ఉద్రిక్తం..
-
రాగులపాడు లిఫ్ట్ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
-
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్
-
పోలీస్ స్టేషన్ ఎదుటే రైతులతో బైఠాయింపు
-
హంద్రీనీవా ఆయకట్టుకు నీరివ్వండి
-
ప్యాకేజీల కోసం కేశవ్ ఆరాటం
-
ధ్వజమెత్తిన విశ్వేశ్వరరెడ్డి
హంద్రీ–నీవా మెుదటి దశ కింద జిల్లాలో ప్రతిపాదిత ఆÄýæుకట్టుకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్‌తో ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సోమవారం తలపెట్టిన రాగులపాడు లిప్ట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ఉరవకొండ–గుంతకల్లు రహదారిలోని రాగులపాడు గ్రామ సమీపంలో బ్రిడ్జివద్దకు వేలాది మంది రైతులు చేరుకున్నారు. సరిగ్గా 11 గంటల సమయంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని లిఫ్ట్ వైపునకు వెళ్లనీయకపోవడంతో అక్కడే రైతులను ఉద్దేశించి ఎమ్మెల్యే ఉద్వేగంగా మాట్లాడారు. హంద్రీ–నీవా ఆయకట్టుకు శివరావురాజయ్యుయ కమిషన్ ప్రతిపాదించిన విధంగా ఉరవకొండ నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నారు. 2004లో వుహనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి రాగానే 5 టీఎంసీల సావుర్ధ్యం ఉన్న హంద్రీ–నీవాను 40 టీఎంసీల సావుర్థ్యం పెంచుతూ జీవో జారీ చేశారన్నారు.
మెుదటి దశ కింద దాదాపు 90 శాతం పనులు పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాÄýæుర్‌కు రెండు సార్లు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. రెండో దశ పనులు పూర్తి చేసి కుప్పంకు నీటిని తీసుకెళ్లడానికిS చంద్రబాబు దృష్టి పెట్టారన్నారు. అపద్ధాలతో ముఖ్యమంత్రి కాలం వెల్లదీస్తున్నారన్నారు. మరుగుదొడ్డిలో లైటు పడకపోయినా నాకు తెలుస్తుందని.. ఆ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశానంటూ గొప్పలు చెబుతున్న బాబుకు జిల్లాలో 27 రోజులుగా వర్షాలు లేక వేరుశనగ దెబ్బతిన్న విషయం తెలీదా? అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ పయ్యావ#ల కేశవ్‌కు ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ది పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. నియోజకవర్గానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నందున అధికారులు, పోలీసులు ఎవ్వరూ సహకరించొద్దని ఒత్తిళ్లు చేస్తున్నారన్నారు.
హంద్రీ–నీవా ఆÄýæుకట్టుకు నీళ్లు తీసుకురావాడనికి ఎలాంటి కృషీ చేయడం లేదు కాని 36వ ప్యాకేజీలో కేవలం రూ. 56 కోట్ల ఖర్చు పెడితే పూర్తి అయ్యే పనులకు రూ. 336 కోట్లకు అంచనాలు పెంచి తన స్వంత జేబులు నింపుకోవడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. అదికూడా టెండర్ లేకుండా కొటేషన్ పద్ధతిలో పనులు కావాలని అడుగుతున్నారన్నారు. తాను నీళ్లు కోసం అడుగుతుంటే ఆయన ప్యాకేజీల కోసం పాకులాడుతున్నారని కేశవ్‌పై ధ్వజమెత్తారు. రూ.670 కోట్లతో అంచనాలు వేసిన పనులను తాను కేవలం రూ. 10 కోట్లతోనే చేసి చూపిస్తానంటూ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చాలెంజ్ చేశారని గుర్తు చేశారు.
బలవంతపు అరెస్ట్‌లు
ఓవైపు విశ్వేశ్వరరెడ్డి ప్రసంగిస్తుండగానే మరోవైపు గుంతకల్లు డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని రైతులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. వాహనంపై నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో పోలీసులు పైకెక్కి కిందకు దింపి వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేశారు. రైతులు అడ్డుకున్నారు. వాగ్వాదం చోటు చేసుకుంది. విశ్వేశ్వరరెడ్డిని జీపులోకి ఎక్కించుకుని వజ్రకరూరు పోలీస్‌స్షేషన్‌కు తరలించారు. అధిక సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకుని పోలీస్‌స్టేçÙన్ ఎదుట బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై ఎమ్మెల్యేను విడుదల చేశారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శులు అశోక్, తేజోనాథ్, ఉరవకొండ, విడపనకల్లు, కూడేరు, లలితమ్మ, తిప్పయ్య, నిర్మలమ్మ, వజ్రకరూరు ఎంపీపీ కొర్రా వెంకటమ్మ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మాన్యం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.