Ex.Central Minister pallamraju
-
పెద్ద నోట్ల రద్దు ఏకపక్ష చర్య
కానూరు(పెనమలూరు) : పెద్ద నోట్ల రద్దు ఏకపక్ష చర్య అని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు అన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 12వ వర్ధంతి సందర్బంగా కానూరులో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. పల్లంరాజు మాట్లాడుతూ దేశంలో పరిపాలనాపరంగా అనేక మార్పులు తీసుకువచ్చింది పీవీయేనని అన్నారు. ఆయన పాలనలో అన్ని వర్గాల వారికి మేలు జరిగిందని తెలిపారు. బీజేపీ పాలనలో పేద, మధ్యతరగతి ప్రజలు బతకలేని పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద నోట్లు రద్దు కారణంగా పేదలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. చాలా మంది బ్యాంకుల వద్దే ప్రాణాలు వదిలారని, దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహనరావు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దుతో పేదలే ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వెలగపూడికి ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మొవ్వా మోహనరావు, వింతా సంజీవరెడ్డి, ఎన్.మాధవి, ఎస్వి.రాజు, వెలిశిల సుబ్రహ్మణ్యం, కిలారు వెంకటరత్నం, జవహర్లాల్ నెహ్రూ, చిర్రావూరు రవి, నాగదాసు ప్రవీణ్, నెర్సు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ఈడుపుగల్లు (కంకిపాడు) : నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు డిమాండ్ చేశారు. ఈడుపుగల్లు గ్రామంలో ఎన్టీఆర్ మసూరి విత్తనాలు సాగు చేసిన వరి పొలాలను ఆదివారం మధ్యాహ్నం పల్ల్లంరాజుతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు వీరమాచనేని శ్రీనివాసరావు, ముక్కామల రాజా తదితరులు మాట్లాడుతూ ఘంటసాలకు చెందిన ఉప్పాల ప్రసాద్ అనే రైతు నుంచి తాము ఎన్టీఆర్ మసూరి కొని వరి సాగు చేశామని చెప్పారు. పంట కాలం పూర్తి కావస్తున్నా ధాన్యం కంకులు రాలేదని ఎకరాకు రూ.22 వేలు వరకూ పెట్టుబడులు పెట్టామని తెలిపారు. కౌలు రూ.18 వేలు అదనమని వాపోయారు. తెగుళ్లు తట్టుకుంటుందని నమ్మి సాగు చేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిపించాలని కోరారు. మాజీ మంత్రి పల్లంరాజు విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సర్టిఫై చేయని విత్తనాల వల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ఈడుపుగల్లులో 150 ఎకరాల్లో రూ.40 లక్షలు మేర రైతులు పెట్టుబడులు కోల్పోయారన్నారు. రైతులు నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రయోగాలు తప్పుకాదని, విత్తనం ఎంపిక సజావుగా జరగాలని, రైతులకు చేయూత అందించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, పీసీసీ కార్యదర్శులు నరహరిశెట్టి నర్సింహారావు, అన్వర్ హుస్సేన్, రత్నారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, అన్నే సుబ్బారావు (చంటి), మొవ్వా మోహన్‌రావు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం ఇబ్రహీంపట్నం : రెండున్నరేళ్ల పరిపాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిఅంశాల్లో పూర్తిగా విఫలం చెందాయని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు విమర్శించారు. తుమ్మలపాలెంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్ లక్ష్మణ్ నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేయటం పాలకుల బాధ్యతారాహిత్యంగా పేర్కొన్నారు. -
ప్రజలతో ప్రభుత్వం చెలగాటం
విజయవాడ (అజిత్‌సింగ్‌నగర్) : స్వచ్ఛ ఆంధ్ర.. స్వచ్ఛ నగర్ అంటూనే టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోందని కేంద్ర మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి పల్లంరాజు అసహనం వ్యక్తం చేశారు. సింగ్‌నగర్‌లో చెత్త డంపింగ్‌ను నిలిపివేసి, డంపింగ్ యార్డును తరలించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సింగ్‌నగర్ ఎక్సెల్ ఫ్లాంట్ వద్ద గురువారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లంరాజు మాట్లాడుతూ పేదల ఆరోగ్యం అంటేనే ఈ ప్రభుత్వాలకు చులకన భావమని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ సింగ్‌నగర్ ప్రాంతంలో చెత్త డంపింగ్ చేయబోమని స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మరవడం సిగ్గుచేటన్నారు. సమస్యను పరిష్కరించకుంటే అన్ని పార్టీలను కలుపుకొని మహోద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. పీసీసీ ప్రతినిధులు రమాదేవి, నరహరశెట్టి నరసిం హారావు, మస్తాన్ వలి, కొలనుకొండ శివాజీ, కంబగండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.