వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీ నేత వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు.
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చిన్నచూపు చూస్తున్నారని ఆ పార్టీ నేత వై విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఉరవకొండ ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఆయన వినూత్న నిరసన వ్యక్తం చేశారు.
రాకెట్ల గ్రామస్థులతో కలసి పలు సమస్యలపై విశ్వేశ్వరెడ్డి అధికారులను నిలదీశారు. నిధుల విడుదల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇది ప్రజాస్వామ్యమా అని నిలదీశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఏమాత్రం సహకరించవొద్దని చంద్రబాబు అధికారులను ఆదేశించారని ఆరోపించారు.