హామీలు విస్మరించి.. ఆపై అబద్ధాలా? | chandrababu naidu avoiid in Guarantees | Sakshi
Sakshi News home page

హామీలు విస్మరించి.. ఆపై అబద్ధాలా?

Published Sun, May 29 2016 2:48 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

హామీలు విస్మరించి.. ఆపై అబద్ధాలా? - Sakshi

హామీలు విస్మరించి.. ఆపై అబద్ధాలా?

చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలి
రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

 మాట్లాడుతున్న తోపుదుర్తి  ప్రకాష్‌రెడ్డి

అనంతపురం : ఎన్నికల సమయంలో ఇచ్చిన హా మీల అమలును విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడులో కొత్త అబద్ధాలు చెబుతున్నారని  వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన  దీక్షలను చంద్రబాబు భజన బృందం ఎద్దేవా చేయడం సిగ్గుచేటన్నారు. పైగా మహానాడులో దీనిపై తీర్మానం చేయడం వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు.

సొంత డబ్బా కోసం, పెదబాబు, చినబాబును పొగి డేందుకే మహానాడును పరిమితం చేశారన్నారు.    వీరికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రెండేళ్లపాలనపై చర్చ జరపాలన్నారు. రాష్ట్ర  ఆర్థిక  పరిస్థితి బాగాలేదంటూనే సివిల్ సప్లయ్, ఇరిగేషన్ టెండర్లు, చంద్రన్నకానుక  పేరుతో రూ. వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

కేవలం రూ. 500 కోట్లతో డిస్ట్రిబ్యూటరీ, చెరువుల ద్వారా హంద్రీ-నీవా నీటిని జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ఇచ్చే అవకాశం ఉందన్నారు.  అయితే 1163 చెరువులకు హంద్రీ-నీవా పథకానికి  లింకేజీ చేసే ఊహాజనిత ప్రాజెక్ట్ గురించి జిల్లా మంత్రులు మాట్లాడడం విడ్డూరమన్నారు. సర్వేల పేరుతో కోట్ల రూపాయలు దండుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. నీటిని జిల్లాను దాటించే విధంగానే పనులు జరుగుతున్నాయన్నారు. కనగానపల్లి జె డ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి బాబా  సలాం, కార్యదర్శి సునీల్‌దత్తారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement