ప్రజలతో ప్రభుత్వం చెలగాటం | congress party dharna at excel plant | Sakshi
Sakshi News home page

ప్రజలతో ప్రభుత్వం చెలగాటం

Published Thu, Oct 20 2016 11:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

ప్రజలతో ప్రభుత్వం చెలగాటం

ప్రజలతో ప్రభుత్వం చెలగాటం



విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్‌) :  స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ నగర్‌ అంటూనే టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోందని కేంద్ర మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి పల్లంరాజు అసహనం వ్యక్తం చేశారు. సింగ్‌నగర్‌లో చెత్త డంపింగ్‌ను నిలిపివేసి, డంపింగ్‌ యార్డును తరలించాలని డిమాండ్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ ఫ్లాంట్‌ వద్ద గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ పేదల ఆరోగ్యం అంటేనే ఈ ప్రభుత్వాలకు చులకన భావమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సింగ్‌నగర్‌ ప్రాంతంలో చెత్త డంపింగ్‌ చేయబోమని స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మరవడం సిగ్గుచేటన్నారు. సమస్యను పరిష్కరించకుంటే అన్ని పార్టీలను కలుపుకొని మహోద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పీసీసీ ప్రతినిధులు రమాదేవి, నరహరశెట్టి  నరసిం హారావు, మస్తాన్‌ వలి, కొలనుకొండ శివాజీ,  కంబగండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement