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో కృష్ణాజలాలు పరుగులు తీస్తున్నాయంటే అది వైఎస్సార్ కృషి ఫలితమేనని చెప్పారు. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీ-నీవా పథకానికి రూ.4600 కోట్లు కేటాయించి 90శాతం పనులను పూర్తి చేయించారని గుర్తు చేశారు. చంద్రబాబు సీఎంగా రెండుసార్లు హంద్రీ-నీవా పథకానికి శంకుస్థాపనలు చేసినప్పటికీ కిలోమీటరు కూడా కాలువ పనులు చేపట్టలేదన్నారు. ఆయన మరోమారు జిల్లా ప్రజలను వంచించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గోదావరిపై పట్టిసీమ పేరుతో రూ.1,300 కోట్లు ఖర్చు పెట్టి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు బాబు సర్కారు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విశ్వ తనయుడు, జిల్లా యువజన నాయకుడు వై.ప్రణయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం తాలుకా కమిటీ సభ్యురాలు శైలాజా రాజశేఖరరెడ్డి, ఎంపీపీ కోర్రా వెంకటమ్మ, వైస్ ఎంపీపీ చాబాల నారాయణప్ప, పార్టీ మండల కన్వీనర్లు జయేంద్రరెడ్డి, భూమా కమలారెడ్డి, ఎంపీటీసీ దేవేంద్ర, నాయకులు నారాయణరెడ్డి, శివరామిరెడ్డి, విజయ్, కిశోర్‌రెడ్డి, సోమిరెడ్డి, ఆది, ప్రసాద్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, ముండాసు ఓబుళేసు, ముత్యాల్, పరమేష్, రామలింగ, చిన్నపులికొండ, మునిరెడ్డి, ఇమామ్, సింగిల్‌విండో డెరైక్టర్ వసంతనాయుడు పాల్గొన్నారు. -
హంద్రీ-నీవా కోసం 25 గంటల దీక్ష
ఉరవకొండ : జిల్లాకు వరప్రసాదమైన అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉరవకొండ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి 25 గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు. ఉరవకొండలోని పాత బస్టాండ్ వేదికగా ఈ నెల 28న మధ్యాహ్నం రెండు గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం మూడు వరకు దీక్ష చేపడతానని ఆయన ప్రకటించారు. సోవువారం ఉరవకొండలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ స్థాయి నాయుకుల సవూవేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. హంద్రీ-నీవా పూర్తికి తక్షణమే రూ.250 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కాలువకు వంద టీఎంసీల నీటిని కేటారుుంచాలన్నారు. ఎంతో ప్రాధాన్యత కల్గిన ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇది పూర్తయితే లక్షలాది వుంది రైతులు బాగుపడతారని, ఆత్మహత్యలు కూడా ఆగిపోతాయని వివరించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ-నీవాకు అత్యంత ప్రాధాన్యతిచ్చారని గుర్తు చేశారు. దాదాపు రూ.4,600 కోట్లతో పనులు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. జిల్లా ప్రజలు టీడీపీకి 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఇచ్చినా వారు హంద్రీ-నీవాను పూర్తి చేయించడానికి చిత్తశుద్ధితో కృషి చేయడంలేదని విమర్శించారు. ప్రభుత్వానికి కనువిప్పు కల్గించే ఉద్దేశంతో తాను చేపట్టనున్న దీక్షను విజయవంతం చేయాలని రైతులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ వుహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుశీలవ్ము, అధికార ప్రతినిధి వీరన్న, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చందా వెంకటస్వామి, జెడ్పీటీసీ సభ్యులు మేరీ నిర్మలవ్ము, లలితవ్ము, సింగాడి తిప్పయ్యు, నాయకులు అశోక్, రవుణయూదవ్, ఏసీ ఎర్రిస్వామి, రవుణారెడ్డి పాల్గొన్నారు. -
రాయలసీమ ఎడారిగాక తప్పదు
పుంగనూరు: ఆంధ్ర, తెలంగాణ ముఖ్యమంత్రులు పరస్పరం సహకరించుకోకపోతే రాయలసీమకు నీరులేక ఎడారిగా మారిపోతుందని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం పుంగనూరు సమీపంలోని కృష్ణాపురంలో కొత్తగా నిర్మించిన ఆలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు తాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని కోరారు. హంద్రీ-నీవా కాలువను వెంటనే పూర్తి చేసి రాయలసీమ ప్రాంతానికి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. శ్రీశైలం, కృష్ణా జలాల నీటి ప్రాజెక్టుల విషయంలో ఇద్దరు సీఎంలు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. చిత్తూరు జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం స్పందించి పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రజలను మోసగిస్తోందని దుయ్యబట్టారు. జన్మభూమి-మా ఊరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మారిపోయిందని దుయ్యబట్టారు. పింఛన్ రూ.వెయ్యి ఇస్తున్నట్లు చెప్పి వేలాది మందికి రద్దు చేయడం బాధాకరమన్నారు. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పథకాలను కొనసాగించాలని డిమాండు చేశారు. త్వరలోనే టీడీపీ ప్రభుత్వం నిజ స్వరూపం బయటపడుతుందని, ప్రజలే గుణపాఠం నేర్పుతారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, ఎంపీపీ నరసింహులు, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, ఏఎంసీ మాజీ చైర్మన్లు నాగరాజారెడ్డి, అమరనాథరెడ్డి తది తరులు పాల్గొన్నారు. -
అరచేతిలో నీటి ప్రాజెక్టు!
ఏడాదిలోగా హంద్రీ-నీవాను పూర్తి చేస్తామన్న మంత్రి దేవినేని ఉమ ఆ ప్రాజెక్టును పూర్తిచేయడానికి రూ.1750 కోట్లు అవసరమంటున్న అధికారులు బడ్జెట్లో కేవలం రూ.100.28 కోట్లను మాత్రమే కేటాయించిన వైనం సాక్షి ప్రతినిధి, తిరుపతి: అరచేతిలో వైకుంఠం చూపించ డం అంటే ఇదే..! హంద్రీ-నీవా ప్రాజెక్టుకు 2014-15 బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించాలని అధికారులు ప్రతిపాదించారు. కానీ.. బడ్జెట్లో కేవలం రూ.100.28 కోట్లనే కేటాయించారు. ఆ నిధులు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించడానికి.. తొలి దశ పనులు పూర్తిచేయడానికే సరిపోవు. కానీ.. భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాత్రం ఏడాదిలోగా హంద్రీ-నీవాను పూర్తిచేసి, ఆయకట్టుకు నీళ్లందిస్తామని మంగళవారం శాసనసభలో ప్రకటించడంపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయడమే లక్ష్యం గా దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి రూ.6,850 కోట్ల వ్యయంతో అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీల జలాలను ఎత్తిపోసి.. 33 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చడంతోపాటు 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. 2004-05 నుంచి 2009-10 వరకూ బడ్జెట్లో నిధుల కేటాయింపులో హంద్రీ-నీవాకు వైఎస్ పెద్దపీట వేశారు. ఫలితంగా ఆ పథకం పనులు శరవేగంగా సాగాయి. హంద్రీ-నీవాకు ఇప్పటిదాకా రూ.5,100 కోట్లను ఖర్చు చేస్తే.. రూ.4,250 కోట్లను దివంగత వైఎస్ హయాం లోనే ఖర్చు చేయడం గమనార్హం. వైఎస్ హఠాన్మరణంతో ఆ ప్రాజెక్టుకు గ్రహణం పట్టుకుంది. హంద్రీ-నీవా తొలి దశ వైఎస్ హయాంలోనే పాక్షికంగా పూర్తయింది. 2012 నుంచి ఇప్పటిదాకా హంద్రీ-నీవా ద్వారా కర్నూలు జిల్లా కృష్ణగిరి, పత్తికొండ.. అనంతపురం జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్లకు నీటిని తెస్తున్నారు. చిత్తూరు జిల్లా హంద్రీ-నీవా రెండో దశ కింద ఉంది. జిల్లాలో రెండో దశ కింద 11 లక్షల మందికి తాగునీరు, 1.40 లక్షల ఎకరాలకు హంద్రీ-నీవా కింద నీళ్లందించాలని నిర్ణయించారు. కిరణ్ హయాంలో నిధులు కేటాయించకపోవడం వల్ల రెండో దశ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈ దుస్థితిపై మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. ఇందుకు దేవినేని ఉమా స్పందిస్తూ.. ఏడాదిలోగా హంద్రీ-నీవాను పూర్తిచేసి 6.02 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీపై అధికారవర్గాలు నివ్వెరపోతున్నాయి. హంద్రీ-నీవాకు ఈ ఏడాది రూ.750 కోట్లు కేటాయించాలని ప్రతిపాదిస్తే ప్రభుత్వం కేవలం రూ.100.28 కోట్లు కేటాయించింది. ఇందులో బకాయిల రూపంలో రూ.45 కోట్లను కాంట్రాక్టర్లకు చెల్లించాలని అధికారవర్గాలు స్పష్టీ కరిస్తున్నాయి. తక్కిన రూ.55 కోట్లతో తొలి దశలో నిలిచిపోయిన పనులను పూర్తిచేయడానికే సరిపోవని అధికారుంటున్నారు. ఈ నేపథ్యంలో రెండో దశ పనులకు నిధుల కొరత తప్పదన్నది స్పష్టం. ఇది మంత్రి దేవినేనికి కూడా తెలియంది కాదు. నిధుల కేటాయింపులో ఏమాత్రం పట్టించుకోని మంత్రి.. ఇప్పుడు హంద్రీ-నీవా ను ఏడాదిలోగా పూర్తిచేస్తామని ప్రకటించడంపై అధికారవర్గాలే నివ్వెరపోతున్నాయి. ప్రభుత్వం నిధులను ఇదే రీతిలో కేటాయిస్తే మరో పదేళ్లకు కూడా హంద్రీ-నీవాను పూర్తిచేయలేమని నీటిపారుదలశాఖ అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. -
మాట నిలబెట్టుకున్న నాయకుడు వైఎస్ఆర్
చంద్రబాబు మోసకారి ప్రజల నుంచి గుణపాఠం తప్పదు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి మాటకు కట్టుబడే వ్యక్తి అని, అందుకే ఆయన చరిత్రలో నిలిచిపోయారని పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మండల పర్యటన చివరి రోజు బుధవారం ఆయన పూజగానిపల్లె గ్రా మంలో ప్రసంగించారు. వైఎస్ఆర్ను మాటకు కట్టుబడే వ్యక్తిగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి కాగానే ఉచిత విద్యుత్‌పై సంతకం చేశారని, రూ.35 వేల కోట్ల కరెంటు బకాయిలు మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో నేటికీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే పేద ప్రజల కోసం చేపట్టిన పక్కాగృహాలు, పెన్షన్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్లు, పావలావడ్డీ రుణాలు, 108, 104 పథకాలను ప్రభుత్వం నీరుగార్చుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పడమటి మండలాల్లోని రైతుల కోసం హంద్రీ-నీవా కాలువను ప్రారంభించిన ఘనత వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. ఆయన ప్రారంభించిన కాలువ పనులు 90 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 10 శాతం పనుల కోసం నిధులు కేటాయించేందు కు చంద్రబాబు సుముఖత చూపకపోవడం బాధాకరమన్నారు. హంద్రీ-నీవా కాలువలో నీరు వస్తే 36 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాంటి పథకాలను వదిలివేసి, చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీపై చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, వ్యవసాయ మంత్రి పుల్లారావు చేస్తున్న పొంతనలేని