Government Recognition
-
స్టార్టప్‌లకు ఆదాయపన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు కలిగిన 2,975 స్టార్టప్‌లకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు లభించింది. 2023 డిసెంబర్ 31 నాటికి 1,17,254 స్టార్టప్‌లు ప్రభుత్వ గుర్తింపును పొందినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ సంజీవ్ తెలిపారు. ఆదాయపన్ను మినహాయింపు పొందిన స్టార్టప్‌లు 2023 మార్చి నాటికి 1,100గానే ఉన్నాయని, వాటి సంఖ్య ఇప్పుడు 2,975కు పెరిగినట్టు చెప్పారు. అర్హత సరి్టఫికెట్లు మంజూరు చేసేందుకు వీలుగా, దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించేందుకు ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్వోపీ) రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సరి్టఫికెట్ ఆధారంగానే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 1,500 దరఖాస్తులను మార్చి 31లోపే పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ‘‘స్టార్టప్‌లకు వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు మొత్తం విధానాన్నే మారుస్తున్నాం. అవి ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా చూస్తున్నాం’’అని సంజీవ్ తెలిపారు. ఇప్పటికే 1,800 పేటెంట్లను స్టార్టప్‌లకు జారీ చేసినట్టు చెప్పారు. స్టార్టప్‌లకు నిధుల కొరతపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడు ఈ ధోరణిలో మార్పు వచి్చందని, స్టార్టప్‌లు సైతం డెట్ నిధుల కోసం చూస్తున్నట్టు తెలిపారు. ‘‘ఈక్విటీ రూపంలో నిధులు తగ్గి ఉండొచ్చు. అలా అని వాటికి నిధులు లభించడం లేదని చెప్పడానికి లేదు. స్టార్టప్‌లు ఐపీవో మార్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటున్నాయి’’అని వివరించారు. స్టార్టప్‌ల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తదితర పథకాలను కేంద్ర సర్కారు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. -
తప్పుడు ప్రచారం జరుగుతోంది
‘‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబరులో దుబాయ్‌లో నిర్వహించాలనుకుంటున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఫంక్షన్‌కు, తమకు సంబంధం లేదని, టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదని తెలుగు, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయంపై శనివారం టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ స్పందిస్తూ– ‘‘మాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండియాలోని ఆర్టిస్టులకు అవార్డులు ఇవ్వనున్నాం. దీన్ని కాదనే హక్కు దామోదర ప్రసాద్, సునీల్ నారంగ్‌లకు లేదు. ‘టీఎఫ్‌సీసీ’ పేరుతో ట్రేడ్ మార్క్, టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ రిజిస్ట్రేషన్ చేయించాం. టీఎఫ్‌సీసీ నంది ఈవెంట్స్ పేరుతో దుబాయ్ ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకున్నాం. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుక జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం టీఎఫ్‌సీసీ నంది అవార్డులకు అనుమతితో కూడిన లెటర్ కూడా ఇచ్చింది’’ అన్నారు. -
గుర్తింపులేని ప్రైవేటు బడులు 165
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫీజులు దండుకోవడమే లక్ష్యంగా ప్రైవేటు విద్య పరుగెడుతోంది. విద్యార్థులనుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు మంగళం పాడుతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించకుండా కొనసాగుతున్న పాఠశాలలు కొన్నైతే.. అసలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా మరికొన్ని పాఠశాలలు బాహాటంగా నడుస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలో చదివిన విద్యార్థి ధ్రువపత్రాలను అధికారికంగా పరిగణనలోకి తీసుకోరు.అయినా జిల్లాలో గుర్తింపులేని పలు పాఠశాలలు ప్రచారంతో విద్యార్థులను దారిమళ్లిస్తున్నాయి. ఈ క్రమంలో జి ల్లాలో 165పాఠశాలలు ప్రభుత్వ గుర్తిం పు లేకుండా కొనసాగుతున్నాయని విద్యాశాఖ పరిశీలనలో వెల్లడైంది. దీంతో అధికారులు వెంటనే వాటిపై చర్యలు మొదలుపెట్టారు. కొనసాగిస్తే కేసులే.. జిల్లావ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న పాఠశాలలను గుర్తించిన విద్యాశాఖ అధికారులు.. ప్రాథమిక చర్యల్లో భాగంగా నోటీ సులు జారీ చేశారు. గతవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన మం డల విద్యాశాఖ అధికారులు గుర్తింపులేకుండా కొనసాగుతున్న స్కూళ్ల జాబి తాను తేల్చి జిల్లా విద్యాశాఖకు సమర్పించారు. దీంతో డీఈఓ ఆదేశాల మేరకు తమ పరిధిలోకి వచ్చే ఆయా స్కూళ్లకు ఎంఈఓలు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ గుర్తింపు వచ్చేవరకు పిల్లలను చేర్చుకోవద్దని, బడికి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులను ధిక్కరించి పాఠశాలలను కొనసాగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు వాటిని సీజ్ చేయనున్నట్లు తేల్చిచెప్పారు. అనుమతిలేని పాఠశాలలు 165 గుర్తించగా.. ఇందులో నగర శివారు మండలాలైన ఘట్కేసర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, ఉప్పల్, శేరిలింగంపల్లి, బాలానగర్లలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆకస్మిక తనిఖీలు.. ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేసేందుకు సమాయత్తమవుతోంది. అనుమతిలేని బడులు నడుస్తున్నట్టు గుర్తిస్తే సీజ్ చేసి, అందులోని పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ మండలస్థాయి అధికారులను ఆదేశించింది. ఇప్పటికే గుర్తింపులేని పాఠశాలల వివరాలను అన్ని మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచా రు. పిల్లలను పాఠశాలలో చేర్పించే ముందు తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయంలో సంప్రదిస్తే ఇబ్బందులుండవని జిల్లా విద్యాశాఖ అధికారి యం.సోమిరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
గుర్తింపు లేని పాఠశాలలపై కొరడా
- డీఈఓ విజయభాస్కర్ ఒంగోలు వన్‌టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై కొరడా ఝుళిపించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం నుంచి ప్రారంభ అనుమతి లేకుండా కొత్తగా పాఠశాలలను ప్రారంభించరాదు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించరాదని చట్టం చెబుతోంది. అయితే ఈ నిబంధనలన్నింటినీ తోసిరాజని కొందరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఎటువంటి గుర్తింపు, అనుమతులు లేకుండా పాఠశాలలను నిర్వహిస్తుండటంపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత విద్యాసంవత్సరంలోనే అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలకు భారీగా జరిమానాలు కూడా విధించారు. విద్యాహక్కు చట్టం అమలుల్లోకి వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలైంది. ఇప్పటికీ ఇంకా ఈ చట్టం నిర్దేశించిన అంశాలను తోసిరాజని కొత్త ప్రైవేట్ పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి. పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించొద్దు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పిండొద్దని డీఈఓ విజయభాస్కర్ విజ్ఞప్తి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించేటప్పుడు ఆ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తెలుసుకుని గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ప్రస్తుత విద్యాసంవత్సరం (2014-15)లో అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చదివి విద్యార్థులు నష్టపోతే దానికి తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్పించవద్దని తాము ముందుగానే హెచ్చరిస్తున్నందున విద్యార్థులు నష్టపోతే తమకేమీ బాధ్యత లేదన్నారు. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు జారీ చేసే స్టడీ సర్టిఫికెట్లు, టీసీలు చెల్లవని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 100కుపైగా ఒక్క ఒంగోలులోనే 27 ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్నారని, ఆ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించవద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అనుమతులు, గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని డీఈఓ హెచ్చరించారు.