బెంగళూరు: రక్షణ రంగ సాంకేతిక అవసరాలకు ఉత్తమ పరిష్కారాలు చూపే స్టార్టప్‌లకు రక్షణ మంత్రిత్వ శాఖ 11 రకాలైన సవాళ్లను విసిరింది. ఈ నూతన ఆలోచనలు, ఆవిష్కరణలను పరిరక్షించటంతోపాటు మార్కెట్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ‘డిఫెన్స్ ఇండియా స్టార్టప్ చాలెంజ్’ను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో ప్రారంభించారు. చాలెంజ్‌లోని 11 సవాళ్లు ఇవీ..సెన్సర్లతో కూడిన వ్యక్తిగత రక్షణ వ్యవస్థలు, కార్బన్ ఫైబర్ వైండింగ్, యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, హార్డ్‌వేర్ బేస్డ్ ఆఫ్‌లైన్ ఎన్‌క్రిప్ట్ ఫర్ గ్రేడెడ్ సెక్యూరిటీ, 4జీ/ఎల్‌టీఈ ఆధారిత లోకల్ ఏరియా నెట్‌వర్క్ అభివృద్ధి, సీ త్రూ ఆర్మర్, ఆధునిక సాంకేతికతతో కూడిన నిర్లవణీకరణ వ్యవస్థ, నీరు, నూనెలను వేరు చేసే వ్యవస్థలు, రవాణారంగంలో వాడే కృత్రిమ మేథ, రిమోట్ ద్వారా నియంత్రించే విహంగాలు, లేజర్ ఆయుధ వ్యవస్థలు, నేలపైనా, నీటిలోనూ సంచరించే మానవ రహిత వాహనాలు.
Comments
Please login to add a commentAdd a comment