ప్రకటనలు ప్రజలను మోసగించడమేనన్నారు. టీడీపీలో కబ్జాదారులకు, మోసగాళ్లకు స్థానం కల్పించి, పేద ప్రజలను పీడిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ పేదల పక్షిపాతిగా ఉంటూ, రెండు రూపాయల బియ్యం, మద్యపానం నిషేధం అమలుపరచి చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. అలాంటి గొప్ప వ్యక్తికి అల్లుడైన చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి, అక్రమార్గాల్లో సీఎం అయి మూడు నెలల్లోనే మద్యనిషేధాన్ని ఎత్తివేశారని ఆరోపించారు. రెండు రూపాయల బియ్యాని ఐదు రూపాయ లు చేసి పేదలను నిలువుదోపిడి చేసి చరిత్రహీనుడుగా మిగిలిపోయారని అన్నారు. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించి, ఆయన చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడేనని దుయ్యబట్టారు. ఇలాంటి వారికి పరిపాలన చేసే అర్హత లేదన్నారు. త్వరలోనే ప్రజలు చంద్రబాబు కళ్లు తెరిపిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే సోదరుడు ద్వారకనాథరెడ్డి, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ ఎన్.రెడ్డెప్ప, జెడ్పీటీసీ వెం కటరెడ్డియాదవ్, ఎంపీపీ నరసింహులు, ఏ ఎంసీ మాజీ చైర్మన్లు అమరనాథరెడ్డి, నాగరాజారెడ్డి, మాజీ ఎంపిటీసీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హంద్రీ-నీవాకు ప్రాధాన్యంప్రశ్నార్థకమే!
అనధికారికంగా ప్రాజెక్టు గడువు పెంచుతున్న ప్రభుత్వం 2012కే పూర్తి కావాల్సింది..2015 నాటికి గడువుపెంపు? ఉపకాలువల పనులు చేపట్టని కాంట్రాక్టర్లు బి.కొత్తకోట: హంద్రీ-నీవా సుజలస్రవంతి సాగు, తాగునీటి ప్రాజెక్టు పూర్తికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో ప్రాధాన్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. గతంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఈ ప్రాజెక్టును ఎత్తివేసి రూ.755కోట్లతో 5టీఎంసీలతో తాగునీటి పథకంగా మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. రాయలసీమ వరప్రసాదిని అయిన ఈ ప్రాజెక్టును దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి రెండుదశల్లో చేపట్టి పనులు ప్రారంభించారు. ఆయన హయాంలో 2005లో ప్రారంభమైన పనులను 2012నాటికి పూర్తిచేయాలన్న లక్ష్యం నిర్దేశించారు. దీనికి తగినంత నిధులిచ్చారు. శరవేగంగా పనులు జరిగాయి. ఆయన మరణానంతరం పనుల్లో జాప్యంతో, ప్రాజెక్టు గడువును 2013 డిసెంబర్‌కు పెంచారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పనులు పూర్తిచేసేందుకు గడువును 2015 డిసెంబర్‌కు పెంచే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దీంతో పనుల వేగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల కేటాయింపులో మొండిచెయ్యి చూపే పరిస్థితులున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల పూర్తికి కనీస ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించకపోయినా.. ఆ దిశగా అడుగులు కనిపించడంలేదు. రెండో దశకు రూ.3,729కోట్ల ఖర్చు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సాగే రెండోదశతో రూ.4,076 కోట్లతో 4.70లక్షల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు నిర్ణయించారు. ఇందులో ఇంతవరకూ పనులకోసం రూ.2,892 కోట్లు ఖర్చుచేశారు. ఇదికాక జాతీయ రహదారుపై బ్రిడ్జిల నిర్మాణం, భూసేకరణ, విద్యుత్‌కోసం ట్రాన్స్‌కోకు, అటవీశాఖకు డిపాజిట్ చేసిన నిధులతో కలుపుకుని రూ.3,729.52 కోట్లు వ్యయం చేశారు. ఇంకా రూ.1,184 కోట్ల పనులు పూర్తి చేయాల్సివుంది. గడువు పెంచడమే? రెండోదశ ప్రాజెక్టు పనులను 2012 డిసెంబర్‌కు పూర్తిచేయాలనీ వైఎస్.రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. ఆయన తర్వాత 2013 డిసెంబర్‌కు పెంచారు. ఇప్పుడు మళ్లీ 2015 డిసెంబర్ నాటికి పెంచుతున్నారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనప్పటికీ చేపట్టిన పనులను 2015కు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు గడువు పెంచినట్టు అధికారులు చెబుతున్నారు. అవసరమైన నిధులు కేటాయించకపోతే పనుల్లో వేగం ఉండదు. ఇంతకంటే ఎక్కువ జాప్యం జరుగుతుంది. దీనివల్లే గడువుపెంచితే నిధుల కేటాయింపు సమస్య ఉండదని ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. కాగా రెండు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో ఆగిపోయిన పనులు ప్రారంభం కావాల్సివుంది. ఎత్తిపోతల పథకాల పనులు సాగుతుండగా, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలు ఇంకా మొదలుకానే లేదు. ప్రధానంగా గత ఆర్థిక సంవత్సరంలో రెండోదశ పనులు పూర్తిగా పడకేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్టుపూర్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందా లేదా అన్నది బడ్జెట్ కేటాయింపుల్లో తేలిపోనుంది. ఉపకాలువల ఊసేలేదు ప్రాజెక్టులో భాగమైన ఉపకాలువల పనులు ఇంతవరకూ పూర్తిస్థాయిలో చేపట్టలేదు. కొన్ని ప్యాకేజీల్లో మాత్రమే ఈ పనులు చేపట్టారు. కాలువల పనులకు ఎకరాకు రూ.4,700తో కాంట్రాక్టర్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని ప్రస్తుతం రూ.10,500కు పెంచాలని కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఎకరాకు రూ.5,800 పెంచే నిర్ణయం గతప్రభుత్వం తీసుకోకపోవడంతో ప్రతిపాదనలకు మోక్షం కలగలేదు. దీంతో పనులు ప్రారంభంకాలేదు. దీనికి అవసరమైన భూసేకరణ చర్యల్లోనూ జాప్యం జరుగుతూ వస్తోంది. కోరేదొకటీ.. ఇచ్చేదొకటీ.. వైఎస్ హయాంలో కేటాయింపులు వెయ్యికోట్లు దాటింది. ఆయన తర్వాత 2010-11లో రూ.640కోట్లు కేటాయించారు. 2011-12లో రూ.1,764 కోట్లు కోరితే రూ.695 కోట్లు ఇచ్చారు. 2012-13లో రూ.1,637 కోట్లడిగితే రూ.698, 2013-14లో రూ.1,251కోట్లు కావాలని కోరితే రూ.416కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టుకు ప్రాణంపోసిన వైఎస్ హయాంలో నిధులు భారీగా ఇచ్చారు. 2007-08లో రూ.925కోట్లు, 2008-09లో రూ.1,165కోట్లు, 2009-10లో రూ.1,000కోట్ల నిధులిచ్చారు. వీటిలో ప్రారంభంలో తొలిదశకు అధిక నిధులు ఖర్చుచేయడంతో 90 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15కు రెండోదశకు రూ.750కోట్లు కలుపుకుని మొత్తం ప్రాజెక్టుకు రూ.900.80కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఎంత నిధులు కేటాయిస్తారన్నది తేలాల్సి ఉంది. నిధుల కేటాయింపును బట్టి పనుల వేగవంతం ఆధారపడివుంది. కమిటీ గడువిచ్చింది రెండోదశ పనులకు ప్రాజెక్టుల రాష్ట్ర కమిటీ గడువు ఇచ్చింది. 2015 డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేసేందుకు అవకాశం కల్పించింది. ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కోసం గడువు పెంచలేదు. దీనిపై ఆదేశాలు కూడాలేవు. ప్రస్తుతం పనుల్లో వేగం పెంచడం కోసం చర్యలు తీసుకుంటున్నాం. -పీ.కృష్ణ, ప్రాజెక్టు ఎస్ఈ, మదనపల్లె