సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో వసూలు చేస్తున్న ఫీజుల దోపిడీని ప్రభుత్వం అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. అనేక రకాల ఫీజుల పేరుతో అధిక మొత్తంలో వసూలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశా రు. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు.