ఇంటి రుణాలపై పన్ను మినహాయింపు ఎలా ఉంటుంది? ఏ మేరకు వర్తిస్తుంది? ఎంత పొదుపు చేయొచ్చు? ఇవన్నీ ఈ సారి ట్యాక్స్ కాలమ్‌లో చూద్దాం...
సెక్షన్ 80 ఈఈ ప్రకారం రూ.50,000...
1–4–2017 నుంచి అమల్లోకి వచ్చిన నియమాల ప్రకారం ఇంటి రుణం మీద వడ్డీ రూ.50,000 వరకు మినహాయింపు ఉంటుంది. అయితే కొన్ని నిబంధనలకు లోబడి ఈ మినహాయింపు ఉంటుంది. అవి...
1. ఇది వ్యక్తులకు మాత్రమే.
2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఏర్పడ్డ బ్యాంకుల నుంచే రుణం తీసుకోవాలి.
3.ఇంటి రుణం మంజూరు కోసం ఏర్పడిన పబ్లిక్ కంపెనీ అయినా ఫరవాలేదు.
4. ఇంటి నిమిత్తం రుణం తీసుకోవాలి.
5. 1–4–2016 నుంచి 31–3–2017 మధ్య మంజూరై... ఖర్చయిన రుణాలకు మాత్రమే వర్తిస్తుంది.
6.రుణం రూ.35,00,000పైగా ఉండకూడదు.
7. ఇంటి విలువ యాభై లక్షలు దాటకూడదు.
8.రుణం తీసుకున్న రోజు నాటికి వ్యక్తికి సొంతిల్లు ఉండకూడదు.
9. ఈ వడ్డీ మినహాయింపు మరే ఇతర సెక్షన్ ప్రకారం పొందకూడదు.
10. ఇది 1–4–2016 తర్వాత ఇల్లు కట్టుకున్న లేదా కొనుగోలు చేసిన వారికే వర్తిస్తుంది. పట్టణాల్లో ఈ బడ్జెట్ల ఇల్లు లోబడ్జెట్ ఇల్లనే చెప్పాలి. అయితే అంతకు ముందు కొన్న ఇల్లు విషయంలో తీసుకున్న రుణాల విషయంలో సెక్షన్ 24 ప్రకారం ఇచ్చిన వడ్డీ తగ్గింపులు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇంటి విషయంలో వడ్డీ రూ.2,00,000 దాటి ఇచ్చే వారు కాదు. అలాగే అద్దెకిచ్చిన ఇంటి రుణం విషయంలో వడ్డీ మీద ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ సెక్షన్ 71బి కొత్తగా తెచ్చి, కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎన్ని ఇళ్ల మీద రుణాలున్నా వడ్డీ మొత్తాన్ని రూ.2,00,000 దాటి సర్దుబాటు చేయరు. సర్దుబాటు కాని వడ్డీ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసి సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు... ఒక వ్యక్తి నికర జీతం రూ.15,00,000 అనుకోండి. సొంత ఇల్లుంది.
అప్పు కూడా ఉంది. రుణం మీద వడ్డీ రూ.1,00,000 అనుకోండి. ఇది కాకుండా మరో ఇల్లును రుణం మీద కట్టించాడు. అది అద్దెకిచ్చాడు. అద్దె నెలకు రూ.10,000. రుణం మీద వడ్డీ రూ.3,00,000 అనుకోండి. అప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కిస్తే.. ఈ కేసులో ఒకప్పుడు రూ.3,18,600 పూర్తిగా సెటాఫ్ చేసేవారు. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తం నష్టంలో కేవలం రూ.2,00,000 సర్దుబాటు చేస్తారు. మిగిలిన సర్దుబాటు కాని మొత్తాన్ని రూ.1,18,600 తర్వాతి ఆర్థిక సంవత్సరానికి (2018–19) సర్దుబాటు చేస్తారు. ఈ మార్పు వ్యక్తులకు పన్నుభారం పెంచుతుంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని ఇన్‌కమ్ ట్యాక్స్‌ను లెక్కించండి.
ఇంటి రుణం.. వడ్డీ మినహాయింపు
Published Mon, Jun 11 2018 2:08 AM | Last Updated on Mon, Jun 11 2018 2:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment