అభివృద్ధి పనుల పేరుతో పేదల భూములపై కన్ను
తమదాకా వస్తే మాత్రం వ్యతిరేకం
తెలుగు తమ్ముళ్ల ద్వంద్వనీతి
శాంతిపురం: ‘అభివృద్ధి చేయాలంటే భూమి కావాలి.. రైతులు సహకరిం చాలి.. పరిశ్రమలు, ప్రాజెక్టులు గాలిలో కట్టలేం. భూములు ఇవ్వబోమంటే ఎలా?’ టీడీపీ నాయకుల నోట తరచూ దొర్లుతున్న మాటలివి. గతంలో విమానాశ్రయం కోసం భూముల సేకరణ, ఇప్పు డు హంద్రీ-నీవా కాలువ సర్వేల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు ఈ మాటలను పదేపదే వల్లెవేశారు. రైతులు భూములు వదులుకుని సహకరించాలని ఎవరికి వారు బాకా ఊదారు. విమానాశ్రయం పేరుతో కడపల్లి పంచాయతీలో దాదాపు వెయ్యి కుటుంబాల భూములు లాక్కునేందుకు విఫలయుత్నం చేశారు. ఏకంగా కొంపలు కూల్చి, గ్రామాలను ఖాళీ చేయించటానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రాంత ప్రజల నుంచి తీవ్రవ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గారు.ఇప్పటికీ ఇక్కడి రైతుల తీరును తప్పు పడుతూనే ఉన్నా రు. విమానాలు రాకుండా చేశారనే నింద లు మోపుతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇంకో పక్కన తమ భూముల్లో అరచేతి వెడల్పుతో భూమి పోతుందన్నా అరచి గగ్గోలు పెడుతున్నారు.
రోడ్డుకు అడ్డు
శాంతిపురం నుంచి వెంకటేపల్లి మీదుగా కేజీఎఫ్ వెళ్లే రోడ్డులో బోయనపల్లి క్రాసు నుంచి సిద్దామారు సమీపానికి లింక్ రోడ్డు ఉంది. మట్టి రోడ్డుగా ఉన్న దీన్ని తారు రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పంచాయతీ రాజ్‌శాఖ ద్వారా రూ.26 లక్షలు మంజూరు చేసింది. పను లు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డుకు ఒక పైపున ట్రెంచి కొట్టి వెడల్పు చేసే పనులు ప్రారంభించారు. కానీ మరో వైపున పనులు ప్రారంభించగానే అక్కడ భూములు ఉన్న ప్రముఖ తెలుగుదేశం నాయుకుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. తవు భూముల్లో వేలు పెట్టకుండా అవతలే రోడ్డు పనులు చేసుకోవాలని హుకుం జారీ చేశారు. ఎలాగోలా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్ భావించినా భూములు కోల్పోయిన వారిలో కొందరు ఎదురు తిరిగారు. తవు భూముల పరిధిలో రోడ్డు వెడల్పు కోసం తవ్విన ట్రెంచ్‌లను పూడ్చివేశారు. దీంతో పనులు అర్ధంతరంగా ఆగిపోయూరుు. పరాయి రైతుల భూములను అభివృద్ధికి ఇవ్వాలని నీతులు చెబుతున్న బడా నాయకుడు ఇప్పుడు ఇంట్లో వాళ్లకు అవే నీతులు చెప్పాలని స్థానికు లు తలంటుతున్నారు. ఈ వ్యవహారంపై పీఆర్ ఏఈ హరినాథ్ వివరణ కోరగా తనకు ఏమీ తెలియదని చెప్పారు.
హంద్రీ-నీవాకూ అడ్డే
శ్యాటిలైట్ సర్వే ఆధారంగా పొలాల్లో అడ్డగోలుగా కాలువ తవ్వకాలకు రాళ్లు నాటినా, తమకు కనీస సమాచారం లేకున్నా చాలా మంది రైతులు కిమ్మనకుండా ఉన్నారు. వీరిలో సర్వం కోల్పోయే వారు, ఉన్న భూముల మధ్య నుంచి కాలువ పోతే ఇరువైపులా అడుగుల వెడల్పుతో సాగు భూమి మిగిలే వారు ఉన్నారు. కానీ తమ ప్రాంతానికి నీళ్లు రావాలన్న ఆశతో కన్నీటిని గుండెల్లో దాచుకున్నారు. అయితే సిద్దామారు వద్ద టీడీపీ ప్రజాప్రతినిధి కుటుంబం మాత్రం తమ భూముల్లో కాలువకు ససేమిరా అంటోంది. సర్వే బృందం రాళ్లు నాటకుండా అడ్డుకుంటోంది. అధికారులు, నాయకులు రెండు రోజుల పాటు చేసిన దౌత్యాలన్నీ విఫలమయ్యాయి. సోమవారం తాను వచ్చి చూస్తానని సదరు ప్రజాప్రతినిధి చెప్పటంతో ఆయన కోసం ఎదరుచూస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు అందరూ భూములు ఇచ్చేయండని అంటున్న అధికారపార్టీ నాయకులు తమ భూముల్లో నామ మాత్రంగా పోయినా సహించలేక పోతున్నారు. ఈ తీరును సామాన్యులతో పాటు అధికార పార్టీ శ్రేణులు కూడా తప్పుబడుతున్నారు. నిత్యం సీఎం నామజపం చేస్తూ బతుకుతున్న నాయకులు ముందుగా తమ భూములు వదులుకుని మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నారు.
ఇదేమి న్యాయం ?
Published Mon, Feb 29 2016 2:10 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement