Feeder channel
-
ఫీడర్ చానల్ తవ్వకానికి అనుమతించండి
కలెక్టర్‌ను కోరిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం అర్బన్: హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్ర« దాన కాలువ నుంచి కూడేరు మండలం ముద్దలాపురం, ఇ ప్పేరు చెరువులకు తాగు, సాగు నీరు చేరేందుకు ఫీడర్ చా నల్ తవ్వించేందుకు పరిపాలన పరమైన అనుమతి మంజూ రు చేయాలని కలెక్టర్ కోన శశిధర్‌ను ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కోరారు. సోమవారం కలెక్టర్‌ని రెవెన్యూ భవన్‌లోని కలెక్టర్ చాంబర్లో కలిసి ఈ మేరకు లేఖ అందజేసి ప రిస్థితిని వివరించారు. కూడేరు మండలంలోని ఇప్పేరు, అంతరగంగ, నాగిరెడ్డిపల్లి, కూడేరు, కలగల్ల, ముద్దలాపురం, త దితర పది గ్రామాల ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడితో ఇ బ్బందిపడుతున్నారన్నారు. కూడేరు మండలం ద్వారా వెళుతున్న హంద్రీ–నీవా ప్రధాన కాలువ రెండవ దశ నుంచి ఫీడర్ చానల్ ఏర్పాటు చేసి ముద్దలాపురం చెరువుకి, అక్కడి నుం చి ఇప్పేరు చెరువుకి నీరు వదలడం ద్వారా సమస్యని పరి ష్కరించవచ్చన్నారు. రెండు చెరువులకు నీరు వదలడం ద్వారా పది గ్రామలతో పాటు ఇప్పేరు చెరువుకు దిగువన ఉ న్న గార్లదిన్నె మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలకు కూడా లభించడంతో పాటు దాదాపు 15 గ్రామాల్లో భూగర్భ జలాలు కూడా వృద్ధి చెంది వ్యవసాయానికి ఉపయోగకరం గా ఉంటుందన్నారు. అలాగే అంతరగంగ గ్రామం చుట్టుపక్కల ఉన్న సుమారు 70 తలిపిరిలు (స్ప్రింగ్స్) కూడా రీచార్జి అవుతాయన్నారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ రెండవ ఫేజ్‌లోని 232.422 కిలోమీటర్ వద్ద నుంచి ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీరు విడుదల చేయడానికి 2.6 కిలోమీటర్ల మేర ఫీడర్ చానల్ని తవ్వాల్సి ఉంటుందన్నారు. సామూహిక మొక్కల పెంపకానికి నిధులివ్వండి :జిల్లా కేం ద్రం నుంచి వయా కూడేరు, ఉరవకొండ మీదుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన చెళ్లగురికి గ్రామం వరకు ప్రస్తుతం కొత్తగా రోడ్డు నిర్మిస్తున్నారని ఆయన కలెక్టర్‌కు తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ‘సామూహిక మొక్కల పంపకం’ కోసం స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు కింద పనిని మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోరారు. -
ఇవేం పనులు
మిషన్ పనులపై కలెక్టర్ అసంతృప్తి ఎల్లారెడ్డిగూడెం చెరువు ఆకస్మిక తనిఖీ అధికారులపై ఆగ్రహం వారంలో మళ్లీ వస్తానని హెచ్చరిక ఎల్లారెడ్డిగూడెం(రఘునాథపల్లి) : ‘చెరువులోకి సాఫీగా వర్షపు నీరు వచ్చేందుకు ఫీడర్ చానల్ పనులు ఎందుకు చేర్చలేదు... క ట్టకు ముళ్ల చెట్లు ఎందుకున్నాయి.. తీసి వేసిన మొట్లు చెరువులో అలాగే ఉంచుతారా.. ఇవేం పనులు.. ఇలాగేనా’ అంటూ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఇరిగేషన్ ఏఈ జయపై ఫైర్ అయ్యారు. మండలంలోని ఎల్లారెడ్డిగూడెంలోని గూడెం చెరువు మిషన్‌కాకతీయ పునరుద్ధరణ పనులను ఆమె సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. పనులు ఎంత వరకు అయ్యాయని కలెక్టర్ ఏఈని అడుగగా 10 వేల క్యూబిక్ మీటర్ల పూడకతీతతో పనులు పూర్తవుతాయని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంటనే ఫీడర్ చానల్ పనులు చేపట్టాలని ఆదేశించారు. తొలగించిన చెట్ల మొట్లు చెరువులో ఉండడాన్ని చూసి ఏఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్ఓ ఏం చేస్తున్నాడంటూ ప్రశ్నల వర్షం కురిపించా రు. చెరువు పనులను ఎప్పటి కప్పుడు తహసీల్దార్, ఎంపీడీఓ పర్యవేక్షించాలని సూచించారు. చెరువు పనులు అధ్వానంగా ఉన్నాయని, సాయంత్రం వరకు తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ ఏఈని ఆదేశించారు. వారం రోజుల్లో మళ్లీ చెరువును సందర్శిస్తానని అధికారులకు కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. రూ.100తో పూడిక మట్టి పోసుకోలేకపోతున్నాం చెరువులోని పూడిక మట్టిని ట్రాక్టర్‌కు రూ.100 ఇచ్చి తీసుకలేకపోతున్నామని, ఉచితంగా పోయాలని గ్రామానికి చెందిన మహిళా రైతు దుబ్బాక లలిత కలెక్టర్ వద్ద వాపోయింది. ట్రాక్టర్ కిరాయిలు రైతులే భరించాలని పూడకి మట్టితో పంటల దిగుబడి గణనీయంగా పెరుగుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ట్రాక్టర్ యజమానులు ఎక్కువ మొత్తం డిమాండ్ చేయకుండా రూ.80కే పూడిక మట్టి రైతులకు అందేలా అధికారులు చొరవచూపాలని కలెక్టర్ పేర్కొన్నారు. జనగామ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, నిడిగొండ సింగిల్‌విండో చైర్మన్ పెంతారెడ్డి ఎల్లారెడ్డి, తహసీల్దార్ జయమ్మ, ఎంపీడీఓ బానోతు సరిత, ఏఆర్ఐ అనిల్‌బాబు, వీఆర్ఓ రమేష్ పాల్గొన్నారు.