సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపే ఉత్తర్వులు జారీ చేస్తే అడ్మిషన్ల ప్రక్రియలో ఇబ్బందులుండవని పేర్కొంది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి లక్ష్మయ్య సోమవా రం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు స్కూళ్లలో విక్రయించే పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాం మార్కెట్ ధరలకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పేద పిల్లలకు రిజర్వేషన్లు కల్పించాలని, విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment