ధార్ జిల్లాలోని గంద్వానీకి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ మాజీ అటవీ మంత్రి ఉమంగ్ సింఘర్ హనుమంతుడు ఆదివాసీయే అని వ్యాఖ్యలు చేశారు. హిందూ ఇతిహాసం అయిన రామాయాణ మహా కావ్యంలో కోతులుగా వర్ణించబడినవారు హనుమంతుని వలే గిరిజనులేనని అన్నారు. ఈ మేరకు ఆయన ధార్ జిల్లాలో గిరిజన నాయకుడు, స్వాంతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా 123వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హనుమంతుని గురించి ఈ విధంగా ప్రసంగించారు.
రాముడిని లంకకు తీసుకువెళ్లింది ఆదివాసీలు(వానర సేన) అని రామయణ కథలో రాశారు. దీనిని బట్టి ఆదివాసీలు అరణ్యాల్లో నివశించారని ఆ కథ ద్వారా మనకు తెలుస్తోంది కావున హనుమంతుడు కూడా ఆదివాసీయే. అందువల్ల మనం అతని వారసులం అని గర్వపడండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సింఘర్ అన్నారు. దీంతో మధ్యప్రదేశ్ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్ మండిపడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. వారు హనుమాన్ జీని దేవుడిగా భావించరు.
హనుమంతుడుని హిందువులు పూజించే దేవుడిగా అస్సలు గుర్తించరు అని ఫైర్ అయ్యారు. హనుమంతుడిని అవమానించారంటూ ఆరోపణలు చేశారు. హనుమంతుడి విషయంలో కాంగ్రెస్ ఆలోచన ఇదేనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ క్యాథలిక్ మత గురువులు భాష మాట్లాడుతున్నట్లుంది అని వెటకరించారు. ఇక మత మార్పిడిలు చేసేయండి అంటూ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాలను ట్యాగ్ చేశారు బీజేపీ అధికార ప్రతినిధి హితేష్ బాజ్‌పాయ్.
(చదవండి: పాతికేళ్ల ఎన్సీపీ.. పవార్ కీలక నిర్ణయం.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఆ ఇద్దరూ)
Comments
Please login to add a commentAdd a comment