పార్టీలకు పన్ను మినహాయింపు
రాజ్యాంగ విరుద్ధం కాదు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడమనేది పాలనా పరమైన నిర్ణయమని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) తోసిపుచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్, న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ బుధవారం ఉత్తర్వులిచ్చింది. సాధారణ పన్ను చెల్లింపుదారులతో పోల్చుకుంటే రాజకీయ పార్టీలకు రాజ్యాంగంలో ఎలాంటి మినహాయింపులు లేవని న్యాయవాది పిల్ దాఖలు చేశారు. సామాన్యులకు లేని మినహాయింపు రాజకీయ పార్టీలకు ఎందుకని ప్రశ్నించారు.