ఏడాదిలోగా హంద్రీ-నీవా నీళ్లిస్తానన్న బాబు
బడ్జెట్‌లో మాత్రం మొక్కుబడి కేటాయింపులు
అవసరం *1194 కోట్లు, కేటాయింపులు * 212 కోట్లే
గాలేరు - నగరి, తెలుగుగంగదీ అదే పరిస్థితి
బాబు వంచనపై విమర్శల వెల్లువ
ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతన కుదరడం లేదు. ఎన్నికల ముందు, ఆ తరువాత చంద్రబాబు కుప్పలు తెప్పలుగా హామీలు గుప్పించారు. రాష్ట్ర పరిధిలో వందలాది హామీలు ఇవ్వగా, సొంత జిల్లాకు సంబంధించి దాదాపు 30కిపైగా హామీలు ఇచ్చారు. జిల్లాలో కరువు నేపథ్యంలో ప్రధానంగా తాగునీటి సమస్య తీవ్ర స్థాయికి చేరింది. హంద్రీ-నీవా కాలువను పూర్తిచేసి జిల్లా నీటి సమస్యను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి పలు దఫాలు హామీ ఇచ్చారు.
కానీ తొమ్మిది నెలల పాలన కాలంలో బాబు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. తాజా బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయించి హామీలు నెరవేర్చుతారనుకుంటే అదీ లేదు. బడ్జెట్ చూశాక ఆ ఆశ ఆవిరై పోయింది. 2015-16కు గాను గురువారం ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరే పరిస్థితి కానరావడంలేదు. రాష్ట్ర ప్రజలనే కాదు సొంత జిల్లా ప్రజలను సైతం చంద్రబాబు వంచించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కుప్పానికి కన్నీళ్లే ?
Published Sat, Mar 14 2015 2:35 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement