సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న దృష్ట్యా ఈనెల 21న కోర్టులో తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక కోర్టు అంగీకరించింది. తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఈనెల 21న జగన్ సీబీఐ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అనుమతిస్తూ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.
జగన్ హాజరుకు మినహాయింపు
Published Wed, Mar 19 2014 2:14 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement