మూలపల్లికి హంద్రీ-నీవా నీరు
కల్యాణిడ్యామ్‌కు గాలేరు-నగరి
నారావారిపల్లిలో పశువుల శాల
ముఖ్యమంత్రి చంద్రబాబు
నారావారిపల్లి(తిరుపతి రూరల్): చంద్రగిరి మండలం మూలపల్లిలోని రిజర్వాయర్‌కు హంద్రీ-నీవా నీరు, కల్యాణి డ్యామ్‌కు గాలేరు-నగరి నీటిని తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం నారావారిపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రగిరి మండలాన్ని సస్యశ్యామలంగా మార్చుతామన్నారు. భూగర్భజలాలను 6 మీటర్లకు తీసుకురావడమే ధ్యేయమన్నారు. అందుకోసం రిజర్వాయర్లను నీటితో నింపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. తన కోడలు బ్రాహ్మణి దత్తత తీసుకున్న నారావారిపల్లిలో త్వరలో యనిమల్ క్యాటిల్ ఫామ్ (పశువుల శాల) ను ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఇంటికీ గ్యాస్, రేషన్‌కార్డులు, ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. జిల్లాలో పంట పొలాల్లో లక్ష పంట కుంటలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పారు.
కలెక్టర్‌కు అభినందన..
గత రెండు నెలల్లో పడిన భారీ వర్షాల సమయంలో ఒక్క చెరువును కూడా తెగిపోకుండా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ చేపట్టారని ముఖ్యమంత్రి అభినందించారు. ఆయన చేపట్టిన చర్యల వల్లే జిల్లాలో 33 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు 9.6 మీటర్లకు పెరిగాయని చెప్పారు.