గుర్తింపులేని ప్రైవేటు బడులు 165 | Unrecognized private schools | Sakshi
Sakshi News home page

గుర్తింపులేని ప్రైవేటు బడులు 165

Published Fri, Jun 13 2014 12:16 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

గుర్తింపులేని ప్రైవేటు బడులు 165 - Sakshi

గుర్తింపులేని ప్రైవేటు బడులు 165

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫీజులు దండుకోవడమే లక్ష్యంగా ప్రైవేటు విద్య పరుగెడుతోంది. విద్యార్థులనుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలు నిబంధనలకు మంగళం పాడుతున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించకుండా కొనసాగుతున్న పాఠశాలలు కొన్నైతే.. అసలు ప్రభుత్వ గుర్తింపు లేకుండా మరికొన్ని పాఠశాలలు బాహాటంగా నడుస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ గుర్తింపులేని పాఠశాలలో చదివిన విద్యార్థి ధ్రువపత్రాలను అధికారికంగా పరిగణనలోకి తీసుకోరు.అయినా జిల్లాలో గుర్తింపులేని పలు పాఠశాలలు ప్రచారంతో విద్యార్థులను దారిమళ్లిస్తున్నాయి. ఈ క్రమంలో జి ల్లాలో 165పాఠశాలలు ప్రభుత్వ గుర్తిం పు లేకుండా కొనసాగుతున్నాయని విద్యాశాఖ పరిశీలనలో వెల్లడైంది. దీంతో అధికారులు వెంటనే వాటిపై చర్యలు మొదలుపెట్టారు.
 
 కొనసాగిస్తే కేసులే..
జిల్లావ్యాప్తంగా గుర్తింపు లేకుండా నడుస్తున్న పాఠశాలలను గుర్తించిన విద్యాశాఖ అధికారులు.. ప్రాథమిక చర్యల్లో భాగంగా నోటీ సులు జారీ చేశారు. గతవారం క్షేత్రస్థాయిలో పర్యటించిన మం డల విద్యాశాఖ అధికారులు గుర్తింపులేకుండా కొనసాగుతున్న స్కూళ్ల జాబి తాను తేల్చి జిల్లా విద్యాశాఖకు సమర్పించారు. దీంతో డీఈఓ ఆదేశాల మేరకు తమ పరిధిలోకి వచ్చే ఆయా స్కూళ్లకు ఎంఈఓలు నోటీసులు జారీ చేశారు.
 
ప్రభుత్వ గుర్తింపు వచ్చేవరకు పిల్లలను చేర్చుకోవద్దని, బడికి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని నోటీసుల్లో స్పష్టం చేశారు. నోటీసులను ధిక్కరించి పాఠశాలలను కొనసాగిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు వాటిని సీజ్ చేయనున్నట్లు తేల్చిచెప్పారు. అనుమతిలేని పాఠశాలలు 165 గుర్తించగా.. ఇందులో నగర శివారు మండలాలైన ఘట్‌కేసర్, హయత్‌నగర్, సరూర్‌నగర్, ఉప్పల్, శేరిలింగంపల్లి, బాలానగర్‌లలోనే ఎక్కువగా ఉన్నాయి.
 
ఇక ఆకస్మిక తనిఖీలు..
ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తోంది. క్రమం తప్పకుండా తనిఖీలు చేసేందుకు సమాయత్తమవుతోంది.  అనుమతిలేని బడులు నడుస్తున్నట్టు గుర్తిస్తే సీజ్ చేసి, అందులోని పిల్లలను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ మండలస్థాయి అధికారులను ఆదేశించింది. ఇప్పటికే గుర్తింపులేని పాఠశాలల వివరాలను అన్ని మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచా రు. పిల్లలను పాఠశాలలో చేర్పించే ముందు తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయంలో సంప్రదిస్తే ఇబ్బందులుండవని జిల్లా విద్యాశాఖ అధికారి యం.సోమిరెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement