అనంతపురం : ఉరవకొండ నియోజకవర్గానికి తాగు, సాగు నీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం అనంతపురం జిల్లాలోని హంద్రీ - నీవా కాల్వ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ... మొదటి దశ పనులు పూర్తైన ఆయకట్టుకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నదుల అనుసంధానం పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలాడుతున్నారని విమర్శించారు.