రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే | govenment save farmers | Sakshi
Sakshi News home page

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

Published Sun, Oct 23 2016 10:42 PM | Last Updated on Tue, Oct 2 2018 6:42 PM

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే - Sakshi

రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

ఈడుపుగల్లు (కంకిపాడు) : నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు డిమాండ్‌ చేశారు. ఈడుపుగల్లు గ్రామంలో ఎన్టీఆర్‌ మసూరి విత్తనాలు సాగు చేసిన వరి పొలాలను ఆదివారం మధ్యాహ్నం పల్ల్లంరాజుతో పాటు కాంగ్రెస్‌ పార్టీ ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు వీరమాచనేని శ్రీనివాసరావు, ముక్కామల రాజా తదితరులు మాట్లాడుతూ ఘంటసాలకు చెందిన ఉప్పాల ప్రసాద్‌ అనే రైతు నుంచి తాము ఎన్టీఆర్‌ మసూరి కొని వరి సాగు చేశామని చెప్పారు. పంట కాలం పూర్తి కావస్తున్నా ధాన్యం కంకులు రాలేదని ఎకరాకు రూ.22 వేలు వరకూ పెట్టుబడులు పెట్టామని తెలిపారు. కౌలు రూ.18 వేలు అదనమని వాపోయారు. తెగుళ్లు తట్టుకుంటుందని నమ్మి సాగు చేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిపించాలని కోరారు. మాజీ మంత్రి పల్లంరాజు విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ సర్టిఫై చేయని విత్తనాల వల్ల రైతులకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ఈడుపుగల్లులో 150 ఎకరాల్లో రూ.40 లక్షలు మేర రైతులు పెట్టుబడులు కోల్పోయారన్నారు. రైతులు నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రయోగాలు తప్పుకాదని, విత్తనం ఎంపిక సజావుగా జరగాలని, రైతులకు చేయూత అందించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, పీసీసీ కార్యదర్శులు నరహరిశెట్టి నర్సింహారావు, అన్వర్‌ హుస్సేన్, రత్నారావు, రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, అన్నే సుబ్బారావు (చంటి), మొవ్వా మోహన్‌రావు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
ఇబ్రహీంపట్నం : రెండున్నరేళ్ల పరిపాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నిఅంశాల్లో పూర్తిగా విఫలం చెందాయని కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు విమర్శించారు. తుమ్మలపాలెంలో కాంగ్రెస్‌ పార్టీ డీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్‌ లక్ష్మణ్‌ నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నూతన రాజధాని పేరుతో బలవంతపు భూసేకరణ చేయటం పాలకుల బాధ్యతారాహిత్యంగా పేర్కొన్నారు.  






 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement